స్పాట్ లైట్

ఎంతొస్తే అంత..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రిటన్ హక్కుల్ని పరిరక్షించుకుంటామని, ఐరోపాయూనియన్ నుంచి తమకు రావాల్సిన ప్రతిదాన్నీ పట్టుబట్టి మరీ రాబట్టుకుంటామంటూ ఊదరగొట్టిన ప్రధాని ధెరీసామేకు ఇప్పుడు రాజీబాటే మార్గమైంది. నిజానికి ఆమె అనుకున్నట్టుగా పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ వచ్చి ఉంటే సునాయాసంగానే ‘హార్డ్ బ్రెగ్జిట్’అంటూ దూసుకుపోయి ఉండేవారే. ఉన్నదీ పోయింది ఉంచుకున్నదీ పోయింది అన్నట్టుగా ఇప్పుడు హౌస్ ఆఫ్ కామన్స్‌లో సొంత మెజార్టీ లేక మరో పార్టీ మద్దతుపై ఆధారపడ్డ థెరీసాకు గతంలో ఉన్నంత ధీమా లేదు. ఇమిగ్రేయన్ వత్తిడి తేవాలని, ఐరోపా యూనియన్ కస్టమ్స్ యూనియన్, సింగిల్ మార్కెట్, న్యాయపరమైన అంశాలపైనా పట్టుబట్టాలని భావించిన ధెరీసాకు ఇప్పుడు పట్టుదలకు పోతే అసలుకే ఎసరు వచ్చే పరిస్థితి ఎదురవుతోంది. ఈ పరిస్థితుల్లో గతంలో నార్వే వైదొలగినప్పుడు కల్పించిన వెసులుబాటునే ఇప్పుడు బ్రిటన్‌కూ కల్పించాలని ఐరోపా యూనియన్ నాయకత్వం భావిస్తోంది. అంటే ఉభయ తారకమైన రీతిలోనే బ్రెగ్జిట్ వెతల నుంచి బయట పడే అవకాశాన్నీ కల్పిస్తోందన్న మాట! నార్వే బాటలో ముందుకెళితే ఆర్థికంగా నష్ట పోకుండా, ఐరోపాయూనియన్ ప్రయోజనాలూ దెబ్బతినకుండా బ్రిటన్ బయట పడగలుగుతుంది. బలంగా మాట్లాటే పరిస్థితి లేనప్పుడు రాజీని మించిన మార్గం లేదన్నది ఇప్పుడు థెరీసా ముందున్న దారి.. అయతే దీన్ని కాకుండా తాను అనుకున్న దారిలోనే ముందుకు వెళ్లాలని బ్రిటన్ ప్రధాని భావిస్తే మాత్రం సమస్యల తుట్టెను కలిదిలించినట్టే అవుతుంది. ప్రస్తుతం థెరిస్సా ప్రభుత్వానికి అండగా నిలిచిన మిత్రపక్షం ఎన్నాళ్లు బాసటనిస్తుందన్నది అనుమానమే. అలాంటప్పుడు సమస్యను కోరి తెచ్చుకోవడం కంటే అందుబాటులో ఉన్న రాజీబాటలో ముందుకెళ్తేనే ఇటు బ్రిటన్ ప్రజల ఆశలను నెరవేర్చినట్టవుతున్నదే థెరీస్సా ఆలోచన.