శ్రీకాకుళం

నిప్పుల కొలిమి...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, ఏప్రిల్ 25: సమశీతల ప్రాతంగా పేరుగాంచిన శ్రీకాకుళం అధిక ఉష్ణోగ్రతలతో ఉడుకుతోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా సగటు ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఐదారేళ్ల కిందట ఏప్రిల్ నెలలో సగటు ఉష్ణోగ్రత 30నుండి 32 సెంటీగ్రేడ్ వరకే సమోదయ్యేది. ఇప్పుడు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవ్వడంతో జనజీవనం తీవ్ర ఇబ్బందులకు గురవుతోంది.
వారం రోజులుగా రాజాం, పాలకొండ, పాతపట్నం, కాశీబుగ్గ తదితర ప్రాంతాల్లో 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా మిగతా ప్రాంతాల్లో ఎలా ఉన్నా శ్రీకాకుళం వచ్చేసరికి కొంత చల్లదనం ఉండేది. అయితే, ఇప్పుడు ఆ పరిస్థితులు కనబడటం లేదు. ప్రధానంగా భవన నిర్మాణాలు పెరిగిపోవడం, రోడ్ల విస్తరణకు చెట్లను తొలగించడం, నదీ జలాలు ఇంకిపోవడం తదితర అంశాలు జిల్లాలో ఉష్ణోగ్రత పెరగడానికి కారణంగా మారుతోంది. దీనికి తోడు ఉక్కపోత కూడా ప్రజలను నానా ఇబ్బందులకు గురి చేస్తుంది. ఉదయం తొమ్మిది గంటల తర్వాత బయటకు రావాలంటే ప్రజలు అల్లాడిపోతున్నారు.
ఎండ వేడిమికి వడదెబ్బ తగిలి జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 25 మందికి పైగా మృత్యువాత పడ్డారు. దీనికి తోడు ఏప్రిల్ నెల పూర్తికావస్తున్నా వర్షాలు జాడలేకపోవడంతో భూగర్భజలాలు కూడా పూర్తిగా అడుగంటిపోయాయి. దీనికి తోడు ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవడం, భూగర్భజలాలు ఇంకిపోవడం తదితర కారణాల వలన పంటల కూడా పూర్తిగా ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుత కాలంలో రైతులు వేరుశెనగ, మొక్కజొన్న, కందులు వంటి పంటలను వేసేవారు. అయితే, వాతావరణం అనుకూలించకపోవడం వలన పంటలు కూడా వేయడం మానేశారు. ప్రధానంగా ఎండ తాకిడికి కూలీలు, కార్మికులు, వ్యవసాయ దారులు బయటకు వెళ్లలేక ఇళ్లవద్దే మండుతున్నారు. ఈనెలాఖరులోగా వర్షాలు పడకపోతే ప్రజలు విషజ్వరాలకు గురయ్యే ప్రమాదం ఉందని వైద్యులు కూడా చెబుతున్నారు.