స్పాట్ లైట్

తగ్గను గాక తగ్గను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయంగా ఎన్ని ఒత్తిడులు వస్తున్నా ఇటు అమెరికా, అటు ఐక్యరాజ్య సమితి ఒకదాని తర్వాత ఒకటిగా ఆంక్షల కొరడా ఝళిపిస్తున్నా కూడా ఉత్తర కొరియా నాయకత్వం నిమ్మకు నీరెత్తిన చందంగానే వ్యవహరిస్తోదని చెప్పడానికి తాజా ప్రేలాపనలే నిదర్శనం. తమ అణు బలాన్ని చాటుకోవడానికి, అలాగే ఆత్మరక్షణ పేరిట ఉత్తర కొరియా చేస్తున్న క్షిపణి పరీక్షలు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కల్లోలాన్ని సృష్టించాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాలను వదులుకునే ప్రసక్తి లేదని తాజాగా స్పష్టం చేసిన కిమ్ జోంగ్ ప్రభుత్వం ఈ దిశగా మరింతగా ముందుకు వెళతామన్న బలమైన సంకేతాలనే అందించింది. అణ్వాయుధాలన్నవి తమ దేశ ప్రతిష్ఠకు, ఆత్మరక్షణకు దోహదం చేసేవిగా పేర్కొంటున్న ఈ నియంతృత్వ ప్రభుత్వం తాజాగా ఐక్యరాజ్య సమితి విధించిన ఆంక్షలపై తీవ్రస్వరంతోనే స్పందించడాన్ని బట్టి చూస్తే తదుపరి పరిణామాలు ప్రపంచ దేశాలను మరింత వేడెక్కంచేవిగానే కనిపిస్తున్నాయి. తమపై పెత్తనం చెలాయించడానికి, తమ వ్యవహారాలను శాసించడానికే ఆంక్షలు విధిస్తున్నారంటూ ధ్వజమెత్తిన ఉత్తర కొరియా తాజా చర్యలను యుద్ధోన్మాదంగానే అభివర్ణించింది. దీనివల్ల తమ సార్వభౌమత్వానికి భంగం కలిగించడమే అవుతుందని కూడా తెగేసి చెప్పింది. అమెరికాలోని ఏ ప్రాంతాన్నైనా భస్మీపటలం చేయగలిగే శక్తి సామర్థ్యాలు కలిగిన ఖండాతర క్షిపణిని ఉత్తర కొరియా పరీక్షించిన నేపథ్యంలో అత్యంత కఠినతరమైన ఆంక్షలు విధిస్తూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఏకగ్రీవ నిర్ణయం తీసుకోవడం పరిస్థితిని మరింత వేడెక్కించింది. పైగా ఈ ఆంక్షలకు సంబంధించిన ముసాయిదాను అమెరికా రూపొందించడం, అన్నింటికంటే మించి ఉత్తర కొరియాకు మిత్ర దేశమైనా చైనాను సంప్రదించిన తర్వాతే ఇందులో కీలకమైన అంశాలను చేర్చడం నియంత కిమ్ జోంగ్‌కు మరింత ఆగ్రహం కలిగిస్తోంది. తమ దేశాన్ని అన్ని విధాలుగా భ్రస్టు పట్టించడానికి దేశ ప్రజల సార్వభౌమత్వాన్ని దెబ్బతీయడానికి అలాగే సమగ్రతను తూట్లు పొడవడానికే కుత్సిత రీతిలో ఈ యుద్ధాన్మాద ఆంక్షల ముసాయిదాను రూపొందించారని ఉత్తర కొరియా నాయకత్వం తీవ్ర పదజాలంతోనే స్పదించింది. అణ్వాయుధ కార్యక్రమాలను తాము త్యజించేలా చేయడానికే ఈ రకమైన కుట్రను వ్యూహాత్మక రీతిలో అమలు చేస్తున్నారని, దీనివల్ల మొత్తం కొరియా ద్వీపకల్పంలోనే