స్పాట్ లైట్

పేద దేశాల ఆసరా బ్రిక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత్ సహా ఐదు బలమైన ఆర్థిక వ్యవస్థలతో కూడిన బ్రిక్స్ అంతర్జాతీయంగా దూసుకుపోతోంది. గత పదేళ్లుగా భారత్,రష్యా,చైనా,దక్షిణాఫ్రికా కూటమిగా కొనసాగుతున్న బ్రిక్స్ ఇప్పటికే ధనిక దేశాల కూటములకు ప్రత్యామ్నాయంగా మారింది. మరో స్వర్ణ దశాబ్దిలోకి ప్రవేశించబోతోందంటూ బ్రిక్స్ కూటమిని చైనా అభివర్ణించడమే ఇందుకు నిదర్శనం. విధానాలు, అభిప్రాయాలు, అంతర్జాతీయ అంశాలపై పెద్దగా భిన్నాభిప్రాయాలు లేకపోవడమే బ్రిక్స్ ఎప్పటికప్పుడు కొత్త శక్తిని సంతరించుకోవడానికి దోహదం చేసింది. పదేళ్ల ఉమ్మడి పయనాన్ని సమీక్షించుకుంటున్న బ్రిక్స్ దేశాలు భావసారూమ్యత కలిగిన మరిన్ని దేశాలకూ సభ్యత్వం కల్పించే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే ఇందుకు చైనా సంసిద్ధత వ్యక్తం చేసింది. భారత్ నుంచి ఈ ఏడాది బ్రిక్స్ సారథ్యం చేపట్టిన చైనా ఈ వ్యవస్థను అన్ని విధాలుగా బలోపేతం చేసేందుకు సమాయత్తమవుతోంది. ఓ అంతర్జాతీయ కూటమి ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా పదేళ్ల పాటు సవ్యంగా సాగడమంటే ఇందులోని సభ్య దేశాల మధ్య కొనసాగుతున్న సఖ్యతకు నిదర్శనం. కొత్త సారధిగా బ్రిక్స్‌ను చైనా ఏ విధంగా ముందుకు తీసుకెళుతుందన్నది అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
ముఖ్యంగా ఐరోపా యూనియన్‌లో ఏర్పడ్డ విభేదాల నేపథ్యంలో బ్రిక్స్‌ను మరింతగా పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. మొదట్లో బ్రిక్స్ భవితవ్యంపై అనేక అనుమానాలు వ్యక్తమైనప్పటికీ వాటిని తీవ్రతరం కానివ్వకుండా సభ్య దేశాలన్నీ ముక్తకంఠంతో ఈ వ్యవస్థను పరిరక్షించుకుంటూ వచ్చాయి. ప్రపంచ దేశాలన్నీ తమ దృష్టిని సారిస్తున్నాయంటే బ్రిక్స్ కూటమి శక్తి ఏమిటో స్పష్టమవుతోందన్న చైనా మాటలు వాస్తవాలకు అద్దం పట్టేవే. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బ్రిక్స్ వాటా 12 శాతం నుంచి 24 శాతానికి పెరగడం దాని ఆర్థిక విస్తృతికి దర్పణం.అంతే కాదు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బ్రిక్స్ దేశాల చేయూత 50శాతానికి పైనే ఉండటం కూడా ఈ కూటమి అంతర్గత శక్తికి, సభ్య దేశాలు వ్యక్తిగతంగా సాధిస్తున్న అభివృద్ధికి అద్దం పట్టేదే. మొదట్లో తప్పటడుగులు వేసినా ఎప్పటికప్పుడు నిలదొక్కుకుంటూ ముందుకుసాగడం వల్లే బ్రిక్స్ పదేళ్ల కాలాన్ని పూర్తి చేసుకోగలిగింది. సభ్య దేశాలన్నీ పరస్పరం సహకరించుకుంటూ, ద్వైపాక్షిక బంధాన్నీ ఇనుమడింపజేసుకుంటూ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ పురోగతికీ తోడ్పడుతున్నాయి. ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి రుణాలపైనే ఆధారపడ్డ వర్థమాన దేశాలకు బ్రిక్స్ కూటమి బాసటగా నిలడమే కాకుండా ఈ కూటమి ఏర్పాటు చేసిన అంతర్జాతీయ బ్యాంకు వీటిని కల్పతరువుగానే పనిచేస్తోంది. రుణాలు, నిధులు లేక అల్లల్లాడే పేద, వర్థమాన దేశాలకు ఈ పదేళ్లుగా బ్రిక్స్ కొండంత అండగా నిలిచిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా ఈ బాపతు దేశాల హక్కులను అంతర్జాతీయంగా పరిరక్షించడంతో పాటు ఐఎమ్‌ఎఫ్, ప్రపంచ బ్యాంకుకు ప్రత్యామ్నాయంగా కూడా బ్రిక్స్ బ్యాంకు నిలబడుతోంది. చైనా ప్రధాన వాటాదారుగా ఏర్పడ్డ ఈ బ్యాంకులో సభ్య దేశాలన్నింటికీ ఘనమైన వాటాలే ఉన్నాయి. ఇందులో చేరేందుకు ధనిక దేశాలూ ఒకప్పుడు క్యూలు కట్టాయంటే బ్రిక్స్ సత్తా ఏమిటో స్పష్ట మవుతోంది. పదేళ్లలో వర్థమాన దేశాలను ఆదుకున్న బ్రిక్స్ కూటమి తదుపరి దశాబ్ది కాలంలోనూ అంతర్జాతీయంగా మరింత శక్తిని సంతరించుకునే అవకాశాలు పుష్కలం.