స్పాట్ లైట్

అదిగో వెలుగు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోజులు, వారాలు, నెలల తరబడి మైన్మార్ రోహింగ్యాలది ప్రత్యక్ష నరకమే. చిన్నాపెద్దా తేడా లేకుండా రోహింగ్యాలందరూ నరక యాతనలే అనుభవించారు. ఉన్న రాష్ట్రంలోనే నిలువ నీడలేని పరిస్థితులు ఎదుర్కొన్నారు. మాతృదేశమైన మైన్మార్ సైన్యమే తమను అన్యులుగా భావించి తరిమికొడుతుంటే హాహాకారాలు చేస్తూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పొరుగున ఉన్న బంగ్లాతోపాటు ఇతర దేశాలకు వలసపోయారు. ఇలా వలసవెళ్లిన వారి సంఖ్య వందలూ, వేలూ కాదు.. లక్షల్లోనే ఉంది. మైన్మార్‌లోని రఖీనా రాష్ట్రానికే పరిమితమైన ఈ మైనారిటీ రోహింగ్యా ముస్లింలు తరతరాలుగా మైన్మార్‌లోనే ఉంటున్నా వారికి దిక్కూమొక్కూ ఎలాంటి గుర్తింపు లేని పరిస్థితే. తాము ఎవరిమో, ఎక్కడి వారిమో నిరంతరం రుజువు చేసుకోవాల్సిన మానసిక వ్యధ, బాధ వారిది. మైన్మార్‌లో ప్రజాస్వామ్య హక్కులకోసం అహరహం శ్రమించి అంతిమంగా సైనిక పాలకులను దారికితెచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించిన ఘనత సాధించిన ఆంగ్ సాంగ్ సూకీ కూడా రోహింగ్యాల విషయంలో అంతర్జాతీయ ఒత్తిడి తీవ్రమయ్యేవరకు ఏమీ చేయలేకపోయారు. ఐక్యరాజ్య సమితిసహా ప్రపంచ దేశాలన్నీ సూకీ ధోరణిని నిరసించాయి. వలదారులవల్లే అనార్థాలంటూ ఆమె చేసిన వ్యాఖ్యలనూ గర్హించాయి. ఎట్టకేలకు ఐక్యరాజ్య సమితి విజ్ఞప్తి మేరకు రోహింగ్యాలను స్వరాష్ట్రానికి తీసుకెళ్లేందుకు మార్గం సుగమం కావడం వీరి కడగళ్లకు తెరదించినట్టే అయింది. బంగ్లాదేశ్, మైన్మార్ దేశాల మధ్య సూకీ నేతృత్వంలో కుదిరిన ఒప్పందం అనేక రకాలుగా ఈ బాధిత మైనారిటీలకు కొండంత ఊరట కలిగించింది. భరించలేని పేదరికం, ఆకలి మంటలు, అనునిత్యం నీడలా వెంటాడుతున్న వాటిని భరించి, సహించి ఎప్పటికైనా సొంత రాష్ట్రానికి వెళ్లకపోతామా? తమను తరిమికొట్టిన దేశమే మళ్లీ తమను సమాదరించకపోతుందా అన్న రోహింగ్యాల నమ్మకమే వారి మనుగడను నిలబెట్టింది. తాజా ఒప్పందం పుణ్యమా అని బంగ్లాలోని రోహింగ్యాలు దర్జాగా స్వరాష్ట్రానికి తిరిగి వెళ్లే పరిస్థితులు ఏర్పడడం మానవత్వానికి లభించిన విజయం. ఎవరెలాపోతే తమకేటమిటన్న నిర్లిపత్తతను విడనాడి ఎక్కడ మానవ హక్కులకు భంగం కలిగినా ఆ పరిస్థితిని చక్కదిద్దేందుకు మేమున్నామన్న దేశాలు