శ్రీకాకుళం

రేషన్ కార్డుదారులకు.. ‘స్వచ్ఛ్భారత్’ స్లోగన్ నేర్పండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, నవంబర్ 7: చౌకధరల దుకాణాల వద్ద మురుగు కాల్వలు శుభ్రంగా ఉంచాలని, స్వచ్ఛ్భారత్ స్లోగన్ తప్పనిసరిగా రేషన్ కార్డుదారులకు చెప్పాలంటూ రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి పరిటాల సునీత డీలర్లను ఆదేశించారు. స్వచ్ఛ్భారత్ అంశాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు చౌకధరల దుకాణాలకు వచ్చే దారిద్య్రరేఖకు దిగువనున్న వారిలో చైతన్యం కలిగిస్తే సులభతరం అవుతుందన్నారు. సోమవారం శ్రీకాకుళం నగరంలో చౌకధరల దుకాణాన్ని పరిశీలించిన మంత్రి తుకాలను తనిఖీ చేశారు. దుకాణంలో ఉన్న సరుకుల నాణ్యతను పరిశీలించారు. కార్డుదారులను తూకాలు, నాణ్యతపై అడిగి తెలుసుకున్నారు. చౌకధరల దుకాణం వద్ద గల మురుగు కాలువ పరిశుభ్రంగా ఉంచాలని ఆమె డీలర్లును ఆదేశించారు. 11 వందల మంది కార్డుదారులు వస్తారని వారికి స్వచ్ఛతపై అవగాహన కలిపించాలని సూచించారు. చంద్రన్న కిస్మస్, సంక్రాంతి కానుకలను త్వరలో పంపిణీ చేస్తన్నామని చెప్పారు. 1.30 కోట్ల కార్డుదారులు లబ్ధిపొందుతారని ఆమె చెప్పారు. కొత్త రేషన్ కార్డులకు 4.70 లక్షల దరఖాస్తులు అందాయని, ప్రజాసాధికార సర్వేలో మరికొన్ని విజ్ఞాపనలు వస్తున్నాయని వీటన్నింటిని పరిశీలించి జనవరిలో జరిగే జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో పంపిణీ చేస్తామని చెప్పారు. ప్రతీ కుటుంబానికి గ్యాస్ కనెక్షన్ ఉండాలన్నదే ముఖ్యమంత్రి ఆలోచన అన్నారు. అందులో భాగంగా ప్రతి ఒక్కరికి అందిస్తామని చెప్పారు. రాష్ట్రంలో పేదలకు గ్యాస్ స్టౌవ్‌లు అందించేందుకు దీపం కనెక్షన్ కింద 24 లక్షల కనెక్షన్లను మంజూరు చేసినట్లు మంత్రి సునీత అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా ఆమె ఉదయం రైతు బజార్‌ను, సూర్యమహాల్ వద్దగల 52వ నెంబరు చౌకధరల దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీలు చేశారు. రైతు బజారులో దుకాణాల వద్దకు నేరుగా వెళ్ళి కాయగూరలను, కిరాణా దుకాణాలలో ఆహార దినుసులను పరిశీలించారు. నాణ్యమైన సరుకులు విక్రయించాలని ఆదేశించారు. సరసమైన ధరలు ఉండాలని, వినియోగదారులకు సౌకర్యవంతంగా ఉండాలని అన్నారు. రైతు బజారులో పారిశుద్ధ్యం మెరుగుపరచాలని మార్కెటింగ్‌శాఖ సహాయ సంచాలకులు వై.వి.శ్యామ్‌కుమార్‌ను ఆదేశించారు. గతంలో పరిశీలించామని, అప్పటికీ, ఇప్పటికీ అనేక మార్పులు జరిగాయన్న సంతృప్తిని వ్యక్తం చేసారు. మంత్రితోపాటు పార్లమెంటు సభ్యుడు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, తదితరులు పాల్గొన్నారు.