స్పాట్ లైట్

ఇది తగునా సూకీ?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోహింగ్యా ముస్లింల విషయంలో తీవ్ర ప్రతికూలతను ఎదుర్కొంటున్న మైన్మార్ నాయకురాలు ఆంగ్‌సాంగ్ సూకీ మొత్తం వలస విధానాలపైనే విరుచుకుపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు సంక్షోభంలోనూ అస్థిర రాజకీయ పరిస్థితుల్లోనూ కొట్టుమిట్టాడటానికి ప్రధాన కారణం ఈ అక్రమ వలసదారులేనని సూకీ చెప్పడం సర్వత్రా విమర్శలకు కారణమవుతోంది. ఈ అక్రమ వలసదారుల వల్ల ఉగ్రవాదం కూడా అనేక దేశాల్లో తీవ్రమవుతోందని చెప్పడం ద్వారా రోహింగ్యాల విషయంలో తమ ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకు సూకీ ప్రయత్నించారు. వందలాది రోహింగ్యా ముస్లింలను మైన్మార్ ప్రభుత్వం తరిమికొడుతోందన్న ఆరోపణలు ఈ నోబెల్ శాంతి బహుమతి గ్రహీత నాయకత్వ పటిమను, మానవీయ దృక్కోణానే్న ప్రశ్నార్థకంగా మార్చాయి. ముఖ్యంగా రోహింగ్యాలను అక్రమ వలసదారులుగా చిత్రీకరించేందుకే సూకీ ప్రయత్నిస్తున్నారన్న విమర్శలూ అంతర్జాతీయంగా వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం అన్ని విధాలుగా మార్పులను సంతరించుకుంటున్న ప్రపంచ దేశాల్లో కొత్త ప్రమాదాలూ, ఉత్పాతాలూ, రాజకీయ సంక్షోభాలు తలెత్తడానికి ప్రధాన కారణం ఈ అక్రమ వలసదారులేనని మరింత గట్టిగా చెప్పడం ద్వారా తమ ప్రభుత్వంపై వస్తున్న అంతర్జాతీయ విమర్శలను తిప్పికొట్టేందుకే సూకీ ప్రయత్నించారని విశే్లషకులు భావిస్తున్నారు. ఉగ్రవాదం, మితిమీరిన తీవ్రవాదం, సామాజిక అశాంతి, చివరికి అణుయుద్ధ ప్రమాదాలు కూడా ఈ వలసదారుల వల్లే కలుగుతాయన్నది సూకీ భావనగా కనిపిస్తోంది. ఈ రకమైన సంక్షోభాల వల్లే సమాజాల్లో శాంతి నశించిపోతుందని, అభివృద్ధి హరించుకుపోతుందని, పేదరికమూ వెల్లువెత్తుతుందన్నది కూడా సూకీ విశే్లషిస్తున్నారు. ఓ దేశ విదేశాంగ మంత్రిగా పనిచేస్తున్న సూకీ వలసదారుల విషయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమిటన్న విమర్శలు తీవ్రమవుతున్నాయి. అయితే దేశ విదేశాంగ మంత్రిగా ఉన్నప్పటికీ మైన్మార్‌కు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన నాయకురాలిగా గణుతికెక్కినప్పటికీ దేశ సైన్యంపైన, పాలనాపరమైన అంశాలపైన ముఖ్యంగా రోహింగ్యాలు అధిక సంఖ్యలో నివసిస్తున్న రఖీనా రాష్ట్రంలో జరుగుతున్న సైనిక చర్యలపైన కూడా సూకీకి ఎలాంటి అధికారం లేదు. కానీ ఆమె వ్యాఖ్యలు ఈ రకమైన ఏరివేత చర్యలను మరింతగా ప్రోత్సహించేవిగా ఉండటం ఎంతమాత్రం క్షంతవ్యం కాదన్న వాదన వినిపిస్తోంది.