సుస్థిర శాంతి భద్రతలకు తీవ్రస్థాయిలో విఘాతం కలుగుతుందని కూడా ఉత్తర కొరియా నాయకత్వం హెచ్చరించడం ఆ దేశ తదుపరి వ్యూహాలపై ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఐక్యరాజ్య సమితి తాజా ఆంక్షలను అమలుచేస్తే ఉత్తర కొరియాను ఆర్థికంగా పూర్తిగా దిగ్బంధం చేసినట్లే అవుతుంది. చీటికీ మాటికీ తమను కవ్వించే రీతిలో చర్యలకు పాల్పడవద్దని అమెరికా సురక్షితంగా ఉండాలంటే ఎంతదూరంలో ఉండాలో అంతదూరంలో ఉడడం మరింత మంచిదని కూడా కొరియా నాయకత్వం చెప్పడాన్నిబట్టి చూస్తే ఎలాంటి చర్యలకైనా తాము సంసిద్ధంగా ఉన్నామన్న సంకేతాలను అందించడంగానే భావించాల్సి ఉంటుంది. పైగా అణు కార్యక్రమాన్ని అలాగే అణ్వాయుధాలను అన్యదేశాల ఒత్తిడులకు లొంగి తాము వదులుకుంటామని భావించడం కూడా పగటికలే అవుతుందని తెగేసి చెప్పింది. ఉత్తర కొరియాకు చమురు దిగుమతులను తగ్గించడం, 24 నెలల వ్యవధిలో ఉత్తర కొరియా దేశస్థులందరినీ స్వదేశానికి పంపేయడం, బొగ్గు, చమురు, తదితర వస్తులను ఉత్తర కొరియాకు ఎగుమతి చేయడాన్ని గాని, అక్కడినుంచ దిగుమతి చేసుకోవడానికి కాని ఎలాంటి అవకాశం ఇవ్వకూడదని ఈ ఆంక్షలు స్పష్టం చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకూ ఉత్తర కొరియాపై చర్యల విషయంలో మీన మేషాలు లెక్కబెట్టిన చైనా తాజాగా ఆ దేశ నాయకత్వ దురహంకారపూరిత వైఖరితో విసుగెత్తిపోయింది. దీని కారంగానే ఆంక్షల తీర్మానాన్ని రూపొందించే విషయంలో అన్ని విధాలుగా తమకు అంతర్జాతీయ ప్రత్యర్థి అయిన అమెరికాకు సహకరించినట్టుగా భావించాల్సి ఉంటుంది. అయితే చైనా జోక్యం కారణంగానే ఈ ఆంక్షల తీవ్రత మరింత తగ్గిందని, ముందుగా ట్రంప్ భావించినట్లుగా ఈ ముసాయిదాను రూపొందించి ఉంటే, చమురు దిగుమతులపై ఆంక్షలు విధించడంతోపాటు ఉత్తర కొరియా ప్రభుత్వానికి అలాగే దాని నాయకుడు కిమ్ జోంగ్‌కు చెందిన ఆస్తులన్నింటినీ జప్తు చేసే పరిస్థితి తలెత్తేది. చైనా సహకారం ఉన్నప్పటికీ ఉత్తర కొరియా విషయంలో అమెరికా తాజా చర్యను రష్యా తీవ్ర పదజాలంతో దుయ్యబట్టింది. అతి తక్కువ వ్యవధిలోనే ఈ ఆంక్షల తీర్మానాన్ని రూపొందించారని, భద్రతా మండలిలోని మిగతా సభ్య దేశాలను సంప్రదించి సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించే రీతిలో కొన్ని మార్పులు చేస్తే బాగుంటుందని సూచించింది. రష్యా విమర్శల నేపథ్యంలో అమెరికా ఈ ఆంక్షలను సవరించి సడలిస్తుందా? లేక తాను అనుకున్నట్టుగానే కఠిన ధోరణితో ముందుకు వెళుతుందా అన్నది వేచిచూడాల్సిందే.