స్పాట్ లైట్

ఇప్పుడే వెళ్లడం ఎందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రిటన్‌లో తలెత్తిన తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశ పర్యటనను అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ ఉన్న ఫలంగా వాయిదా వేసుకోవడం సర్వత్రా విస్మయానికి దారి తీసింది. అసలే సాధారణ ఎన్నికల్లో ఓడిపోయి మెజారిటీ కూడా రాని పరిస్థితిని ఎదుర్కొంటున్న థెరిసామే ప్రస్తుత పరిస్థితుల్లో బ్రిటన్‌లో అధికారికంగా పర్యటించవద్దంటూ ట్రంప్‌కు సలహా ఇచ్చినట్టు చెబుతున్నారు. ఒక వేళ తగుదునమ్మా అంటూ ట్రంప్ బ్రిటన్ పర్యటనకు వస్తే తీవ్ర స్థాయిలోనే ఆయనకు నిరసనలను తప్పవన్న హెచ్చరికలు వస్తున్నాయి. ఇంతకీ ట్రంప్ యూకె రావాలంటూ థెరిసా మే ఆహ్వానించింది గతంలో ఎప్పుడో. అమెరికా అధ్యక్షుడిగా ఆయన పదవీ బాధ్యతలు చేపట్టిన ఏడోరోజే జరిగిన సంయుక్త విలేఖరుల సమావేశంలో థెరిసామే ఈ ఆహ్వానం అందించారు. అయితే అప్పటి పరిస్థితికి నేటి రాజకీయ వాతావరణానికి ఎంతో తేడా ఉంది కాబట్టి ఇప్పట్లో యూకె వస్తే ట్రంప్‌కు నిరసనలు తప్పవన్న వాదన గట్టిగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో బ్రిటన్‌లో రాజకీయ వేడి తగ్గేవరకూ అంటే అక్టోబర్ వరకూ యూకె రాకూడదని ట్రంప్ నిర్ణయం తీసుకున్నట్టుగా చెబుతున్నారు. మొదటి నుంచీ కూడా ట్రంప్ అంటే బ్రిటన్ ప్రజలకు ఎనలేని వ్యతిరేకత. ముఖ్యంగా లండన్ మేయర్‌పై జరిగిన దాడి వ్యవహారం ఈ వ్యతిరేకతను మరింత పెంచింది. లండన్ మేయర్ సాదిక్‌పై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు ప్రధానంగా కారణమయ్యాయి. అసలు జరిగింది ఏమిటో తెలుసుకోకుండా ట్రంప్ ఈ విధంగా వ్యాఖ్యానించడం ఏమిటంటూ థెరిసామే కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అంతేకాదు అసలు ట్రంప్ పర్యటననే రద్దుచేయాలని కొందరు ఎంపీలు థెరిసాకు విజ్ఞప్తికూడా చేశారు. ఇవన్నీ కలిసి ట్రంప్ యూకె వస్తే ఊరుకునేది లేదంటూ బ్రిటన్ ప్రజలంతా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసే పరిస్థితికి కారణమైంది. ఈ నేపథ్యంలో ఎందుకైనా మంచిదంటూ యూకె పర్యటన విషయంలో తొందరపాటు కూడదని అమెరికా అధ్యక్షుడే స్వయంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వాతావరణ మార్పులు నిరోధానికి ఉద్దేశించిన ప్యారిస్ ఒప్పందం నుంచి అమెరికా వైదొలగడం కూడా యూకె సహా పలు దేశాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైన విషయం తెలిసిందే. నిజానికి ఇటీవల సౌదీ సహా అనేక దేశాల్లో పర్యటించిన సమయంలోనే యూకెకు కూడా వెళ్లాలని ట్రంప్ భావించారు. అయితే ఆ ఆలోచన మానుకుని తన పర్యటనను ఇజ్రాయెల్, బెల్జియం వైపు తిప్పుకున్నారు. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన తరువాతే బరాక్ ఒబామా యూకెలో పర్యటించారు. ఇప్పటికీ యూకెకు అమెరికా తన రాయబారిని ప్రకటించకపోవడం తాజా పరిస్థితికి అద్దం పడుతోంది.