స్పాట్ లైట్

థెరిసాకు సవాలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రెగ్జిట్‌పై టోరీల నుంచే సెగలు ఐరోపా యూనియన్ షరతులపై నిరసనలు
లేబర్ పార్టీని చుట్టుముడుతున్న సమస్యలు బ్రిటన్‌లో వేడి తగ్గని రాజకీయం
బ్రిటన్ ప్రధాని థెరిసామేకు బ్రెగ్జిట్ కష్టాలు ఇప్పట్లో తీరేట్లు కనిపించడం లేదు. ఎప్పటికప్పుడు ప్రతిపక్ష లేబర్ పార్టీతో మంతనాలు సాగిస్తున్నా, ఎన్నో కీలక అంశాలు కొత్త సమస్యలను రేకెత్తిస్తూనే వస్తున్నాయి. బ్రిటన్ ప్రయోజనాలపై ఏ విధంగానూ రాజీ పడకుండా ఐరోపా యూనియన్ నుంచి వైదొలగాలని, అదే విధంగా సాధ్యమైనంత మేర తమ డిమాండ్లను సాధించుకునే ప్రయత్నించాలన్నదిని ప్రతిపక్షాల వాదన. ఈ విషయంలో ప్రతిపక్షాల నుంచి ఎంతగా ఒత్తిళ్లు వస్తున్నాయో అధికార కన్సర్వేటివ్ పార్టీల నుంచి కూడా ప్రధాని అంతకుమించిన స్థాయిలో ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారు. తుది ఒప్పందం కుదిరే లోగా తాత్కాలిక ప్రాతిపదికన ఐరోపా యూనియన్‌తో ఒడంబడిక కుదర్చుకోవాలన్న థెరిసామే ప్రయత్నాలకు తాజాగా జరిపిన ఓ సర్వే గండికొట్టింది. పరిపూర్ణమైన రీతిలోనే బ్రిటన్ ప్రయోజనాలను కాపాడుకోవాలి తప్ప ఈ రకమైన తాత్కాలిక ఒడంబడికల వల్ల ఏ రకమైన ప్రయోజనం ఉండదని మెజారిటీ టోరి (కన్సర్వేటివ్ పార్టీ) ఎంపీలు తెగేసి చెప్పడంతో థెరిసా పరిస్థితి మరింత ఇరకాటంలో పడినట్టయింది. ఇదే రకమైన వాతావరణం కొనసాగితే ఆమె నాయకత్వానికే పెనుసవాళ్లు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్రెగ్జిట్ ప్రభావం బ్రిటన్‌పై ఏ విధంగా చూసినా కూడా ప్రతికూలంగానే ఉండేలా కనిపిస్తోంది. ఆ రకమైన ప్రతికూలతల ఉంచి కొంతలో కొంతయినా వెసులుబాటు పొందాలన్న ఉద్దేశంతో ఈ తాత్కాలిక ఒప్పంద ఆలోచనకు థెరిసా తెరతీశారు. అయితే దీనిపై జరిగిన సర్వేలో మెజారిటీ ప్రజలు అలాగే అధికార పార్టీ ఎంపీలు వ్యతిరేకిస్తున్నట్టుగానే సంకేతాలు వ్యక్తమయ్యాయి. దాదాపు 74 శాతం మంది టోరీ ఎంపీలు థెరిసా ఆలోచనను ప్రతిఘటిస్తున్నారు. అలాగే మరో 63 శాతం మంది ఐరోపా యూనియన్‌కు సంబంధించి బ్రిటన్ చేసే చెల్లింపుల పైన అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయితే ఈ రెండు అంశాలను తాత్కాలిక ఒప్పందం ద్వారా పరిష్కరించుకోవచ్చునని దాదాపు రెండేళ్లపాటు బ్రెగ్జిట్ ప్రతికూల ప్రభావాన్ని తట్టుకునేందుకు ఇది దోహదం చేస్తుందన్నది థెరిసా ఆలోచన. అయితే తాము ప్రతిపాదిస్తున్న రెండు షరతులను కచ్చితంగా అమలుచేసి తీరుతామని బ్రెగ్జిట్ తాత్కాలిక ఒప్పందంలోనైనా కూడా ఈ షరతులను థెరిసా ప్రభుత్వం