శ్రీకాకుళం

నాసిరకం సరకులు సరఫరా చేస్తే సహించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, అక్టోబర్ 22: నాసిరకం సరుకులను సరఫరా చేస్తే వారిపై చర్యలు చేపడతామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖామంత్రి, జిల్లా ఇన్‌చార్జ్జి మంత్రి పరిటాల సునీత అన్నారు. శనివారం జిల్లా పర్యటనకు విచ్చేసిన మంత్రి అరసవల్లిలోని పౌర సరఫరాల సంస్థ ఎంఎల్‌ఎస్ పాయింట్‌ను తనిఖీ చేశారు. ఇక్కడ ఉన్న బియ్యం, కందిపప్పు, పంచదార, పామాయిల్ సరకులను స్వయంగా పరిశీలించారు. అంగన్వాడీ బాలలకు ఈ శాఖ నుండి కందిపప్పును సరఫరా చేస్త్తున్నామని నాసి రకం సరకులు సరఫరా చేస్తే సహించేది లేదన్నారు. సరుకుల నాణ్యతపై సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈసందర్భంగా విలేఖర్లతో మాట్లాడుతూ టెండర్లు వేసిన సరఫరా దారులు విధిగా నాణ్యమైన సరుకులు మాత్రమేసరఫరా చేయాలన్నారు. ఎం ఎల్ ఎస్ పాయింట్ నుండి డీలర్లు స్వయంగా తూకం చూసుకుంటూ సరుకులు తీసుకెళ్లాలని ఆమె సూచించారు. తూకంలో తక్కువ వస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయని ఇక్కడ పరిశీలించామని ఎటువంటి తగ్గుదల లేదని ఆమె వెల్లడించారు. ప్రతీ నెల 1 నుండి 15లోగా బియ్యంతోపాటు కిరోషన్ కూడా ఎఫ్ పి షాప్‌లను ప్రజలకు అందించేలా డీలర్లును కోరామని చెప్పారు. హమాలీలను మా ప్రభుత్వం కుటుంబసభ్యులుగా భావిస్తుందన్నారు. రాష్ట్రంలో 4వేల మందికి పైగా హమాలీలు ఉన్నారని వారికి గతంలో లోడింగ్ అన్‌లోడింగ్ చార్జీలు రూ.8మాత్రమే చెల్లించేవారని దానికి మాప్రభుత్వం రూ.12కి పెంచిందన్నారు. ప్రస్తుతం రూ.15కు పెంపుదల చేస్తామని స్పష్టంచేశారు. దసరా కానుకగా రూ.3వేల నగదుతోపాటు రెండజతట బట్టలు, కుట్టుకూలి కింద రూ.500, రూ.500విలువ చేసే స్వీట్ హమాలీలకు అందజేసినట్లు తెలిపారు. ఈమెతోపాటు ఎంపి రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్యే లక్ష్మీదేవి, జిల్లా మేనేజర్ హెచ్ విజయరామ్, పౌర సరఫరాల అధికారి వి.సుబ్రహ్మణ్యం, తూనికలు, కొలతలు తనిఖీ అధికారి రాజేష్, తహశీల్దార్ ఎస్.సుధాసాగర్, టిడిపి జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీష, ముద్దాడ కృష్ణమూర్తి నాయుడు ఉన్నారు.