స్పాట్ లైట్

తల్ అఫార్ ఇంకెంత దూరం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెలల తరబడి సాగించిన పోరాటం అనంతరం మొసూల్ పట్టణాన్ని ఐసిస్ మిలిటెంట్ల నుంచి చేజిక్కించుకోగలిగిన ఇరాకీ దళాలకు వాయవ్య ప్రాంతంలోని తల్ అపార్ అనే ప్రాంతం పెను సవాలుగా మారింది. క్రమంగా ఇరాక్‌లో పట్టును కోల్పోతూ వస్తున్న ఐసిస్ ఉగ్రవాదులు ఈ పట్టణంలో తిష్టవేశారు. దీన్ని రాబట్టుకునేందుకు ఆవిధంగా పూర్తిస్థాయిలో దేశంనుంచి ఐసిస్‌ను తరిమికొట్టేందుకు ఇరాకీ దళాలు వ్యూహాత్మకంగానే ముందుకు సాగుతున్నాయి. గత నెల రోజులుగా ఈ కీలక పట్టణాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఆపరేషన్ మొదలుపెట్టిన ఇరాకీ దళాలు ఎంతమేరకు విజయం సాధిస్తాయి? మొసూల్ తరహాలో తల్ అఫార్ పట్టణ స్వాధీనం కూడా నెలల తరబడి సాగుతుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. పట్టణంలో 1500మంది ఐసిస్ ఉగ్రవాదులున్నట్లు అంచనా. వీరిలో అనేకమంది విదేశీ ఉగ్రవాదులు కూడా ఉన్నారని కథనాలు వస్తున్నాయి. ఎప్పుడైతే మొసూల్ పట్టణం స్వాధీనమైందో అప్పటినుంచి ఇరాకీ దళాలు ఐసిస్‌పై పూర్తిస్థాయి పట్టును సాధించేందుకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూనే ఉన్నాయి. అమెరికా సారథ్యంలోని సంకీర్ణ దళాలు కూడా ఇటు సైనికపరంగా ఆయుధపరంగా సహకరించడంతో తల్ అఫార్ పట్టణాన్ని అతి సమీప వ్యవధిలోనే స్వాధీనం చేసుకోగలమన్న ధీమా ఇరాకీ దళాల్లో వ్యక్తమవుతోంది.