స్పాట్ లైట్

దేనికైనా సిద్ధం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సవాళ్లకు ప్రతిసవాళ్లు విసురుతూ ఇటు అమెరికాను, అటు భారత్‌ను తన చర్యల ద్వారా కవ్విస్తూ చైనా మరింతగా తన ఆధిపత్యాన్ని విస్తరించుకుంటోంది. అన్నివిధాలుగా దేశంపై పట్టు బిగించిన అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ సైన్యాన్ని సర్వసన్నద్ధం కావాలంటూ తాజాగా ఇచ్చిన పిలుపు అనేక దేశాల్లో కలవరాన్ని రేపుతోంది. ముఖ్యంగా దక్షిణ చైనా మహాసముద్ర ప్రాంతం విషయంలో తలెత్తిన విభేదాలే చైనా ముందస్తు చర్యకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు. మరికొన్ని నెలల్లో ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తిచేసుకుని మరో ఐదేళ్లపాటు అధికారం తమదేనంటూ ధీమాతో ఉన్న జీ జిన్‌పింగ్ అన్నివిధాలుగా ప్రపంచ సవాళ్లకు దీటుగా చైనాను శక్తిమంతం చేస్తున్నారు. ప్రపంచంలో అతి పెద్ద సైన్యంగా ఉన్న పిఎల్‌ఓ సైనికుల సంఖ్య 2.3 మిలియన్లు. చైనా ప్రయోజనానికి గానీ దాని ప్రాదేశిక సమగ్రతకు గానీ ఏ రకమైన ముప్పు తలెత్తినా దాన్ని కూకటివేళ్లతోనే పెకిలించేందుకు లేదా ఎలాంటి సవాలునైనా ముఖాముఖి ఢీకొనేందుకు సైన్యాన్ని సిద్ధం చేసే దిశగా జిన్‌పింగ్ పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే సంయుక్త కమాండ్ వ్యవస్థను ఇప్పటినుంచి తీర్చిదిద్దుతున్నారు. కొత్త తరహా యుద్ధతంత్రంలో సైన్యానికి తర్ఫీదును ఇవ్వడంతోపాటు ఇటు రక్షణపరంగానూ, అటు ఆర్థికంగానూ చైనాను తిరుగులేని దేశంగా తీర్చిదిద్దుతున్నారు. ముఖ్యంగా దక్షిణ చైనా మహాసముద్ర ప్రాంతం గతంలో ఎన్నడూ లేనివిధంగా వివాదాస్పదంగా మారింది. 3.5 మిలియన్ చదరపు కి.మీ మేర విస్తరించిన ఈ సముద్ర ప్రాంతం విషయంలో చైనా, ఫిలిప్పీన్స్, వియత్నాం, మలేసియా, తైవాన్, బ్రూనీల మధ్య దీర్ఘకాలంగా ఆధిపత్య పోరు సాగుతోంది. చమురు సహజవాయు నిక్షేపాలు అపారంగా ఉండటం వల్ల ఈ దేశాలన్నీ కూడా తమ హక్కును ధ్రువీకరించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. చైనా శక్తికి, యుక్తికి బెదిరి భారత్ వంటి దేశాలను ఆశ్రయిస్తున్నాయి. ఇప్పటికే చైనాతో తగువెందుకనుకున్న అమెరికా ఈ వివాదంలో తలదూర్చే ప్రయత్నం చేయడం లేదు. ఏ దేశం వాదం ఆ దేశానిది అన్నట్లుగా నిమ్మకు నీరెత్తిన చందంగా ట్రంప్ వ్యవహరిస్తున్నారు. ఒక దశలో ఈ ప్రాంతానికి సైనిక నౌకలను పంపే ప్రయత్నం చేసినా అంతిమంగా అమెరికా మాత్రం తటస్థ వైఖరినే అవలంబిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సముద్ర ప్రాంతమంతా అలాగే దానిపై పూర్తి హక్కులు, అందులోని అంతర్గత సంపద తమదేనన్నట్లుగా చైనా వ్యవహరించడానికి అనేక దృష్టాంతాలున్నాయి. ముఖ్యంగా భారీ పరిమాణంలో ఈ ప్రాంతంలో నౌకలను మోహరించడం ద్వారా వియత్నాం వంటి దేశాలను చైనా బెంబేలెత్తిస్తోంది. ఈ విషయంలో భారత్ కూడా చైనా వైఖరిని నిరసించినప్పటికీ దాని ధోరణిలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. ముఖ్యంగా చైనా, పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్న భారత్ దక్షిణ చైనా మహా సముద్ర వివాదానికి సంబంధించి మాత్రం పెద్దగా తలదూర్చడం లేదు. అలాగే ఫిలిప్పీన్స్‌తో పాటు మరో నాలుగు దేశాలను బుజ్జగించడం ద్వారానూ లేదా బెదిరించడం ద్వారానూ వాటినుంచి ఎలాంటి ముప్పు లేకుండా చేసుకునేందుకు చైనా ప్రయత్నిస్తున్నప్పటికీ అంతర్జాతీయ పరిస్థితులు దానికి ఏమేరకు సహకరిస్తాయన్నది అనుమానంగానే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎలాంటి సవాలుకైనా సిద్ధం కావాలంటూ జీ జిన్‌పింగ్ తన సైనిక దళాలకు పిలుపునివ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. చైనాపై భారత్ సహా ఇతర దేశాలు ఒత్తిడి తేగలుగుతాయా? వియత్నాం వంటి చిన్న దేశాల ప్రయోజనాలను ఎంతమేరకు పరిరక్షించగలుగుతాయన్నది అనుమానమే. ఇరుగుపొరుగు దేశాలపై పట్టును సంపాదించుకోవడంతోపాటు దలైలామా అంశానికి సంబంధించి భారత్‌పై కారాలు మిరియాలు నూరుతున్న డ్రాగన్ బలప్రదర్శనకు కారణమేమిటన్నది వేచిచూడాల్సిందే.