స్పాట్ లైట్

భూగోళానికి ముప్పేమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

2015లో 190 ప్రపంచ దేశాలు ‘ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ కాదు...’ అన్న చారిత్రక అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని పర్యావరణ పరిరక్షణకు నడుంబిగించాయి. వాటి ఉమ్మడి కృషి ఫలితంగానే ప్యారిస్ ఒప్పందం అవతరించింది. వాతావరణ మార్పుల కారణంగా భూమిమీద జీవజాతులన్నీ నశించిపోయే ప్రమాదం అనివార్యం కావడమే అన్ని దేశాలు అత్యవసర ప్రాతిపదికన ప్యారిస్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఇందుకోసం వారాలకు వారాలు ఎడతెగని చర్చలు జరిగాయి. వాటి ఫలితంగా 31 పేజీలతో పర్యావరణ పరిరక్షణ ఒప్పందం కుదిరింది. దీని ప్రధాన లక్ష్యం - ప్రపంచ సగటు ఉష్ణోగ్రతను 2 డిగ్రీల సెంటీగ్రేడ్ మించి పెరక్కుండా అరికట్టడమే. ఈ శతాబ్దం నాటికి ఈ లక్ష్యాన్ని సాధించాలని అన్ని దేశాలూ సంకల్పించాయి. భూగోళ ఉష్ణోగ్రత 2 డిగ్రీలు దాటితో సముద్రా ఉప్పొంగిపోతాయి. వాతావరణంలో అనూహ్య మార్పులు వస్తాయి. రుతుపవనాల రాకపోకల్లో ఊహించని జాప్యం చోటుచేసుకుంటుంది. ఆహార, జల సంక్షోభాలు తలెత్తుతాయి. అన్నింటికీ మించి వాతావరణమే నివాసయోగ్యం కాకుండా పోతుంది.
ఎప్పటికప్పుడు దాదాపు అన్ని దేశాల్లోనూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతూనే ఉన్నాయి. 1950 నుంచి వాతావరణ మార్పుల ప్రభావం ఇందుకు ప్రధానంగా కారణం అవుతోంది. మండిపోయే ఎండలే తప్ప చల్లదనం లేని పరిస్థితులు సర్వత్రా వ్యాపిస్తున్నాయి. ఈ వాతావరణ మార్పుల ఫలితంగా తుపానులు, ఉప్పెనలుసహా అనేక ప్రకృతి ఉపద్రవాలు సంభవిస్తూనే వచ్చాయి. మామూలు స్థాయికంటే వడగాల్పులు అత్యధికం అయిపోయాయి. అనేక హిమనీనదాలు గ్రీష్మతాపానికి కరిగి తరిగిపోవడం వల్ల సముద్రాలు ఉప్పొంగడం, సమీప దేశాలు మునిగిపోవడం జరుగుతూ వచ్చింది. ఇప్పటికే సముద్ర ఉపరితల స్థాయి 9.8 అంగుళాలు పెరిగినట్లు అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఉష్ణోగ్రతలే అన్నది వాస్తవం. ఎప్పుడైతే ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయే వర్షపాతం తగ్గడం వల్ల పంటలు అడుగంటి ఆహార సంక్షోభమూ తాండవిస్తుంది.