స్పాట్ లైట్

సాహసమే ఊపిరిగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బతుకు భారంగా మారితే... ఆ భారాన్ని భయం అధిగమిస్తే ప్రాణాలు రక్షించుకునే తెగింపు దానంతట అదే వచ్చేస్తుంది. మైన్మార్‌లో చిన్నాపెద్దా తేడా లేకుండా రోహింగ్యా మైనార్టీ ముస్లింలు ఎదుర్కొంటున్న జీవన్మరణ సమస్య ఇదే. ఉన్నచోట బతికే పరిస్థితి లేదు, మరోచోట మనుగడ సాగించే అవకాశమూ లేదు. అయినా కూడా ప్రాణాలకు తెగించి జీవనం సాగించాల్సిన అనివార్య పరిస్థితి రోహింగ్యా ముస్లింలది. గత కొన్ని వారాలుగా మైన్మార్ సైనిక దళాల ఊచకోతలో వందల సంఖ్యలోనే రోహింగ్యాలు మరణించారు.
ఇంకా అదే తరహాలో ఈ మైనార్టీల ఏరివేత కొనసాగడంతో ప్రతి ఒక్కరిలోనూ భయం ఆవహించింది. ఎలాగైనాసరే ప్రాణాలకు తెగించైనా సరే మరో ప్రాంతానికి వెళ్లిపోవాలన్న పట్టుదల మొదలైంది. అసలు నది అంటే ఏమిటో తెలియని ఈత ఏమాత్రం చేతకాని చిన్నారులు అదే తెగింపుతో నదిని ఈది పొరుగున వున్న బంగ్లా చేరుకుంటున్నారు. 13 సంవత్సరాల ఓ బాలుడికి అసలు ఈత అంటే తెలియదు. కానీ మైన్మార్‌లోని తన గ్రామంలో ఉండలేని పరిస్థితి. ప్రాణాలు పోతే పోయాయి. భయంలో ఎన్నాళ్లు బతుకుతామన్న తెగింపు అతడికి ఈత నేర్పింది. ఆ గుండె ధైర్యంతోనే ఆ నదిని దాటేశాడు. ఆవిధంగా బంగ్లా చేరుకున్నాడు. ప్రతి అపాయానికి ఓ ఉపాయం ఉంటుంది. ఆ ఉపాయమే ఎందరో రోహింగ్యా చిన్నారులను సైనిక గండం గట్టెంక్కించింది. ఓ తీరం నుంచి మరో తీరం చేరుకునేలా మార్గాంతరాన్ని అందించింది. దాదాపు రెండున్నర మైళ్ల పొడవున్న ఈ జలమార్గాన్ని ఈదేశాడు. ఈ బాలుడే కాదు మరికొంతమంది చేతకాని ఈతలో ఆరితేరారు. ఇటు ప్రాణాలూ దక్కించుకున్నారు, భారం తీరిందంటూ పొరుగు తీరంపై తేలి ఊపిరి పీల్చుకున్నారు. కేవలం వారం వ్యవధిలోనే దాదాపు 35మంది ఈ ముక్కుపచ్చలారని బాలురు వంటనూనెల ప్లాస్టిక్ డబ్బాలనే ఆలంబనగా చేసుకుని ఆ ఉపాయంతోనే ప్రాణాలు దక్కించుకోగలిగారు. నాఫ్ నదిని ఈ ఉపాయంతోనే ఈదగలిగారంటే అది వారి ఆలోచనకే కాకుండా వారిలో ఎంతగా భయం గూడుకట్టుకుందో, తమ గ్రామంలో ఇంకా వుంటే ఉన్న ప్రాణాలూ ఉండవన్న ఆందోళన వారిని ఎంతగా ఆవహించిందో స్పష్టం చేసేదే. ‘ఉంటే చంపేస్తారేమోనన్న భయం.. వీరి చేతిలో చావడం కంటే ఈత రాకపోయినా జలసమాధి కావడమే మేలన్న ఆలోచన నాకొచ్చింది. అందుకే నా చేతిలో వున్న నూనె డబ్బా నా ప్రాణాలు దక్కిస్తుందా? ఒక తెట్టులా నన్ను కాపాడుతుందా అన్న నమ్మకం కంటే ఇక్కడినుంచి వెళ్లిపోవాలన్న పట్టుదలే నన్ను ముందుకు నడిపించింది’ అంటూ నబీ అనే ఓ బాలుడు ఆవేదనగా అన్న మాటలు మైన్మార్‌లోని రఖీనా రాష్ట్రంలో రోహింగ్యాల పరిస్థితినే కాకుండా దైనందినంగా వారు ఎలాంటి నరక యాతనను అనుభవిస్తున్నారో కళ్లకు కట్టేదే.