స్పాట్ లైట్

గల్ఫ్ కూటమికి కతార్ ఎసరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత మూడున్నర దశాబ్దాలుగా బలమైన ప్రాంతీయ కూటమిగా ఆరు దేశాలతో రాణిస్తున్న గల్ఫ్ సహకార మండలి ఉనికికే ముప్పు వాటిల్లే పరిస్థితులు తీవ్రమవుతున్నాయి. ఈ మండలి శిఖరాగ్ర సదస్సు ప్రారంభమైన నేపథ్యంలో సౌదీ అరేబియా, దాని మిత్రదేశాలు ఏ వైఖరిని అవలంబించబోతున్నాయన్నది ఉత్కంఠను రేకెత్తిసోంది. ముఖ్యంగా కతార్ వ్యవహారంలో సౌదీ అరేబియా ప్రతికూల వైఖరి అవలంబించడంతో ఈ చర్చలకు ఆ దేశాన్ని ఆహ్వానిస్తారా లేదా అన్నది అనుమానాలు రేకెత్తిసోంది. జిసిసిగా పేర్కొనే గల్ఫ్ సహకార మండలిలోని ఆరు దేశాలూ చమురు సమృద్ధమైన దేశాలే. గత కొన్ని నెలలుగా జిసిసి సభ్య దేశమైన కతార్‌కు సౌదీ అరేబియా, దాని మిత్ర దేశాలకు మధ్య తీవ్రస్థాయిలో సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. ఎప్పుడైతే ఈ సమావేశానికి కతార్‌ను ఆహ్వానించారన్న విషయం స్పష్టమైందో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బెహ్రెయిన్ దేశాల నేతలు ఈ శిఖరాగ్ర సదస్సుకు హాజరవుతారా లేదా అన్నది అనుమానంగా మారింది. ఇస్లాం ఉగ్రవాద గ్రూపులకు మద్దతు ఇస్తోందని ఆరోపిస్తూ కతార్‌తో అన్ని విధాలుగానూ గల్ఫ్ దేశాలు సంబంధాలను తెగతెంపులు చేసుకున్న విషయం తెలిసిందే. అంతేకాదు, షియాల పాలనలో ఉన్న ఇరాన్‌తో కతార్ సన్నిహిత సంబంధాలను పెంపొందించుకోవడం గల్ఫ్ దేశాలకు ఏమాత్రం గిట్టడం లేదు. అయితే తమపై చేస్తున్న ఆరోపణలన్నీ కూడా నిరాధారమైనవేనంటూ గల్ఫ్ సారథ్యంలోని ఈ కూటమిపై ఎదురుదాడికి దిగిన కతార్ తనదైన శైలిలోనే పావులు కదుపుతోంది. ఈ పరిణామాలన్నీ మొత్తం గల్ఫ్ కూటమి భవితవ్యానే్న ప్రశ్నార్థకంగా మార్చే సంకేతాలు ప్రస్ఫుటమవుతున్నాయి. ఇదే జరిగితే గల్ఫ్ దేశాల ఆర్థిక ఐక్యత కూడా బలహీనపడే అవకాశం ఉంది. కారణం ఇప్పటికే ఈ దేశాలు ఉమ్మడి యూనియన్, ఉమ్మడి మార్కెట్, సింగిల్ కరెన్సీ, ఒకే బ్యాంక్ ప్రాతిపదికన ముందుకు సాగుతున్నాయి. అయితే ఇవేవీ కూడా పూర్తిస్థాయిలో అమలుకాని పరిస్థితుల్లో ఇప్పుడు కతార్ వ్యవహారం తెరపైకి రావడం సమస్యను మరింత తీవ్రతరం చేసింది.