స్పాట్ లైట్

ఇరకాటంలో మెర్కెల్ ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దశాబ్దాలపాటు జర్మనీని తిరుగులేని అధికారంతో పాలించిన ఏంజెలా మెర్కెల్ ఇప్పుడు అనూహ్యమైన రాజకీయ సంక్షోభంలో పడ్డారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్లమెంటులో మెజారిటీ తగ్గడంతో ఆమె సారథ్యంలోని అధికార పార్టీ మనుగడ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పార్లమెంటులో పూర్తి మెజారిటీ లేకపోవడంతో మరో చిన్న పార్టీ మద్దతుతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాల్సి రావడం, అదికూడా అనేక మలుపులు, మెలికలమయంగా మారడంతో మెర్కెల్ ఇరకాటంలో పడ్డారు. చిన్న పార్టీలతో చర్చలు జరిపి వాటి డిమాండ్లనూ అంగీకరించడం ద్వారా సునాయాసంగానే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయవచ్చునని, ఆ విధంగా తన చాన్సలరీని కొనసాగించవచ్చునని భావించిన మెర్కెల్‌కు అనూహ్యమైన సవాలే ఎదురైంది. మెర్కెల్ సారథ్యంలోని కన్సర్వేటివ్ పార్టీ నేతలు గ్రీన్స్, వ్యాపార అనుకూల ఎఫ్‌డిపి పార్టీలతో జరిపిన చర్చలు కుప్పకూలిపోవడంతో ఈ పరిస్థితి ఎదురైంది. ఐరోపాలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతున్న జర్మనీలో రాజకీయ సంక్షోభం తీవ్రమైతే దాని ప్రభావం, పర్యవసానాలు ఇతర దేశాలపై అనూహ్యంగానే ఉంటాయి. అయితే ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు మెర్కెల్ ఏ రకమైన వ్యూహాన్ని అనుసరించబోతున్నారు, ఆమె చేసే ప్రతిపాదనలకు ప్రభుత్వంలో చేరాలనుకుంటున్న పార్టీలనుంచి ఏ రకమైన ప్రతిస్పందన ఉంటుందన్న దానిపైనే దేశ రాజకీయ భవితవ్యం ఆధారపడి వుంది. ప్రస్తుతానికి ఈ చర్చలు కుప్పకూలినప్పటికీ మరింతగా రాజీ ప్రయత్నాలు సాగించి అనుకున్న లక్ష్యాన్ని చేకూరవచ్చునన్న మెర్కెల్ ఆలోచనలు సాకారమయ్యే ఆలోచనలు కనిపించడం లేదు. ఇప్పటికే నెల రోజులుగా ఈ పార్టీల మధ్య ఎడతెగని మంతనాలు జరుగుతున్నాయి. తాజా ప్రయత్నాలు విఫలం కావడంతో తదుపరి మార్గాంతరం ఏమిటన్నది ఉత్కంఠను రేకెత్తిస్తోంది. జర్మనీ అధినేతగా మెర్కెల్‌కు తిరుగులేని అనుభవం ఉంది. ఐరోపా యూనియన్‌కు సంబంధించిన ఎన్నో కీలక సమస్యలను సవాళ్లను ఆమె సునాయాసంగానే అధిగమించగలిగారు. మరి ఈ అంతర్గత రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొనే విషయంలో ఆమె అనుభవం ఏ మేరకు అక్కరకు వస్తుందన్నది కూడా ఉత్కంఠకు దారితీస్తోంది. కొత్త ప్రభుత్వాన్ని నిర్ణీత గడువులో ఏర్పాటుచేయడంలో మెర్కెల్ విఫలమైతే అంతిమంగా అది ఆమె పదవికే ముప్పు తెచ్చే అవకాశం ఉంటుంది. ప్రధానంగా వలస విధానాలు పర్యావరణ పరమైన అంశాలు ఈ పార్టీల మధ్య తీవ్ర విభేదాలకు కారణమవుతున్నాయి. అలాగే ఐరోపా ప్రయోజనాలకు