స్పాట్ లైట్

దిగడుగాక దిగడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధోరణితో దేశ ప్రజలే కాదు, మిత్ర దేశాల నేతలూ విసుగెత్తిపోయారు. గట్టివాడు, మొండివాడు, ఏది తోస్తే అది మాట్లాడేసేవాడనే కాదు..ఆయన పట్టుదలకు సంబంధించి తాజాగా మరో విశే్లషణ కూడా వీరంగం చేస్తోంది. అదేమిటంటే..ఎవరైనా పదవీ కాలం తీరిన తర్వాత గద్దె దిగాల్సిందే! కానీ ట్రంప్ మాత్రం ఇందుకు సమ్మతించక పోవచ్చునని, వైట్‌హౌస్‌ను వీడాల్సిన సమయం వచ్చినా దానే్న పట్టుకు వేలాడే అవకాశమూ లేకపోలేదని చెబుతున్నారు. పైగా అమెరికా అధ్యక్ష పదవికి ఉన్న గౌరవ మర్యాదల్ని కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందన్న స్పృహ కూడా ట్రంప్‌లో కనిపించడం లేదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ట్రంప్‌తో విసుగెత్తి పోయిన లాటిన్ అమెరికా నేతలే ఈ రకమైన ప్రచారం చేస్తున్నారు. పైగా నికరాగువా మాజీ అధ్యక్షుడు డేనియల్ ఓర్టెగాకు ట్రంప్‌కు మధ్య ఎంతోసారూప్యత ఉందని ఆయన లాగే ట్రంప్ కూడా ఓ పట్టాన వైట్‌హౌస్‌ను వదిలికి పెట్టక పోవచ్చునన్న ఊహాగానాలూ వినిపిస్తున్నాయి.