స్పాట్ లైట్

చేయి దాటితే అంతే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బంగ్లాదేశ్, మైన్మార్‌ల మధ్య కుదిరిన ఒప్పందం ఎప్పుడు అమలవుతుందోగాని వేలాదిమంది రోహింగ్యా మైనారిటీ ముస్లింల పరిస్థితి దినదిన గండం చందంగానే మారింది. మైన్మార్ సైనిక దళాల దాడుల నుంచి తప్పించుకుని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తోచిన దారిలో పరుగులు పెట్టిన రోహింగ్యాలు బంగ్లాదేశ్‌లోనే ఆశ్రయం పొందారు. లక్షల సంఖ్యలో అతితక్కువ సమయంలో బంగ్లాదేశ్‌లోకి ప్రవేశించిన ఇంతమందికి ఆవాసం కల్పించడం అన్నది ఆ ప్రభుత్వానికి అసాధ్యంగా మారినప్పటికీ మానవతా దృక్పథంతో భారీగా తాత్కాలిక ఆవాసాలను, శిబిరాలను ఏర్పాటుచేసింది. ఇప్పటికవరకూ ఈ శిబిరాల్లోనే బ్రతుకు జీవుడా అంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవితాలు సాగిస్తున్న రోహింగ్యాలకు రానున్న రోజుల్లో పెనుసంకటమే ఎదురుకాబోతోందంటూ సాక్షాత్తు ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల నివేదిక స్పష్టం చేసింది. ఎలాంటి పరిశుభ్రతా లేని మురికి వాతావరణంలో ఏర్పాటుచేసిన తాత్కాలిక శిబిరాల్లో అతి దయనీయ పరిస్థితుల్లో మనుగడ సాగిస్తున్న రోహింగ్యాలకు వర్షాకాలం ప్రత్యక్ష నరకానే్న చూపించే అవకాశం ఉందని ఐరాస నివేదిక స్పష్టం చేసింది. ఇప్పటికప్పుడే వీరిని మైన్మార్ ప్రభుత్వం వెనక్కి తీసుకునే అవకాశం లేదు కాబట్టి రానున్న రెండు మూడు నెలల్లో తక్షణ పునరావాస చర్యలు చేపట్టకపోతే వేలాది మంది రోహింగ్యాలు అనారోగ్యం బారినిపడే అవకాశం ఉందని ఐరాస నివేదిక వెల్లడించింది. బంగ్లాదేశ్‌లోని కాక్స్‌బజార్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక శిబిరాల్లో 9లక్షల మంది రోహింగ్యాలు మనుగడ సాగిస్తున్నారు. ఇంకా ఈ వలసలు ఆగకపోవడంతో బంగ్లా సర్కార్‌పైనా, ఈ శరణార్థ శిబిరాలపైనా తీవ్రంగా ఒత్తిడి పెరిగినట్లు తెలుస్తోంది. వేల సంఖ్యలో ఉన్న పిల్లలకు టీకాలు వేసి కలరా వంటి వ్యాధులను నివారించినప్పటికీ చాలామంది ప్రమాదకర డిప్తీరియా వంటి వ్యాధులతో నరకం అనుభవిస్తున్నట్లు తెలుస్తోంది. వీరిలో ఇప్పటికే 35 మంది పిల్లలు మరణించారు. రెండో డోసుగా మూడున్నర లక్షల మంది పిల్లలకు టీకాలు వేసినప్పటికీ రాబోయే పరిస్థితుల తీవ్రత దృష్ట్యా అందుబాటులో ఉన్న మందులు ఏమాత్రం సరిపోయే అవకాశం కనిపించడం లేదు. రోహింగ్యాలను వెనక్కి తీసుకుంటామని, వారికి భద్రతతో కూడిన జీవనాన్ని అందిస్తామని మైన్మార్ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఇప్పటికీ మైనారిటీలకు ప్రాణభయం పోలేదు. ఇతర దేశాల నుంచి సహాయ సహకారాలు అందకుండా ఈ రోహింగ్యాల భారాన్ని బంగ్లాదేశ్ నిరంతరంగా మోసే అవకాశం కనిపించడం లేదు. ఐక్యరాజ్య సమితి సారథ్యంలో ప్రపంచ దేశాలన్నీ పూనుకుంటే తప్ప రోహింగ్యాలకు పూర్తిస్థాయి రక్షణ గాని, ఆరోగ్యపరమైన భరోసా గాని లభించే అవకాశం లేదు. ఎంత త్వరితగతిన వీరిని వెనక్కి పంపిస్తే అంతగానూ బంగ్లా కోలుకోగలుగుతుంది. సొంత దేశమైన మైన్మార్‌లో ధీమాతో కూడిన జీవనాన్ని వీరు కొనసాగించగలుగుతారు. ఇప్పటికిప్పుడు ఇలాంటి పరిణామాలకు ఏ రకమైన అవకాశం గాని, ఆస్కారం గాని కనిపించడం లేదు. ఏం జరిగిన ఈ మూడు నెలల్లోనే రోహింగ్యాల సమస్యకు తెరపడాలి. లేనిపక్షంలో కాక్స్‌బజార్ ప్రాంతం రోగపీడిత రోహింగ్యాల హాహాకారాలతో మారుమోగే అవకాశాలు స్పష్టం.