శ్రీకాకుళం

వైద్య ఆరోగ్య శాఖలోని ఖాళీ పోస్టులకు ఇంటర్వ్యూలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(టౌన్), డిసెంబర్ 12: జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న వివిధ కేటగిరీ పోస్టులకు శనివారం స్థానిక డిఎం అండ్ హెచ్‌ఒ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. డిఎం అండ్ హెచ్‌ఒ డాక్టర్ ఆర్.శ్యామల తెలిపిన వివరాల ప్రకారం ఎన్‌సిడి ప్రాజెక్టు కింద జిల్లాలోని 18 క్లస్టర్లకు ఏడు క్లస్టర్లకు ఈ పోస్టులు కేటాయించినట్టు తెలిపారు. ఇందులో జిల్లా ఎపిడిమాలజిస్ట్ పోస్టు ఒకటి ఖాళీ ఉండగా రెండు దరఖాస్తులు అందాయని, అయితే వారిలో ఎవరూ ఇంటర్వ్యూనకు హాజరుకాకపోవడంతో ఆ పోస్టు ఖాళీగా విడిచిపెట్టినట్టు తెలిపారు. కాగా సైటో పెథాలజీ టెక్నీషియన్ పోస్టు ఒకటి ఖాళీ ఉండగా రెండు దరఖాస్తులు వచ్చాయని, వీరిలో ఒకరే హాజరు కావడంతో వారికే ఆ పోస్టు కేటాయించినట్టు తెలియజేసారు. అలాగే రిహాబిల్టేసన్ వర్కర్స్ ఏడుపోస్టులకు ఐదు దరఖాస్తులు రాగా నలుగురు, పిజియోథెరపిస్ట్ పోస్టు ఒకటికి ఎనిమిది దరఖాస్తులు రాగా ఎనిమిది మంది, ల్యాబ్ టెక్నీషియన్ ఒక పోస్టు ఉండగా 40 దరఖాస్తులు వచ్చాయని, ఇందులో 31 మంది హాజరయ్యారని, స్టాప్ నర్సులు నాలుగు పోస్టులకు 87 దరఖాస్తులు రాగా 69 మంది ఇంటర్వ్యూనకు హాజరయ్యారని చెప్పారు. వీరిని ఇంటర్వ్యూ అనంతరం రోస్టర్ ప్రకారం భర్తీచేస్తామని తెలిపారు. ఇంటర్వ్యూల్లో ఆమెతో పాటు అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఎం.శారద, నోడల్ అధికారి డాక్టర్ మెండ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పథకాల ప్రచారానికే జనచైతన్య యాత్రలు

శ్రీకాకుళం(రూరల్), డిసెంబర్ 12: ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృదిద సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు తెలియజేసేందుకు జనచైతన్య యాత్రలు నిర్వహిస్తున్నామని ఎంపిపి గొండుజగన్నాథరావు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు శనివారం మండలంలోని లంకాం గ్రామంలో జనచైతన్య యాత్ర నిర్వహించారు. గ్రామంలో ర్యాలీనిర్వహించి ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపిపి మాట్లాడారు. కార్యక్రమంలో మండలపార్టీ అధ్యక్షుడు సీర రమణ, జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడుచిట్టిమోహన్, ఎస్‌ఎస్ వలస సర్పంచ్ కంచు దశరధుడు, గేదెలశ్యామ్, రావాడ భాస్కరరావు, పేడాడ సోమేశ్వరరావు, పేడాడ రామారావు, జామి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లింగాలవలసకు చెందిన 20మంది తెలుగుదేశం పార్టీలో చేరారు.

విధి నిర్వహణలో వికలాంగురాలైన యువతికి సాయం

శ్రీకాకుళం(టౌన్), డిసెంబర్ 12: జిల్లాలోని నరసన్నపేట మండలం బొడ్డవలస గ్రామానికి చెందిన లోకొండ ఝాన్సీ పోలీసు కానిస్టేబుల్‌గా విధి నిర్వహణలో కాలు పోగొట్టుకొని వికలాంగురాలు కాగా, ఆమెకు పార్లమెంటు సభ్యుడు కింజరాపు రామ్మోహననాయుడు చేతుల మీదుగా 51 వేల రూపాయలతో కృత్రిమ కాలును అందించి విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో పనిచేస్తున్న పూడి మల్లేశ్వరరావు తన వితరణ చాటుకున్నారు. శనివారం స్థానిక ఎంపి కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంపి మాట్లాడుతూ ఝాన్సీకి ప్రభుత్వం నుండి అందాల్సిన సహకారం అందేలా తనవంతు కృషిచేస్తానని హామీనిచ్చారు.