స్పాట్ లైట్

శరణు దక్కని శరణార్థులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వారాలకు వారాలు, నెలలకు నెలలు గడుస్తున్నా మైన్మార్‌లోని మైనారిటీ రోహింగ్యా ముస్లింల పరిస్థితి ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. మైన్మార్‌లోని రఖీనా రాష్ట్రానికి పరిమితమైన రోహింగ్యాలపై సైనిక దళాలు చేపడుతున్న చర్యలపై ఐరాస సహా ప్రపంచ దేశాలన్నీ తీవ్ర స్థాయిలో గర్హించాయి. దేశంలో ప్రజాస్వామ్యం కోసం దాదాపు రెండు దశాబ్దాల పాటు అవిశ్రాంత పోరాటం చేసిన అంగ్‌సాంగ్ సూకీ వ్యవహరిస్తున్న తీరును మానవ హక్కుల సంఘాలు నిరసించాయి. రోహింగ్యాలను ఏరివేయడమే లక్ష్యంగా మైన్మార్ సైనిక దళాలు చేపడుతున్న చర్యలు మానవత్వానికే తీరని మచ్చ అంటూ అభివర్ణించాయి. ఈ నేపథ్యంలో రఖీనా రాష్ట్రంపై చేపడుతున్న చర్యను తక్షణమే ఆపేయాలంటూ ఐరాస ఓ తీర్మానాన్ని చేపట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ముఖ్యంగా భద్రతామండలే రోహింగ్యాల అంశంపై జోక్యం చేసుకుని మైన్మార్ ప్రభుత్వాన్ని కట్టడి చేసే ప్రయత్నం చేసింది. నిన్నమొన్నటి వరకూ కేవలం మొక్కుబడిగానే సాగిన ఈ చర్యలు భద్రతామండలి జోక్యంతో మరింత తీవ్రతను సంతరించుకున్నాయి. ఉన్నచోట ఉండలేని పరిస్థితి ఎవరికైనా ఇబ్బందికరమే. ముఖ్యంగా ఒక దేశంలో తరతరాలుగా ఉంటున్న ప్రజలు తాము ఆదేశానికి చెందిన వారము కాదన్న భావనకు లోనయితే వారి పరిస్థితి ఎంత భయానకంగా ఉంటుంటో మాటల్లో చెప్పలేం. దాదాపు ఇలాంటి దుస్థితినే మైన్మార్ రోహింగ్యాలు ఎదుర్కొంటున్నారని చెప్పాలి. వందలు వేలల్లో కాదు లక్షల్లోనే రోహింగ్యాలు మైన్మార్ నుంచి పొరుగున ఉన్న బంగ్లా సహా అనేక దేశాలు పరారయ్యారు. పిల్లలు, పెద్దలు, మహిళలు తేడాలేకుండా రోహింగ్యాలు అందరిదీ ప్రాణభయమే. సొంత దేశంలో సైనిక దళాలు తరిమికొట్టే పరిస్థితి పొరుగుదేశంలో నిలువ నీడలేని దుస్థితి. ఇలా వారాలు తరబడి రోహింగ్యాలు అనుభవిస్తున్న ప్రత్యక్ష నరకంపై భద్రతామండలి స్పందించడం తక్షణమే సైనిక దాడులు నిలిపివేసి రోహింగ్యాలు పూర్తి భద్రతతో స్వదేశానికి వచ్చేలా పరిస్థితులు కల్పించాలని ఆదేశించడం కొంత ఊరట కలిగించే పరిణామం. 15 దేశాలతో కూడిన శక్తివంతమైన భద్రతా మండలి మైన్మార్ సర్కార్‌ను తీవ్ర పదజాలంతో ఆదేశించడంతోపాటు రోహింగ్యాలకు మానవీయ సహాయాన్ని అందించే విషయంలో ఎలాంటి పొరపాట్లకు తప్పిదాలకు తావుఉండకూడదని కూడా విస్పష్టంగా తెలియజేయడం మరింత ఊరటను కలిగించే అంశమే. బ్రిటన్,ఫ్రాన్స్‌లు ఈ విషయంలో ఓ స్పష్టమైన తీర్మానాన్ని చేపట్టేందుకు సహకరించడంతోపాటు మైన్మార్‌ను బలపరుస్తున్న చైనాను బుజ్జగించే విషయంలోనూ కీలకపాత్ర పోషించాయి.
మైన్మార్‌కు సంబంధించి ఐరాస భద్రతా మండలి ఈ తరహా కీలక తీర్మానాన్ని చేపట్టడం అన్నది గత దశాబ్దకాలంలో ఇది మూడోసారి. బౌద్ధమతస్తులు ఎక్కువగా ఉంటే మైన్మార్‌లో సైనిక దళాల అఘాయిత్యాలు, ఊచకోత, దాడుల పర్యవసనానంగా దాదాపు 6 లక్షల మంది ఇప్పటి వరకూ బంగ్లాదేశ్‌కు పరారయ్యారంటే అక్కడి పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్ధమవుతుంది. అయితే ఏ దేశమైనా ఇన్ని లక్షల మందికి ఆవాసాన్ని కల్పించడం అన్నది సొంత ప్రయత్నాలు ద్వారా సాధ్యంకాని పరిస్థితి. అటువంటిది ఆర్థికంగా వెనుకబడిన స్థితిలో ఉన్న బంగ్లాదేశ్ ఎంతమైరకు ఈ రోహింగ్యా శరణార్థులకు ఆశ్రయం ఇవ్వగలుతుంది? ఇతర దేశాల సహాయ, సహకారాలతో నిమిత్తం లేకుండా ఎన్నాళ్లని వీళ్లను ఆదుకుంటుందన్నది ప్రశ్నార్థకమే. సిరియా సహా అనేక కల్లోలిత దేశాల్లో ఉన్న పరిస్థితులను తాళలేక ఐరోపాతో పాటు అనేక దేశాలకు లక్షల్లోనే శరణార్ధులు పరారయ్యారు. అంతటి ధనిక దేశాల్లో శరణార్ధుల తాకిడిని తట్టుకోలేనప్పుడు చిరుదేశమైన బంగ్లా లక్షల్లో తరలివస్తున్న ఏమేరకు ఎంతకాలం ఆదుకోగలుగుతుందన్నది చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఐరాస భద్రతామండలి జోక్యం చేసుకోవడం, తక్షణమే సైనిక దాడులు నిలిపివేయాలని కోరడంతోపాటు పరారైన శరణార్ధులు తిరిగి వచ్చేందుకు గుణాత్మకమైన పరిస్థితులు కల్పించాలని కోరడం శాంతియుత పరిస్థితులు ప్రతిష్టాపన దిశగా ఓ బలమైన ముందగుడుగే. ముఖ్యంగా మైన్మార్ దీర్ఘకాలం పాటు సైనిక పాలనలో సాగింది.