స్పాట్ లైట్

థెరిస్సాకు ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రిటన్ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటినుంచి బ్రెగ్జిట్ వ్యవహారం థెరిసా మే కు ఎప్పటికప్పుడు సంకటమయ పరిస్థితులను కల్పిస్తూ వస్తున్నాయి. పార్లమెంటులో పూర్తి మెజారిటీని సాధించడం ద్వారా బ్రెగ్జిట్ చర్చలను శక్తివంతంగా ముందుకు తీసుకెళ్లాలన్న ఆమె ప్రయత్నాలకు దేశప్రజలు ఇచ్చిన తీర్పు తీవ్ర విఘాతం కలిగించింది. ఐరోపా యూనియన్ నుంచి వైదొలగాలన్న నిర్ణయం తీసుకున్నప్పటి నుంచీ కూడా ఏ విధంగా దేశ ప్రయోజనాలను కాపాడుకోవాలన్నది సమస్యాత్మకంగా, సంక్లిష్టమయంగా మారుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో బ్రిటన్‌కు ప్రయోజనం కలిగించే రీతిలో ఏ విధంగా ముందుకు వెళ్లాలన్నది అన్ని పార్టీల సహకారంతో తప్ప సాధ్యం కాని పరిస్థితి ఎదురైంది. అదే సమయంలో ఇటీవల జరిగిన ముందస్తు ఎన్నికల్లో పార్లమెంటులో ఉన్న మెజారిటీ కూడా పోవడంతో ఓ చిన్న పార్టీ సహకారంతోనే థెరిసా గట్టెక్కాల్సిన పరిస్థితి తలెత్తింది. అయితే తాజాగా ఐరోపా యూనియన్‌లో యునైటెడ్ కింగ్‌డమ్ సభ్యత్వానికి స్వస్తి పలుకుతూ ఎంపీలు తీసుకున్న నిర్ణయం ఆమెకు పెద్ద ఊరటగానే పరిగణించాలి. ఐరోపా యూనియన్ నుంచి ఉపసంహరణ బిల్లుకు అనుకూలంగా 326 ఓట్లు, ప్రతికూలంగా 290 ఓట్లు రావడంతో ఈ బిల్లుపై తదుపరి సమీక్ష జరపాల్సిన పరిస్థితి ఏర్పడింది. 1972నాటి ఐరోపా కమ్యూనిటీల చట్టం స్థానే ఈ బిల్లును ప్రవేశపెట్టారు. దీనిద్వారా ప్రస్తుతం ఉన్న ఐరోపా యూనియన్ చట్టాలన్నీ యునైటెడ్ కింగ్‌డమ్ చట్టాలుగా మారతాయి. దీనివల్ల బ్రెగ్జిట్ శాసనానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందీ లేని పరిస్థితి థెరిసా మే కు కలుగుతుందన్నది వాస్తవం. ఈ బిల్లుపై చర్చకు తన కన్సర్వేటివ్ పార్టీ నుంచి ఎలాంటి ఇబ్బందీ లేకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించగలిగారు. దీని కారణంగానే హౌస్ ఆఫ్ కామన్స్‌లో ఆమె పార్టీకి విజయం చేకూరింది.