స్పాట్ లైట్

మలుపు ఎటు!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత్-అమెరికాల మధ్య ఎప్పుడు శిఖరాగ్ర భేటీ జరిగినా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆసక్తి, ఉత్కంఠ రేకెత్తుతుంది. జార్జిబుష్-మన్మోహన్ సింగ్, మన్మోహన్ సింగ్-బరాక్ ఒబామాల మధ్య జరిగిన అత్యున్నత స్థాయి చర్చలు ఇరు దేశాల మధ్య సాన్నిహిత్యానే్న కాదు వ్యాపార,వాణిజ్య బంధాన్నీ ఇనుమడింపజేశాయి. చారిత్రక పౌర అణు ఇంధన ఒప్పందం కుదరడం ఈ రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల అధినేతల మధ్య బలోపేతమైన పరస్పర నమ్మకానికి, విశ్వాసానికి నిదర్శనం. ఇప్పుడు అలాంటి మరో అరుదైన, ఏ విధంగా చూసినా అత్యంత ప్రాధాన్యతాయుతమైన మరో శిఖరాగ్ర భేటీ జరుగుతోంది. వీరిద్దరూ మామూలు నేతలు కాదు..తమతమ దేశాల రాజకీయాలను కొత్త మలుపుతిప్పిన అధినేతలు. చారిత్రక ఎన్నికల విజయాలతో జన బాహుళ్యాన్ని ఆకర్షించిన మహానాయకులు. ఒకరు మీడియా ఊహాగానాలకు పాతరేసి ఎవరి అంచనాలకు అందని రీతిలో అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ అయితే..నాలుగు దశాబ్దాల భారత రాజకీయాలను తదనైన శైలిలో మలుపుతిప్పి భారతావని ప్రధానిగా పగ్గాలు చేట్టిన నరేంద్ర మోదీ. ఇద్దరిదీ అరుదైన నిర్వహణ శైలి. ఎవరి ఊహకూ అందని వ్యూహాత్మకత! సాధారణంగానే దేశాధినేతల మధ్య శిఖరాగ్ర సమావేశాలు జరుగుతూనే ఉంటాయి. అన్నింటికీ ఇంతటి ప్రాధాన్యత ఉండదు. మోదీ-డొనాల్డ్ భేటీ ప్రాముఖ్యతకు ఎన్నో, ఎనె్నన్నో కారణాలు ఉన్నాయి. అందుకు దేశీయ, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలూ దోహదం చేస్తున్నాయి. ఒకరిది ‘అమెరికా ఫస్ట్’అన్న నినాదమైతే మరొకరిది ‘ఇండియా ఫస్ట్’అన్న పట్టుదల. మేక్ ఇన్ ఇండియాతో ప్రపంచ దేశాలను భారత్‌వైపు తిప్పిన నరేంద్ర మోదీ ఇప్పుడు ‘అమెరికా ఫస్ట్’అంటున్న ట్రంప్‌ను ఏ విధంగా తన దారి పట్టిస్తారు? ఇరు దేశాల మధ్య ఇప్పుడిప్పుడే బలపడుతున్న ద్వైపాక్షిక, ఆర్థిక, వ్యూహాత్మక, సైనిక బంధాన్ని ఎలాంటి కొత్త పుంతలు తొక్కిస్తారన్నది ఎవరి అంచనాలకూ అందనిదే! ఎన్నోసార్లు ఫోన్‌లో మాట్లాడుకున్నా వీరిద్దరూ ముఖాముఖీ కలువబోవడం అన్నది ఉత్కంఠను కలిగించే అంశం. మొదటి నుంచీ కూడా మోదీది నొప్పించక తాన్నొవ్వక అన్న వ్యవహార శైలి. తాను ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన రోజున ఇరుగు పొరుగున ఉన్న అన్ని దేశాలు, ప్రభుత్వాధినేతలను ఆహ్వానించారు. చీటికీమాటికీ కయ్యానికి కాలుదువ్వే పాకిస్తాన్‌తోనూ ‘ఎక్కడ పెట్టాల్సిన వాత అక్కడ పెడుతూ (సర్జికల్ దాడులు) స్నేహానే్న కోరుకుంటూ వస్తున్నారు. అంతర్జాతీయంగా భారత్‌ను తిరుగులేని దేశంగా తీర్చిదిద్దాలన్న పట్టుదలతో ఉన్న మోదీకి ఇప్పటికే ప్రపంచ దేశాల నేతలు ఘనమైన గుర్తింపే ఇచ్చారు. ఇప్పుడు ఇద్దరు మహానాయకుల మధ్య భేటీ. ఎన్నో అంశాల, విషయాలు పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవలే మోదీ రష్యాలో పర్యటించారు. అదీ రష్యాకు, అమెరికాకు మధ్య విభేదాలు రాజుకుంటున్న తరుణంలోనే..! ఈ నేపథ్యం కూడా 26న జరిగే మోదీ-ట్రంప్ శిఖరాగ్ర భేటీపై ప్రభావాన్ని చూపేదేననడంలో ఎలాంటి సందేహం లేదు. ఇరు దేశాల మధ్య ఎన్ని విభేదాలు ఉన్నా..