స్పాట్ లైట్

చెప్పేదొకటి... చేసేదొకటి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీటికిమాటికి పాకిస్తాన్‌ను వెనకేసుకొచ్చే చైనా ధోరణి ఎప్పుడు ఎలా ఉంటుందో నమ్మలేని పరిస్థితి. 60వ దశకం తొలినాళ్లలో భారత్‌తో జరిగిన యుద్ధానంతర పరిస్థితి నుంచి డ్రాగన్ ఇదే ధోరణి కొనసాగిస్తునే వస్తుంది. అంతర్జాతీయంగా అన్ని రంగాల్లోనూ భారత్ తిరుగులేని శక్తిగా ఎదగడాన్ని జీర్ణించుకోలేకపోతున్న చైనా నాయకత్వం భారత్‌కు అనుకూలంగా ఉన్న దేశాలను తన వైపుతిప్పుకుంటోంది. ముఖ్యంగా పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహ్మద్ మసూద్ అజాద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే విషయంలో చైనా అడుగడుగునా అడ్డుపడడం భారత్‌తో దాని సంబంధాలను అనేక రకాలుగా దెబ్బతీసేదే అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఓ పక్క ఉగ్రవాదాన్ని అణచివేయాలని ఈ రకమైన కార్యకలాపాలను ప్రేరేపించే ఏ దేశమైన సహించడానికి వీల్లేదని ఓ పక్క ప్రకటనలు చేస్తునే భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడిన మసూద్‌ను వెనకేసుకు రావడం అతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటనించే చర్యలకు గండికొట్టడం అన్నది శాంతియుత సంబంధాలకు ఎంతమాత్రం దోహదం చేసేదికాదు. మసూద్ అజార్‌పై ఐరాస ఆంక్షల కమిటీ నిర్ణయాన్ని చైనా అడ్డుకోవడం అన్నది వరుసగా నాలుగోసారి. అయితే కమిటీ సభ్యదేశాల్లో ఏకాభిప్రాయం లేదంటూ చైనా చేస్తున్న ప్రకటనలు నేతి బీరకాయ చందమే. భారత్‌ను ఇతరాత్ర అడ్డుకోవాలంటే పాక్‌కు వెన్నుదన్నుగా నిలవాలన్న ఏకైక ఆలోచనే చైనాను ఈ రకమైన చర్యలకు పాల్పడేలా చేస్తుందన్నది వాస్తవం. ఓ పక్క శాంతియుత సంబంధాలు కోరుకుంటూ మరోపక్క వాటికి విఘాతం కలిగించే చర్యలకు చైనా ఒడిగట్టడం ఎంతమాత్రం సరైందికాదు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో ఎలాంటి వివక్షకూ ఆస్కారం ఉండకూడదు. కానీ చైనా వ్యవహారం గురివింద చందంగానే వ్యవహరించడం విడ్డూరం.