ఎన్నో ఉన్నాయని చెప్పడానికి రోహింగ్యాల ఉదంతమే నిదర్శనం. దాదాపు 6లక్షల మంది రోహింగ్యాలకు అన్ని విధాలుగా సమస్యల్లో కూరుకుపోయిన బంగ్లాదేశ్ ఆవాసం కల్పించడం అంటే మామూలు వ్యవహారం కాదు. కేవలం మానవత్వ విలువలతోనే, మానవీయ దృక్పథంతోనే బంగ్లాదేశ్ ఈ విశాల హృదయాన్ని కనబర్చింది. రోహింగ్యాల తాకిడికి గురైన దేశాల్లో భారత్ కూడా ఉంది. వేల సంఖ్యలో భారత్‌లోని అనేక రాష్ట్రాల్లో రోహింగ్యాలు నివసిస్తున్నారు. ఈ రోహింగ్యాల వల్ల దేశ భద్రతకే ముప్పు వాటిల్లే ప్రమాదముందని, పాకిస్తాన్ ఉగ్రవాద శక్తులతో వీరికి సంబంధాలున్నాయంటూ దేశ నిఘా వర్గాలు హెచ్చరించిన సందర్భాలూ ఉన్నాయి. తాజా ఒప్పందం నేపథ్యంలో బంగ్లా నుంచి రోహింగ్యాలను వెనక్కి పంపేందుకు క్రమానుగతంగా మార్గం సుగమం అయ్యే అవకాశం ఉంది. అయితే ఇందుకు ఐక్యరాజ్య సమితి ప్రమేయం కల్పించుకోవాలని నిర్ణీత కాల వ్యవధిలోనే ఈ శరణార్థులను వెనక్కి పంపే ప్రక్రియను నిర్ధారించాలని బంగ్లా కోరింది. ఏదేమైనా మరికొన్ని వారాల్లో రోహింగ్యాలను వెనక్కి పంపే ప్రక్రియ మొదలవుతుంది. దాని ప్రకారమే భారత్ కూడా తమ దేశంలోని రోహింగ్యాలను వెనక్కి పంపుతుందా అన్నది వేచి చూడాల్సిందే. ఉన్నపళంగా బంగ్లానుంచి రోహింగ్యాలను వెనక్కి పంపేసినా మైన్మార్‌లోని వారి సొంత రాష్టమ్రైన రఖీనాలో దిక్కూమొక్కు లేని పరిస్థితే స్వాగతం పలుకుతుంది. ఎందుకంటే సైనిక దాడిలో సర్వం ధ్వంసమైంది. ఏ ప్రాంతం ఎవరిదో? ఏ ఇల్లు ఎవరిదో గుర్తుపట్టలేనంతగా అక్కడ విధ్వంసం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో రోహింగ్యాలను వెనక్కి పంపినా మళ్లీ వాళ్లు నిలదొక్కుకునేందుకు తాత్కాలికంగానైనా శరణార్థ శిబిరాలను ఏర్పాటు చేయక తప్పని పరిస్థితి. వందలాది గ్రామాలు సైనిక దాడుల్లో ధ్వంసమైన నేపథ్యంలో ఇంతమంది మైనారిటీలు మళ్లీ ఎక్కడ స్థిరపడతారో అన్నది కూడా మైన్మార్‌కు కొత్త సమస్యను రగిలించేదే అవుతుంది. ఓ వ్యూహం ప్రకారం రోహింగ్యాలను తరిమికొట్టేందుకు ప్రయత్నించిన మైన్మార్ లక్షల్లో తిరిగివచ్చే వారందరికీ పూర్తి భద్రతను కల్పిస్తుందన్న హామీ ఉండదన్న ఆందోళనా వ్యక్తమవుతోంది. మొత్తం మీద ఈ ప్రక్రియపై ఐక్యరాజ్య సమితి ప్రత్యేక దృష్టి సారించి రోహింగ్యాల భద్రతకు పూచీ తీసుకుంటే తప్ప వారి ప్రాణాలకూ దిక్కూమొక్కూ ఉండదన్నది వాస్తవం.