స్పాట్ లైట్

కత్తిమీద సామే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెండున్నర శతాబ్దాల రాజరిక వ్యవస్థకు చెరమగీతం పాడి పదేళ్ల క్రితం ప్రజాస్వామ్య పథంలో అడుగు పెట్టిన నేపాల్ ఇప్పటికీ ఆపసోపాలు పడుతూనే ఉంది. కొత్త రాజ్యాంగ ఏర్పాటుకు ఉద్దేశించిన పరిషత్ ఏర్పాటే వివాదాల మయంగా సాగిన విషయం తెలిసిందే. రాజరికాన్నయితే రాజకీయ పార్టీలు తోసిరాజనగలిగాయి కానీ ప్రజాస్వామ్య వ్యవస్థ మూలాలను, విలువలను ఔపోసన పడ్డడంలో విఫలమయ్యాయి. పదేళ్లుగా ఏ ఒక్క ప్రభుత్వం పూర్తికాలం పాటు అధికారంలో కొనసాగిన దాఖలాలు లేవు. ఇటీవల సంభవించిన ప్రకృతి విలయం పుణ్యమా అని అన్ని పార్టీలు హడావుడిగా అవగాహనకు రావడంతో కొంతలో కొంత మేర పరిస్థితి మెరుగైంది. 2015లో రూపొందిన తొలి గణతంత్ర రాజ్యాంగ నియమ నిబంధనల ప్రాతిపదికగా మరికొన్ని వారాల్లో సాధారణ ఎన్నికలకు నేపాల్ సిద్ధమవుతోంది. కొత్త రాజ్యాంగం ప్రకారం వచ్చే ఏడాది జనవరి 21 నాటికి పార్లమెంట్ ఏర్పడాల్సి ఉంటుంది. రాజకీయ పార్టీల మధ్య ఎన్ని విభేదాలు ఉన్నా..హక్కులు, అధికారాలు, పాలనా వ్యవస్థకు సంబంధించి కీచులాటలు సాగుతున్నా సాధారణ ఎన్నికల నిర్వహణకు అందరూ సుముఖం కావడం వాటిలో పెరుగుతున్న వాస్తవిక దృక్పథానికి నిదర్శనం. ఈ విషయంలో ముఖ్యమంత్రి షేర్ బహదూర్ దేవుబా గురుతర పాత్రే పోషించారు. 2002లో అప్పటి నేపాల్ రాజు జ్ఞానేంద్ర చేత పనికిరాడని ముద్ర వేయించుకున్న దేవుబానే ఇప్పుడు దేశాన్ని సరికొత్త మలుపు తిప్పబోతున్నారు. దశాబ్దాలుగా సాగిన మావోయిస్టుల తిరుగుబాటను అణచివేయలేక పోవడం వల్ల 2002లో దేవుబాకు జ్ఞానేంద్ర ఉద్వాసన పలికారు. దాంతో రాజరిక వ్యవస్థను తొలగించే విషయంలో అన్ని రాజకీయ పార్టీలు ఏకమయి విజయం సాధించినా ఏరకమైన పాలనా వ్యవస్థ ఉండాలన్న దానిపై మాత్రం తీవ్ర స్థాయిలోనే వాటి మధ్య పెనుగులాట సాగింది. ఆసియాలోనే అత్యంత పేద దేశంగా ఉన్న నేపాల్‌లో గత పదేళ్లలో తొమ్మిది ప్రభుత్వాలు మారాయి. తాజాగా జరుగనున్న ఎన్నికలతోనైనా దేశ పరిస్థితి మారుతుందా..రాజకీయ సుస్థిరతకు ఆస్కారం ఏర్పడుతుందా అన్న ఆసక్తి పొరుగున ఉన్న భారత్‌తో పాటు చైనా తదితర దేశాల్లో ఎంతో ఆసక్తి వ్యక్తమవుతోంది. ఈ రెండు దేశాలకూ నేపాల్ అత్యంత కీలకమన్న విషయం తెలిసిందే. ఏ విధంగా చూసినా కూడా ఈ ఎన్నికలను సక్రమంగా, ప్రశాంతంగా నిర్వహించడం దేవుబాకు కత్తిమీద సాము లాంటిదే. ఇప్పటికే దేశ ప్రధానిగా అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని పోవడంలో కృతకృత్యమైన ఆయన ఈ ఎన్నికల సవాలును అధిగమించగలగుతారా? రాజకీయ పార్టీలు పెట్టె మెలికలతో మెలికలు తిరిగిపోతారా అన్నది వేచి చూడాల్సిందే. ముఖ్యంగా మొదటి నుంచి తమకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్న భారత్ పట్ల నేపాల్ ఎంతో నమ్మకాన్ని పెంచుకుంది. అలాగే చైనాతో కూడా వైరం తెచ్చుకోకుండా నొప్పించక తానొవ్వక అన్న రీతిలోనే వ్యవహరిస్తోంది.