సంబంధించి బ్రిటన్‌తో జరిపే చర్చల్లో ఏవిధంగా రాజీ పడకూడదన్న పట్టుదలను ఈ పార్టీలు కనబరుస్తున్నాయి. వీటి విషయంలో అంత త్వరితగతిన పరిష్కారం అందే అవకాశం కనిపించడం లేదు. అలాగని చర్చలే జరపకుండా ఉంటే అది మెర్కెల్ నాయకత్వానికే తీరని మచ్చగా మారిపోయే అవకాశం ఉంది. ఈ విషయంలో ఆమె ఏమాత్రం మొండిగా వ్యవహరించినా ఇతర పార్టీలు తమ డిమాండ్లపై మరింత పట్టును బిగించే అవకాశమూ కనిపిస్తోంది. ఇప్పటికే మెర్కెల్ పార్టీకి విధేయంగా ఉన్న నేతల మధ్య, అలాగే మిత్రపక్షాల మధ్య అధికార పోరాటం మొదలైంది. ముఖ్యంగా కొత్తగా దేశంలోకి వచ్చే శరణార్థుల విషయంలో పరిమితి విధించాలని ఈ పార్టీలు తమ నాయకుడు హోర్‌స్ట్ సీ హూపర్‌పై తీవ్ర ఒత్తిడినే తెస్తున్నాయి. ఈ విషయంలో ఆయన తన పట్టును మరింత బిగిస్తే దాన్ని ఎదుర్కొనే విషయంలో మరింత ఇరుకునపడే అవకాశం కూడా కనిపిస్తోంది. జర్మనీ రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు జరిగిన తర్వాత కొత్త ప్రభుత్వం నిర్ణీత కాలవ్యవధిలో ఏర్పడాలన్న నిబంధన ఏమీ లేదు. చర్చల ప్రక్రియను కొనసాగిస్తూనే జర్మనీ చాన్స్‌లర్‌గా కొత్త ప్రభుత్వ ఆపద్ధర్మ సారధిగా మెర్కెల్ దీర్ఘకాలం పాటు కొనసాగేందుకు దీని ప్రకారం అవకాశం ఉంటుంది. ఇదే జరిగితే జర్మనీకి ఓ బలమైన ప్రభుత్వం అంటూ లేకుండా పోతుంది. అతి పెద్ద ఓ ఆర్థిక వ్యవస్థకు బలమైన నాయకత్వం లేకపోవడం అంటే అది మొత్తం ఐరోపా యూనియన్ ఆర్థిక, రాజకీయ మనుగడపైనే ప్రభావం కనిపిస్తుంది. ప్రస్తుత సంక్షోభాన్ని పరిష్కరించేందుకు మెర్కెల్ ముందున్న మరో అవకాశం మరో సంకీర్ణ భాగస్వామ్య పక్షాన్ని వెతుక్కోవడమే. తాజాగా సోషల్ డెమోక్రటిక్ పార్టీని చేరదీసేందుకు మెర్కెల్ ఇప్పటికే సంకేతాలు పంపినట్లుగా చెబుతున్నారు. గత నాలుగు సంవత్సరాలుగా మెర్కెల్ సారథ్యంలోని ప్రభుత్వంలో ఈ పార్టీ భాగస్వామ్య పక్షంగానే కొనసాగింది. ప్రస్తుత పరిస్థితుల్లో పార్లమెంటులో మెజారిటీ రావాలంటే సోషల్ డెమోక్రాట్ పార్టీని చేరదీయడం తప్ప మెర్కెల్‌కు మరో అవకాశం లేదు. ఎన్నికలు జరగడానికి ముందు మెర్కెల్ సారథ్యంలోని కన్సర్వేటివ్ కూటమి, ఎస్‌పిడి పార్టీకి పార్లమెంటులో తిరుగులేని మద్దతు ఉండేది. అయితే సెప్టెంబర్‌లో జరిగిన ఎన్నికలు అధికార పార్టీకి మెజారిటీ తగ్గడంతో పరిస్థితి ప్రతికూలించింది. అంతకుముందు వరకు మెర్కెల్‌ను సమర్థించిన ఎస్‌పిడి నేతలు తాము ప్రతిపక్షంలోనే కూర్చుంటామని చెప్పడమూ తాజా సంక్షోభానికి కారణమైంది. ప్రస్తుత సంకేతాలను బట్టి మైనార్టీ ప్రభుత్వానికే మెర్కెల్ సారథ్యం వహిస్తారా? లేదా వచ్చే ఏడాదిలో మరోసారి ఎన్నికలకు సిద్ధమవుతారా అన్నది చర్చనీయాంశంగా మారింది. అందుకు ఎంతమేరకు ఆస్కారం ఉందన్నది వేచిచూడాల్సిందే.