ఎలాంటి సమస్యలు తలెత్తినా అవి క్షణాల్లో సామరస్య పూర్వకంగా పరిష్కారమయ్యాయే తప్ప ద్వైపాక్షిక బంధాన్ని తెగతెంపులు చేసుకునే స్థాయికి దిగజారలేదు. తన చిరకాల ప్రత్యర్థి రష్యాకు భారత్ చేరువైనా అమెరికా మాత్రం ఇక్కడి నాయకత్వాన్ని పక్కన పెట్టలేదు. బరాక్ ఒబామా తన అధ్యక్ష పదవీకాలంలో ఎవరూ ఊహించని రీతిలో పలుసార్లు భారత్ వచ్చారు. అంతకు ముందు రిపబ్లికన్ పార్టీ తరపున ఎన్నికైన జార్జి బుష్ కూడా భారత్‌కు ఎనలేని ప్రాధాన్యతనిచ్చారు. అంటే అమెరికాలో అధికారంలో డెమొక్రాట్‌లు ఉన్నా, రిపబ్లికన్‌లు ఉన్నా భారత్‌కు ఉన్న ప్రాధాన్యత తగ్గలేదని చెప్పడానికి ఇదే నిదర్శనం. ఓ పక్క హెచ్-1బి వీసాల సమస్య, మరోపక్క ఉగ్రవాద పీడ అన్నింటికీ మించి పొరుగున ఉన్న పాకిస్తాన్‌తో నిరంతర క్షోభ! ఇవన్నీ కూడా ట్రంప్‌తో మోదీ జరిపే చర్చల్లో ప్రస్తావనకు వచ్చే అంశాలే. అలాగే ఒప్పందం కుదిరినా ఇంత వరకూ అమలుకు నోచుకోని పౌర అణు ఇంధన ఒప్పందానికి సరికొత్త ఉత్తేజాన్ని తీసుకురావాల్సిన అవసరం కూడా భారత ఇంధన అవసరాల దృష్ట్యా ఎంతో ఉంది. వీటిపై ప్రధానంగా దృష్టి పెట్టి మోదీ ఎంత మేరకు అమెరికా అధ్యక్షుడి నుంచి మాట తీసుకుంటారో చూడాలి. ఇప్పటికే ఎందరో దేశాధినేతలతో మోదీ భేటీ అయ్యారు. అంతర్జాతీయ రాజకీయాల తీరును, అగ్ర రాజ్య అధినేత ఆలోచనా ధోరణిని వంటబట్టించుకున్నారు. ఇప్పటి వరకూ అమెరికా నాయకత్వంతో చర్చలు జరిపిన భారత రాజకీయ నాయకుల కంటే మోదీని భిన్నమైన శైలి. ప్రపంచంలో ఏ దేశానికీ లేనన్ని అన్ని రకాల వనరులు పుష్కలంగా ఉన్న మాతృ దేశాన్ని అంతర్జాయంగా శిఖరాగ్రానికి చేర్చాలన్నది ఆయన తపన. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడినా..చైనా అధినేత జీ జిన్‌పింగ్‌తో భేటీ అయినా మోదీ లక్ష్యం మనసావాచా ఇదే. ఇప్పుడు ట్రంప్‌తోనూ ఆయన చర్చలు భారత ప్రయోజనాల సాధనే ధ్యేయంగా సాగుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎక్కడా రాజీ పడకుండా అనుకున్నది సాధించగలిగే ధీమా, ఆత్మవిశ్వాసం, అన్నింటి కంటే రాజకీయ నిబద్ధతా మోదీకి ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కొత్త అజెండాతో ట్రంప్ అధికారంలోకి రావడంతో ప్రపంచమంతా మారిపోయింది. ముఖ్యంగా పారిస్ పర్యావరణ ఒప్పందం నుంచి అమెరికా తప్పుకోవడం ఇందుకు తార్కాణం. ముస్లిం దేశాలపై ఆయన నిషేధం విధించడం, వీసాలపైనా ఆంక్షలు విధించడం అన్నవి గతంలో ఏ అధ్యక్షుడూ సాహసించని పనులు. అత్యంత వివాదాస్పదమైన, అమెరికా ప్రజాస్వామ్య ప్రతిష్టకే మచ్చతెచ్చే ఇలాంటి నిర్ణయాలను సునాయాసంగా తీసేసుకున్న ట్రంప్‌ను మోదీ ఎలా ‘డీల్’చేస్తారన్నది ఆయన పటుతరమైన ఆలోచనా ధోరణిపైన, మొక్కవోని దక్షత పైనే ఆధారపడి ఉంటుంది.

బి.రాజేశ్వర ప్రసాద్