స్పాట్ లైట్

మదురో..ఇక దిగు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా అట్టుడుకుతున్న నిరసనలు, ఆగ్రహావేశాలు పరాకాష్టకు చేరుకున్నాయి. దేశ వ్యాప్తంగా ప్రజలు ముసుగులు ధరించి ప్రభుత్వ విధానాల పట్ల, అధ్యక్షుడి తీరుపట్ట తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గత కొంత కాలంగా అన్ని విధాలుగానూ వెనిజులా చితికిపోవడం, నిరుద్యోగం పెరిగిపోవడం, ప్రజల ఆదాయం అడుగంటి పోవడంతో సంక్షోభం తారస్థాయికి చేరుకుంది. తక్షణమే దేశంలో ఎన్నికలు నిర్వహించాలంటూ గత ఐదు వారాలుగా ప్రజలు ఉద్యమాలు జరుపుతున్నా అధ్యక్షుడు మదురో పట్టించుకోకపోవడంతో ఒక్క సారిగా జనం వీధికెక్కారు. ప్రస్తుత ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించే చర్యలను చేపట్టని పక్షంలో పరిస్థితి సమీప భవిష్యత్‌లోనే మరింతగా దిగజారిపోయే ప్రమాదం ఉందన్న హెచ్చరికలు వస్తున్నాయి. అయితే ప్రతిపక్షాల మద్దతుతోనే ఈ ఉద్యమాలు జరుగుతున్నాయని, తనను అధికారం నుంచి కుట్రపూరితంగానే కూల్చివేయడంమే వీరి లక్ష్యమంటూ ఎదురుదాడికి దిగిన మదురో భవితవ్యం ఏమిటన్నది ప్రశ్నార్ధకంగా మారింది. దాదాపుగా నియంతల పాలనను తలదనే్న రీతిలో దేశాధ్యక్షుడి విధానాలు ఉన్నాయంటూ ధ్వజమెత్తిన ప్రతిపక్షాలు సమీప భవిష్యత్‌లో తమ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా‘మదురో ఇక నువ్వు దిగు’ అన్న నినాదాలు హోరెత్తిపోతున్నాయి. ఇప్పటి వరకూ ఈ ఉద్యమాల కారణంగా చెలరేగిన హింసాకాండలో 39 మంది మరణించారు. ఆరు వారాలుగా పరిస్థితి అడ్డూఅదుపూలేని రీతిలో దిగజారినా కూడా నిమ్మకు నీరెత్తిన చందంగానే అధ్యక్షుడు వ్యవహరించడం ప్రజాగ్రహానికి మరింతగా ఆజ్యం పోస్తోంది.

చిత్రం.. ముసుగులతో నిరసన