స్పాట్ లైట్

ఘర్షణ..మూలమిది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచంలో అనేక దేశాల్లో అంతర్యుద్ధాలను చూశాం. సిరియా తరహాలో జరిగిన యుద్ధాలు చాలా తక్కువే. ఈ యుద్ధకాండ అడ్డూ అదుపూ లేకుండా సాగడానికి ప్రధాన కారణం..సిరియా అధ్యక్షుడు అసాద్‌ను రష్యా వెనకేసుకు రావడం.. ఆయన ప్రత్యర్థులను అమెరికా ఎగదోయడమే!
గత ఆరేళ్లుగా సాగుతున్న ఈ యుద్ధంలో ఇప్పటి వరకూ రెండున్నర లక్షల మంది అమాయక ప్రజలు బలయ్యారు. అయినప్పటికీ దీనికి ఓ రాజకీయ పరిష్కారం అంటూ లేకుండా పోయింది. ఐరాస లెక్కల ప్రకారం ప్రాణాలరచేతిలో పెట్టుకుని దేశాన్ని వదిలి పారిపోయిన వారి సంఖ్య దాదాపు 50లక్షలు. అలాగే యుద్ధంలో నిరాశ్రయులైన వారి సంఖ్య కూడా అరవై లక్షలు దాటింది.వర్తమాన ప్రపంచంలో సిరియా అంతటి సంక్లిష్టమైన, హింసాత్మక సంఘర్షణ ఏమీ లేదన్నది నిపుణుల విశే్లషణ. ఆరేళ్ల క్రితం అసాద్‌కు వ్యతిరేకంగా శాంతియుతంగా మొదలైన ఉద్యమం అతి తక్కువ వ్యవధిలోనే పూర్తి స్థాయి అంతర్యుద్ధంగా మారిపోయింది. నిరుద్యోగం, అవినీతి, రాజకీయ స్వేచ్ఛ లేకపోవడం, తన అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం అసాద్ చేపట్టిన అణచివేత చర్యలే ఇందుకు ప్రధాన కారణం.