స్పాట్ లైట్

తప్పుకోను..దించేయండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రెజిల్‌లో రాజకీయ కల్లోలం తీవ్రమవుతోంది. అవినీతి కుంభకోణాల నేపథ్యంలో రాజీనామా చేయాలంటూ ప్రజల నుంచి వస్తున్న వత్తిళ్లను అధ్యక్షుడు మైకేల్ టెమర్ ఎంత మాత్రం ఖాతరు చేయడం లేదు. సుప్రీం కోర్టు ఈ విషయంలో ఆయనను మందలించినప్పటికీ రాజీనామాకు ససేమిరా అంటున్నారు. కావాలంటే తనను దించేయవచ్చని కూడా సవాల్ విసురుతున్నారు.
గత మూడేళ్లుగా అధ్యక్షుడి అవినీతి, అక్రమాలపై విచారణ జరుగుతునే ఉంది. ఈ వ్యవహారం ఇటీవల కాలంలో తీవ్రరూపం దాల్చింది.‘ఎట్టిపరిస్థితుల్లో రాజీనామా చేయనుగాక.. చేయను. కావాలంటే మీరే నాకు ఉద్వాసనం పలకండి. నేను రాజీనామా చేస్తే నాపై వచ్చిన అవినీతి ఆరోపణలను అంగీకరించినట్టు అవుతుంది’ అంటూ టెమర్ స్పష్టం చేశారు. తాజాగా నెలకొన్న సంక్షోభం బ్రెజిల్ ఉభయ సభల్లోనూ అధికార సంకీర్ణకూటమిలో చీలికలు తెచ్చింది. దీని ఫలితంగా లాటిన్ అమెరికాలో అతిపెద్ద దేశంగా ఉన్న బ్రెజిల్ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమయ్యే పరిస్థితి నెలకొంది.
ఏది ఎలా ఉన్నా తన అధ్యక్ష పదవీకాలాన్ని పూర్తిచేస్తానని 2018 చివరి వరకూ అధికారంలోనే ఉంటానని టెమర్ బల్లగుద్ది మరీ చెబుతున్నారు. అయితే అధికార సంకీర్ణకూటమిలో తలెతితన విభేదాలను తొలగించడంలో టెమర్ ఎంత మేరకు కృతకృత్యం అవుతారన్న దానిపైనే ఆయన రాజకీయ భవితవ్యం ఆధారపడి ఉంది. గత ఏడాదే అధికారం చేపట్టిన టెమర్‌కు ఈ స్థాయి పరిస్థితి గతంలో ఎన్నడూ ఎదురుకాలేదు. ప్రస్తుతం సంక్షోభం నుంచి ఆయన గట్టెక్కగలుగుతారా అన్నది ప్రజా ఉద్యమ తీవ్రత దృష్ట్యా అనుమానాలనే రేకెత్తిస్తోంది. టెమర్‌ను పదవి నుంచి తప్పించి ఎన్నికలు జరిగే వరకూ కొత్త వ్యక్తిని అధ్యక్షుడిగా ఎన్నుకోవాలన్న డిమాండ్లు నెరవేరాలంటే ప్రస్తుత ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయక తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో రాజీనామాకు ససేమిరా అంటున్న టెమర్‌ను అధికార కూటమి పక్షాలే తప్పిస్తాయా?లేక ఈ సంక్షోభ సాగరాన్ని చివరి వరకూ ఆయనతో ఈదుతాయా అన్నది వేచిచూడాల్సిందే.