అంగీకరించక తప్పదని ఐరోపా యూనియన్ స్పష్టం చేసింది. దాంతో మరో మార్గాంతరం లేకపోవడంతో ఈ షరతులను ఒప్పుకుంటున్నట్లుగా థెరిసా సంకేతాలు ఇవ్వడంతో అధికార కన్సర్వేటిట్ పార్టీలోనే కలకలం చెలరేగింది. ఐరోపా యూనియన్ షరతులను ఏమాత్రం అంగీకరించకూడదని 65 శాతం మంది టోరీ ఎంపీలు స్పష్టం చేశారు. గతంలో అనుకున్నదానికంటే కూడా ఐరోపా యూనియన్ అడుగులకు మగుడులు ఒత్తడానికి వీల్లేదని చెప్పే అధికార పార్టీ ఎంపీల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది చివరలోనే ఐరోపా యూనియన్ షరతులను అంగీకరించి తాత్కాలిక ఒప్పందం కుదుర్చుకునేందుకు థెరిసా ముందుకు వెళ్లే అవకాశం స్పష్టం కావడంతో కన్సర్వేటివ్ పార్టీ ఎంపీలు మరింతగా ఆమెపై ఒత్తిడి తెస్తున్నారు. థెరిసా తన ఆలోచనను మార్చుకోకపోతే పార్టీ విధానాలను, సిద్ధాంతాలను పట్టించుకోకుండా ఐరోపా యూనియన్ షరతులకు అంగీకరిస్తే కచ్చితంగా అది ఆమె నాయకత్వాన్ని సవాలు చేసే పరిస్థితికి దారితీసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికీ కూడా బ్రెగ్జిట్ చర్చలైతే జరుగుతున్నాయి కాని, అవి ఏ కోశానా కొలిక్కి వచ్చిన దాఖలాలు కనిపించడం లేదు. ఏ రకమైన ఒప్పందం కుదుర్చుకోకుండానే ఐరోపా యూనియన్ నుంచి వైదొలగాలంటూ మెజారిటీ సంఖ్యలో టోరీ ఎంపీలు ఈ సర్వేలో స్పష్టం చేయడాన్ని బట్టి చూస్తే ఈ ఒప్పంద వ్యవహారం అంత తేలిగ్గా ఓ కొలిక్కి అవకాశం ఉండదన్నది తేలతెల్లం అవుతున్నది. సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడంతోపాటు ఇటు సొంత పార్టీ ఎంపీలను, అటు లేబర్ పార్టీని తనవైపు తిప్పుకునే ప్రయత్నాలను థెరిసా చిత్తశుద్ధితో చేపట్టకపోతే ఏకంగా పార్లమెంటులోనే ఆమెకు సెగలు తథ్యమని చెబుతున్నారు. అయితే బ్రెగ్జిట్ అన్నది ఒక అధికారంలో ఉన్న పార్టీకి ఎదురవుతున్న సమస్యగానే భావించడానికి వీలులేదు. అటు లేబర్ పార్టీ కూడా ఏదో విధమైన సమస్యను ఎదుర్కొంటూనే ఉంది. ప్రస్తుతం లేబర్ పార్టీ విపక్షం కాబట్టి దానిపై ఒత్తిడి లేకపోవచ్చునేమోగానీ, ఇప్పటికైనా ఓ స్పష్టమైన వైఖరిని కనబరచకపోతే లేబర్ పార్టీకి కూడా బ్రెగ్జిట్ సెగలు తప్పవని తెలుస్తోంది. టోరీ లేబర్ పార్టీల ఎంపీల అభిప్రాయానికి, ఆ పార్టీ అధినాయకత్వ ఆలోచనకు ఏ కోశానా పొంతన లేని పరిస్థితి నెలకొన్నది. అలాగే ఈ రెండు పార్టీల నుంచి కూడా ఇటు ఎంపీలు, అటు బ్రిటన్ ప్రజలు కూడా బ్రెగ్జిట్ ద్వారా భారీ ప్రయోజనాలనే ఆశిస్తున్నారు. అవి నెరవేర్చడంలో ఈ పార్టీలు ఎంతమేరకు కృతకృత్యం అవుతాయన్నది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశే్న.