స్పాట్ లైట్

మిత్రుడికి మొట్టికాయ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎక్కడైనా మిత్రదేశం గానీ నిధుల దగ్గర కాదంటూ పాక్‌కు చైనా షాక్ ఇచ్చింది. చైనా ఆదుకుంటుందని అన్నివిధాలుగా తమకు వెన్నుదన్నుగా నిలుస్తుందని ఆశించిన పాక్‌కు ఆశనిపాతమే ఎదురైంది. భారత్‌తో కయ్యానికి పాక్‌ను పావుగా వాడుకుంటున్న చైనా తాజా ధోరణి పాక్ పాలకులకు మింగుడు పడటం లేదు. ఇరు దేశాల మధ్య స్నేహ వారధిగా, అభివృద్ధికి తొలి అడుగుగా చెప్పుకుంటూ వచ్చిన చైనా-పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ (సిపిఇసి) నిధుల్లో కోత పెట్టాలని చైనా నిర్ణయించడమే ఇందుకు కారణం. దీంతో ఈ కారిడార్‌కు అనుసంధానంగా నిర్మించాల్సిన మూడు రోడ్ల నిర్మాణం అగమ్యగోచరంగా మారింది.
ఈ ప్రాజెక్టుకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను రూపొందిస్తామని చైనా స్పష్టం చేయడంతో పాక్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారింది. ఇచ్చిన నిధులను పాక్ సక్రమంగా వినియోగించుకోవడం లేదనీ, అవినీతి తాండవిస్తోందన్న కథనాలే చైనా వెనకడుగు వేయడానికి ప్రధాన హేతువుగా కనిపిస్తోంది. త్వరలో బీజింగ్ కొత్త మార్గదర్శకాలు వెలువరిస్తుందని, నిధుల విడుదలపైనా స్పష్టత వస్తుందని ఆ సమావేశంలో పాకిస్తాన్‌కు చైనా స్పష్టం చేసినట్లు డాన్ పత్రిక వెల్లడించింది. ముఖ్యంగా గ్వాదర్ పోర్టులో చైనా కరెన్సీని అనుమతించేది లేదని పాకిస్తాన్ భీష్మించడంతో చైనా పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. దీని ప్రభావం మొత్తం చైనా-పాక్ ఆర్థిక కారిడార్ నిర్మాణంపై ప్రత్యక్షంగా పడబోతోంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో నిర్మించబోయే డ్యామ్‌కు చైనా నిధుల విడుదల ప్రశ్నార్థకంగా మారింది. ప్రతీకారంతోనే చైనా నిధుల నిలిపివేత నిర్ణయానికి వచ్చిందా అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఇరు దేశాల మధ్య ఈ కారిడార్‌కు సంబంధించి ప్రస్తుతమున్న ఒప్పందంలో మార్పులు జరిగిన పక్షంలో ఆర్థిక కారిడార్ ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావానే్న చూపుతుందనడంలో ఎలాంటి అనుమానం లేదు. పాకిస్తాన్ అభివృద్ధి సమస్యలకు ఆర్థిక కారిడార్ నిర్మాణమే పరిష్కారమని ఇప్పటివరకూ చెప్పుకుంటూ వచ్చిన విషయం తెలిసిందే. చైనా నిలిపివేసిన మూడు రహదారుల నిర్మాణ ప్రతిపాదన పాకిస్తాన్ ప్రభుత్వ అభివృద్ధి ప్రణాళికలో భాగం. వీటిని గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన సమావేశంలో సిపిఇసి గొడుకు కిందికి తెచ్చారు. ఈ మూడు రహదార్ల నిర్మాణానికి సంబంధించిన నిధుల విషయాన్ని అదే నెలాఖరులో జరిగిన సమావేశంలో జాయింట్ వర్కింగ్ గ్రూప్ సమావేశంలో మంజూరు చేయాలని నిర్ణయించారు కూడా. ఈ మూడు ప్రాజెక్టుల్లో రెండు స్థానికంగా అనుసంధానం చేసే రహదారులు. రాయ్‌కోట్ నుంచి థాకోట్ వరకు 136 కి.మీ కారకోరమ్ హైవే పాకిస్తాన్-చైనా మధ్య అనుసంధానానికి కీలకం. అయితే దీన్ని పూర్తిచేయడంలో పాకిస్తాన్ చూపించిన అలక్ష్యం, ఆలస్యం చైనా సహనానే్న పరీక్షించింది. అవినీతి ఆరోపణలు, పాకిస్తాన్ ఏజెన్సీలు చూపుతున్న నిర్లక్ష్యం ఇరు దేశాల మధ్య స్నేహానికి బీటలు పడేలా చేశాయి. ఆర్థిక కారిడార్‌కు సంబంధించి చైనా తీసుకున్న తాజా నిర్ణయం పాకిస్తాన్ గొంతులో పచ్చి వెలక్కాయలా మారింది.