స్పాట్ లైట్

మొదటికొచ్చిన ‘సిరియా’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎట్టకేలకు ఓ కొలిక్కి వస్తుందనుకుంటున్న సిరియా సంక్షోభం మళ్లీ మొదటికి వచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి. రష్యా క్రియాశీలక ప్రమేయంతో కొంతమేర తగ్గినట్టే తగ్గిన సిరియా రెబెల్ గ్రూపులు ఇప్పుడు మళ్లీ వితండవాదం మొదలుపెట్టాయి. రష్యా సారథ్యంలో వచ్చే నెల జరగనున్న చర్చల్లో తాము పాల్గొనేదే లేదని చెప్పడం ద్వారా మళ్లీ కథను మొదటికి తెచ్చాయి. ఏళ్లకు ఏళ్లుగా సాగుతున్న సిరియా సంక్షోభానికి తెరదించి అక్కడ శాంతియుత పరిస్థితులను పాదుగొల్చే ఉద్దేశంతో రష్యా, ఇరాన్‌లు సుహృద్భావ రీతిలో మొగ్గుచూపాయి. ముఖ్యంగా సిరియాతో ఈ రెండు దేశాలకు సన్నిహిత సంబంధాలు ఉండడంవల్ల ఈ సమస్యను సునాయాసంగానే పరిష్కరించే అవకాశం ఉంటుందన్న అభిప్రాయం కూడా ఒక దశలో ఏర్పడింది. ఆ నేపథ్యంలోనే సోచి శాంతి చర్చలను రష్యా ప్రతిపాదించింది. ఈ చర్చల ద్వారా సిరియా వైరి వర్గాలను ఒకే గూటిలోకి తీసుకొచ్చి సమస్యను పరిష్కరించవచ్చునని భావించింది. ఈ విషయంలో సిరియా ప్రతిపక్షాలను సమర్థిస్తున్న టర్కీని కూడా రష్యా, ఇరాన్‌లు ఒప్పించగలిగాయి. అందరి మధ్యా ఒక అవగాహన రావడంతో వచ్చే నెల 29-30 తేదీల్లో నల్లసముద్ర వ్యాహ్యాళి కేంద్రమైన సోచీలో ఈ శాంతి చర్చలను జరపాలని సంకల్పించాయి. రష్యా ప్రభుత్వం ఈ శాంతి ప్రయత్నాలను బలపరచడమే కాకుండా దేశ అంతర్యుద్ధ సమస్యను పరిష్కరించేందుకు ఎవరు ఎలాంటి చర్యలు తీసుకున్నా వాటికి మద్దతు ఇస్తామని తెలిపింది. కాని రెబెల్స్ మాత్రం ఈ చర్చలకు ససేమిరా అంటున్నారు. సిరియాపై అన్ని విధాలుగా పెత్తనం చేయాలనే ఉద్దేశంతోనే రష్యా ఈ శాంతి చర్చలను ప్రతిపాదించిందని, ఇది పూర్తిగా ఐక్యరాజ్య సమితి సారథ్యంలో మొదలైన శాంతి ప్రక్రియకు పూర్తి విరుద్ధమని కూడా రెబెల్స్ వ్యాఖ్యానించారు. దాదాపు 40 రెబెల్ గ్రూపులు శాంతి చర్చలను ప్రతిఘటిస్తున్న నేపథ్యంలో రష్యా ప్రయత్నాలు ఎంతమేరకు ఫలిస్తాయి? అసలు సిరియా సంక్షోభం ఓ కొలిక్కే వచ్చే అవకాశం ఉంటుందా అన్నది సందేహాస్పదంగా మారింది.