స్పాట్ లైట్

ఎటుదారుంటే అటే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శరణార్థుల సంక్షోభం కొత్త పుంతలు తొక్కుతోంది. ఆఫ్రికా తదితర దేశాల్లో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో తలదాచుకునేందుకు ఇతర దేశాలకు పరుగులు పెడుతున్న వేలాది మంది అభాగ్యుల పరిస్థితి ఎప్పటికప్పుడు దయనీయంగా మారుతోంది. వీరి తాకిడి తట్టుకోలేక అనేక దేశాలు సరిహద్దులూ, సముద్ర మార్గాల్నీ మూసేశాయి. 2015లో శరణార్థుల సంక్షోభం పరాకాష్టకు చేరుకున్న నాటి నుంచి పరిస్థితులు ఎంతగానో మారాయి. దీన్ని మానవీయ కోణంలో పరిష్కరించాలన్న వాదనా పదునెక్కింది. అయినప్పటికీ కూడా అనేక ఐరోపా దేశాలు శరణార్థుల్ని ఎదుర్కొనే విషయంలో కొత్త విధానాలను అవలంబించడం మొదలు పెట్టాయి. ముఖ్యంగా మధ్యప్రాచ్య నుంచి వచ్చే శరణార్థుల విషయంలో ఐరోపా యూనియన్ దేశాలు ‘ఒకరిరాక ఒకరి పోక’ అన్న రీతిలో టర్కీతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఏడాది ఉత్తర ఆఫ్రికా నుంచి మధ్యదరా సముద్రం మీదుగా తరలివచ్చే శరణార్థుల్ని అడ్డుకునేందుకు ఇటలీ చాలా తీవ్ర విధానానే్న అమలు చేసింది. వీటన్నింటి పర్యవసానంగా శరణార్థుల తాకిడి తగ్గినప్పటికీ కొత్త మార్గాలూ ఎప్పటికప్పుడు తెరుచుకుంటూనే ఉన్నాయి. ఉత్తర మొరోకో నుంచి స్పెయిన్‌కు వలసలు పెరగడానికి ఇదే కారణం. యెమన్ వంటి దేశాల దిశగా కూడా కొత్త దారులను శరణార్థులు వెతుక్కుంటున్నారు.