స్పాట్ లైట్

కొరియాపైనా గురి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికా మరోసారి రెండు యుద్ధాలకు పరిమిత స్థాయిలో సిద్ధమవుతోందా? 9/11 నేపథ్యంలో అటు ఇరాక్‌పైనా, ఇటు అఫ్గాన్‌పైనా సమర భేరి మోగించిన అమెరికా ఇప్పుడు సిరియాపై దృష్టి పెట్టింది..అదే సమయంలో కయ్యానికి కాలుదువ్వుతున్న ఉత్తర కొరియాపైనా యుద్ధ నౌకల్ని గురి పెడుతున్నట్టుగా తాజా పరిణామాల్ని బట్టి స్పష్టం అవుతోంది. ఇటు క్షిపణి పరీక్షలు సాగిస్తూ పొరుగున ఉన్న దక్షిణ కొరియాను కలవర పెడుతున్న ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ అణు సత్తానూ పెంపొందించుకునేందుకు సిద్ధ పడటమే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహానికి కారణంగా కనిపిస్తోంది. ఐరాస ఆంక్షలు విధించినా, మిత్ర దేశమైన చైనా బుజ్జగించేందుకు ప్రయత్నించినా ఉత్తర కొరియా మాత్రం ఆగడం లేదు. ఏకంగా అమెరికానే లక్ష్యంగా చేసుకుని క్షిపణి సామర్థ్యాన్ని పెంచుకుంటున్నామని చెప్పడంతో పాటు ఇటీవల జపాన్ జలాల్లోకీ క్షిపణులను ప్రయోగించి అలజడి రేకెత్తించింది. ఉత్తయాను ఉపేక్షించడం తమ ప్రయోజనాలకు, ప్రపంచ శాంతికి ఎంత మాత్రం మంచిది కాదన్న నిర్ణయానికి వచ్చేసిన ట్రంప్ దాడికి సంసిద్ధమన్న సంకేతాల్ని అందించారు.
తన బలాన్ని, బలగాన్ని నిరూపించుకునేందుకు కొరియా ద్వీపకల్పానికి సమీపంలోని పశ్చిమ పసిఫిక్ మహా సముద్ర జలాల్లోకి కార్ల్‌విన్సన్ అనే నౌకా దళ మెరుపుదాడి దళాల్ని తరలించారు. ఇందులో భాగంగా యుద్ధ విమాన వాహక నౌకనూ మోహరించారు. తమపై దాడి చేసే సత్తా ఉత్తర కొరియాకు ఉన్నా లేకపోయినా దాని చేష్టల్ని బట్టి చూస్తే ఇప్పటికిప్పుడే కాకపోయినా సమీప భవిష్యత్‌లోనైనా ఉత్తర కొరియాతో ముప్పేనన్న నిర్ధారణకు అమెరికా వచ్చేసింది. సమస్య ముంచుకొచ్చే వరకూ ఆగకుండా ముందస్తుగానే దాన్ని నివారించడం వల్ల అన్ని విధాలుగా ప్రయోజనం ఉంటుందని భావిస్తున్న అమెరికా ఎలాంటి దాడికైనా తాము సిద్ధమన్న సంకేతాల్ని అందించేందుకే కార్ల్‌విన్సన్‌ను తరలించినట్టుగా చెబుతున్నారు. పసిఫిక్ మహా సముద్ర ఉత్తర దిశగా వెళ్లమనే ఈ నౌకాదళ బృందాన్ని ఆదేశించిన అమెరికా దాని అంతిమ గమ్యాన్ని మాత్రం గోప్యంగా ఉంచింది. కేవలం క్షిపణుల పరీక్షతోనే సరిపెట్టకుండా ఖండాంతర క్షిపణి సామర్థ్యాన్నీ పెంచుకుంటున్నామని ఉత్తర కొరియా అధికారులు ప్రకటించడం, అందుకు ఈ నెల 15నే ముహూర్తం పెట్టడం అమెరికా అత్యవసర చర్యకు ప్రేరణ అయింది. కేవలం రెండేళ్లలోనే అమెరికానూ లక్ష్యంగా చేసుకునే రీతిలో అణ్వస్త్రాలను ఉత్తర కొరియా సిద్ధం చేసుకునే అవకాశం ఉన్నట్టు అంతర్జాతీయ విశే్లషణలను బట్టి స్పష్టం అవుతోంది. ముఖ్యంగా అమెరికా-చైనా అధ్యక్షులు ట్రంప్, జీ జిన్‌పింగ్‌ల శిఖరాగ్ర సదస్సు సమయంలోనే ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించి తన కండకావరాన్ని ప్రదర్శించింది. ఇవన్నీ కూడా తమకు ప్రత్యక్ష సవాలుగానే పరిణమిస్తున్న ట్రంప్ ఏ క్షణంలోనైనా ఉత్తర కొరియాపై సమరభేరి మోగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

చిత్రం..సిరియాపై దృష్టిపెట్టిన అమెరికా ఇప్పుడు ఉత్తర కొరియాను దారికి తెచ్చే పనిలో పడింది. ఇందులో భాగంగా
కొరియా దీపకల్ప దిశగా నౌకాదళ మెరుపు దాడి దళాలను తరలించేందుకు సిద్ధమవుతోంది.