స్పాట్ లైట్

కిమ్‌కు కళ్లెం వేసేదెలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ దేశాలు ఎంతగా ఒత్తిడి తెస్తున్నా, ఆంక్షలను విధిస్తూ కొరడా ఝళిపిస్తున్నా ఉత్తర కొరియా నాయకత్వం మాత్రం తన పని తాను చేసుకుపోతోంది. ఒకదాని తర్వాత ఒకటిగా క్షిపణులను పరీక్షించుకుంటూ ఇప్పుడు ఏకంగా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులే లక్ష్యంగా పావులు కదుపుతోంది. తాజాగా ఉత్తర కొరియా చేసిన క్షిపణి పరీక్ష విజయవంతం కావడం అమెరికా సహా పలు దేశాల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ఉత్తర కొరియా మాటలతో అదుపులోకి వచ్చే అవకాశం లేదని, కఠిన ఆంక్షలతోనే దీన్ని దారికి తేవాలని ప్రపంచ దేశాలకు అమెరికా పిలుపునిచ్చినప్పటికీ ఆ దిశగా ఏ రకమైన పురోగతి కనిపించడం లేదు. గత ఆరు నెలలుగా అగ్రరాజ్యం హెచ్చరికలతోనే కాలక్షేపం చేయడంవల్ల ఉత్తర కొరియాపై దాని ప్రభావం ఏమాత్రం లేదని చెప్పడానికి తాజాగా జరిపిన క్షిపణి పరీక్షే నిదర్శనం. ఇప్పటికే అన్నివిధాలుగా ఉత్తర కొరియా ఏకాకిగా మారింది. ఇవి చేపట్టిన క్షిపణి పరీక్షలన్నీ విజయవంతమయ్యాయో లేదో తెలియదుకానీ అందుకు సంబంధించిన ప్రచారం మాత్రం ఈ దేశం వల్ల ప్రపంచ శాంతికి ముప్పేనన్న భయాందోళనలకు ఆజ్యం పోస్తోంది. మొదట్లో ఉత్తర కొరియా నాయకత్వం చేసిన ప్రకటనలను హెచ్చరికలను ఉత్తర ప్రగల్భాలుగా భావించినప్పటికీ వాస్తవ పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. దాదాపు ఎనిమిదివేల కి.మీ దూరంలోని లక్ష్యాలను సైతం ఢీకొనగల అణ్వాయుధాలను కూడా తాము రూపొందించి ప్రయోగించగలుగుతామని ఉత్తర కొరియా చెప్పడాన్ని కేవలం కోటలు దాటని మాటలుగా భావించటానికీ వీల్లేదు. ఉత్తర కొరియా విషయంలో అమెరికా పెద్దగా ముందుకు వెళ్లకపోవడానికి కారణం రాజకీయపరమైన అంశాలే. గతంలో మాదిరిగా మిత్రదేశాలేవీ ఉత్తర కొరియాపై దాడికి అమెరికాకు సహకరించే అవకాశం కనిపించడం లేదు. ఒకవేళ దాడిచేస్తే అది అమెరికా ఏకపక్షంగానే చేయాలి తప్ప అందుకు ఇతర దేశాలనుంచి ఎలాంటి మద్దతు వచ్చే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియాకు అడ్డూ అదుపూ లేని పరిస్థితి తలెత్తింది. ఆ దేశ అధినేత కిమ్ కూడా ఖండాంతర క్షిపణి తయారీయే తమ లక్ష్యమని చెప్పడం ఆందోళన కలిగించేదే అయినప్పటికీ అసలు ఈ దేశాన్ని ఏ రకంగా దారికి తెస్తారన్నది అంతుబట్టడం లేదు. ఇటు ఐరాస హెచ్చరికలను ఖాతరు చేయకుండా, అమెరికా ఆంక్షల బెదిరింపులను పట్టించుకోకుండా అనుకున్న విధంగా ముందుకు పోతున్న కిమ్ ఆంతరంగం ఏమిటి? అసలు ఆయనకున్న ధైర్యం ఏమిటన్నది అంతుబట్టనిదే. ఉత్తర కొరియాకు ఏ రకమైన సాంకేతిక విజ్ఞానం లేదనుకున్నప్పుడు, ఆ దేశ నాయకత్వం మాటలన్నీ ప్రగల్భాలే అనుకున్నప్పుడు అది క్షిపణి పరీక్షలను విజయవంతంగా నిర్వహించే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో మరో సమస్య పెను సమస్యగా మారకుండా ప్రపంచ శాంతికి, ముఖ్యంగా దేశాల మధ్య సంఘర్షణకు దారితీయకుండా వ్యూహాత్మకంగా చర్యను చేపట్టడం ఇటు ఐరాస, అటు అమెరికా బాధ్యత.