స్పాట్ లైట్

కల చెదిరింది కథ మారింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికా, పాకిస్తాన్‌ల కథ మొదటికొచ్చింది. పాకిస్తాన్ సహాయ, సహకారాలు లేనిదే అఫ్గాన్ కేంద్రంగా పనిచేస్తున్న తాలిబన్, అల్‌ఖయిదా ఉగ్రవాదులను మట్టుబెట్టలేమని భావించిన అమెరికా ఏళ్ల తరబడి తన రవాణా అవసరాల కోసం ఇతర ప్రయోజనాలను తీర్చుకునేందుకు పాకిస్తాన్‌పై ఆధారపడింది. అందులో భాగంగా ఆ దేశానికి బిలియన్ల కొద్దీ డాలర్లను ఎందుకూ అని అడగకుండా ఉదారంగా అందించింది. అందుకు కారణం కూడా చాలా బలమైనదే. అఫ్గనిస్తాన్‌లో ఉగ్రవాదులను ఎదుర్కోవడంతోపాటు పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్ర మూకల ఆటలు కట్టించడంలోనూ పాక్ సహకరిస్తుందని భావించడమే. నిన్న మొన్నటి వరకూ కూడా పాకిస్తాన్ మాటలను అమెరికా నమ్మింది. తామిచ్చే నిధులన్నీ ఉగ్రవాద నిర్మూలనకే ఉపయోగించుకుంటున్నామన్న పాక్ నాయకత్వ మాయమాటలను తప్పని సరి పరిస్థితుల్లో నిజమని విశ్వసించింది. జార్జిబుష్, బిల్ క్లింటన్, బరాక్ ఒబామా హయాంలో పాకిస్తాన్‌కు అమెరికా నుంచి సాయం అందుతునే వచ్చింది. అల్‌ఖయిదా అధినేత బిన్ లాడెన్ తమ ముంగిట్లోనే ఉన్నప్పటికీ ఆ విషయం తమకు తెలియదన్నట్టే పాక్ వ్యవహరించింది. అమెరికానూ నమ్మించింది. అయితే పాక్ మాటాల్లో విశ్వసనీయత లేదన్న అనుమానాలు మొదటి నుంచీ కూడా అమెరికాకు కలుగుతునే వచ్చాయి. అందుకే తమ సొంత ప్రయత్నాల ద్వారా లాడెన్ ఉనికిని పసిగట్టి మట్టుబెట్టింది. అప్పటి వరకూ అమెరికా పాకిస్తాన్ మధ్య నడిచిన స్నేహ సంబంధాల తీరువేరు. లాడెన్ మృతి తరువాత పరిస్థితి వేరు. ఎప్పుడైతే పాకిస్తాన్ ద్వంద్వవైఖరి, మోసగాని తీరును పసిగట్టిన అమెరికా అప్పటి నుంచి దానికి కీలెరికి వాతపెట్టింది. ఒబామా రెండో సారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు మొదలైన ఈ దండన ఇప్పుడు ట్రంప్ రాకతో పరాకాష్టకు చేరుకుంది. 15 ఏళ్లుగా పాక్ తమనను నమ్మించిందని, వంచిందని ఇచ్చిన నిధులు ఉగ్రవాద నిర్మూలనకు కాకుండా దాన్ని పెంచి పోషించేందుకే వినియోగించిందని ట్రంప్ ధ్వజమెత్తడం చూస్తే పాక్‌తో అమెరికా సంబంధాలు బెడిసికొట్టినట్టే కనిపిస్తోంది. పాక్‌కు ఇక సాయం చేయబోమని చెప్పడమే కాకుండా ఇప్పటి వరకూ చేసిన సాయం హామీలను, భారీ కోతలను ట్రంప్ ప్రతిపాదించడం మారనున్న పరిస్థితులకు సంకేతం. పాక్‌కు ఇబ్బడి ముబ్బడిగా నిధులను అమెరికా సమకూర్చడాన్ని గట్టిగా వ్యతిరేకించిన భారత్ ఒక దశలో వాస్తవ పరిస్థితులను అమెరికా నాయకత్వానికి కళ్లకు కట్టింది. అయినా సెగ తగిలితే గాని ముందుకు కదలని అమెరికాకు పాక్ నిజస్వరూపం బయటపడితే తప్ప దాని అసలు స్వరూపం కళ్లకుకట్టలేదు. ఆలస్యంగానైనా ట్రంప్ తీసుకున్న నిర్ణయం వాస్తవాలకు అద్దం పడుతుందన్నది స్పష్టం. అయితే మొదటి నుంచీ పాక్‌ను వెనకేసుకుంటూ వచ్చిన చైనా తాజా పరిణామాల విషయంలోనూ తన వంతు నైజాన్ని ప్రదర్శించింది. ఉగ్రవాద నిర్మూలనలో అమెరికాకు పాక్ అందించిన సహాయ, సహకారాలు నిరుపమానం అంటూ సన్నాయినొక్కులు నొక్కడం మొదలెట్టింది. ఈ నేపథ్యంలో పాక్‌పై ట్రంప్ కఠినంగా వ్యవహరిస్తే చైనా తీసుకోబోయే చర్యలు ఎలా ఉంటాయి? ఇప్పటికే ఉత్తర కొరియా విషయంలో తప్పనిసరి పరిస్థితుల్లో అమెరికాకు సహకరిస్తూ వచ్చిన చైనా తన అనుంగ మిత్రదేశమైన పాకిస్తాన్‌పై ట్రంప్ కొరడా ఝుళిపిస్తే భరిస్తుందా లేక బరి తెగిస్తుందా? అన్నది వేచి చూడాల్సిందే.