శ్రీకాకుళం

ముఖ్యమంత్రి స్థలం అమ్మేశారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, జనవరి 28: దశాబ్ధాల కాలంగా తర్జనభర్జనలతో సంవాదాలు..వివాదాల నడుమ మార్కెట్‌లో చెల్లుబాటుకాకుండా మిగిలిపోయిన సాక్షాత్తు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్థలం ఎట్టకేలకు జిల్లా తెలుగుదేశం పార్టీ పెద్దలంతా ఒకేమాటమీద అమ్మేసారు! సర్వే నెం.18/6,7,8లో 46 సెంట్లు విస్తీర్ణం కలిగిన స్థలాన్ని తెలుగుతమ్ముడు రెడ్డి చిరంజీవికి అమ్మేసినట్టు ఆ పార్టీ నేతలు సుస్పష్టం చేసారు. ఇందుకుగాను ముందుగా రూ. 50 లక్షల రూపాయలు అడ్వాన్సుగా ఇవ్వాలంటూ షరత్తుపెట్టారు. మూడు నెలల వ్యవధిలో మిగిలిన మొత్తాన్ని చెల్లించేవిధంగా ఒప్పందం కుదిరినట్టు విశ్వసనీయంగా తెలిసింది. 2002లో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం కోసం బాబు పేరున కొనుగోలు చేసిన ఈ స్థలం పవర్ ఆఫ్ పట్టాను రెడ్డి చిరంజీవి పేరున ఇచ్చేందుకు పార్టీ వర్గాలు అంగీకరించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ మేరకు ఫిబ్రవరి రెండోతేదీన రెడ్డి చిరంజీవి నుంచి రూ.అరకోటి ముట్టిన వెంటనే బాబు పేరు నుంచి రెడ్డి చిరంజీవి పేరునకు పవర్ ఆఫ్ పట్టా ఇప్పించేందుకు జిల్లా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీసుకున్న చొరవ, శ్రమ ఫలించింది. జిల్లా టిడీపీలో వివాదాల కుంపటిలో గతంలో అచ్చెన్న ఇచ్చిన మాట మసిమాడైపోయిన విషయం తెలిసిందే! కాని - అదే మంత్రి అచ్చెన్న మళ్లీ బాబు స్థలాన్ని అమ్మేందుకు రెడ్డిచిరంజీవితో ఇటీవల ఆర్ అండ్ బి వసతి గృహంలో చర్చలు జరిపిన తర్వాత, మరోసారి ఎం.పి. నివాసం శ్రీసదన్‌లో ఎం.పి. రామ్మోహన్‌నాయుడు పట్టుబట్టి ఆ స్థలాన్ని కొనుగోలు చేయమంటూ చిరంజీవిపై ఒత్తిడి పెంచినట్టు తెలిసింది. రూ.కోటీ 70 లక్షలకు విక్రయించేలా చొరవచూపడంతో భూమిపూజ చేసి పనులు ప్రారంభించలేని జిల్లా పార్టీ కార్యాలయానికి ఆ నిధులు మల్లింపు చేసేలా లోకేష్ గ్రీన్‌సిగ్నెల్ ఇచ్చినట్టు సమాచారం. గత ఏడాది జూలైలో జిల్లా పార్టీ అధ్యక్షురాలు బహిరంగ ప్రకటన ఇస్తూ ముఖ్యమంత్రి స్థలాన్ని అధిక మొత్తానికి అమ్మేందుకు సాహసించినప్పటికీ, ఆ ప్రయత్నాలు సఫలీకృతం కాలేదు. అసలు వేలం రోజున కొనుగోలుదారులు హాజరుకాకపోవడంతో పార్టీ అధ్యక్షురాలుగా తనకు అవమానం జరిగే ప్రమాదం ఉందంటూ పార్టీ నేత విసీ పలాస నుంచి దిగుమతి చేసిన ఒక అషామీకి రూ. 1.60 కోట్లుకు అమ్మేసినట్లు ప్రకటించి, తర్వాత చేతులెత్తేసారు. దీంతో తొలుత బాబాయ్-అబ్బాయ్‌లు అచ్చెన్న, రామ్మోహన్‌నాయుడులు ముందుగా రూ.1.55 కోట్లుకు రెడ్డి చిరంజీవికి విక్రయించేలా చర్యలు తీసుకున్నప్పటికీ, దానిపై కళా, కూనలు శివాజీ గొంతుకుగొంతు కలిపి బహిరంగ ప్రకటన ఇస్తే రెండు కోట్లు వస్తుందన్న మాటలన్నీ నీటి మూటలుగా మిగిలిపోయాయి. దీంతో పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పదేసార్లు మంత్రి అచ్చెన్నతోపాటు, రాష్ట్ర, జిల్లా పార్టీ అధ్యక్షులపై పెంచిన ఒత్తిడి, జిల్లా ఎన్టీఆర్ ట్రస్టు భవనం నిర్మాణం మరింత ఆలస్యమవుతున్న నేపథ్యంలో మళ్లీ బాబు స్థలం విక్రయం కథ మొదటికే వచ్చింది. ముందుగా రూ. 1.55 కోట్లుకు స్థలాన్ని బాబుపేరున కొనిపించిన ఆ పార్టీ నేత రెడ్డిచిరంజీవి ఇచ్చేందుకు పార్టీ సమన్వయం కమిటీలో ఏకగ్రీవ నిర్ణయంగా మంత్రి వెల్లడిస్తే - దానిని అడ్డుకున్న ఎమ్మెల్యే శివాజీతో కూన, కళా బలపరచడంతో ఆ ధరకు గత ఏడాది ఫిబ్రవరిలో నిలిచిపోయిన విక్రయం మళ్లీ ఏడాది తర్వాత అదే రెడ్డి చిరంజీవికి రూ. 1.70 కోట్లుకు విక్రయించేందుకు జిల్లా పార్టీ పెద్దలు, పిన్నలు అంతా అంగీకరించడం వెనుక లోకేష్ ఒత్తిడే కారణంగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏడాది ముందు జరగాల్సిన ఈ లావాదేవీలు తాజాగా సంవత్సరం తర్వాత మళ్లీ మొదటికి వచ్చింది!

నేడు పల్స్‌పోలియో
బలగ, జనవరి 28: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 29వ తేదీన పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నారు. దీనికి జిల్లా వ్యాప్తంగా 2,45,833 మంది 0-5 వయస్సుగల పిల్లలు ఉండగా, అందుకుగాను 3,40,000 పోలియో వాక్సిన్ డోసులను సిద్ధం చేశారు. ఈ చుక్కలు వేయడానికి 1617 కేంద్రాలను ఏర్పాటు చేయగా, గ్రామీణ ప్రాంతాల్లో 1179, గిరిజన ప్రాంతాల్లో 325, పట్టణ ప్రాంతాల్లో 113 కేంద్రాలు, 53 ట్రాన్సిట్ బూత్‌లను ఏర్పాటు చేస్తున్నారు. వీటిని పర్యవేక్షించడానికి 161 మంది సూపర్వైజర్లు, 1138 మంది పారా మెడికల్ సిబ్బంది, 2938 మంది ఆశావర్కర్లు, 3863 మంది అంగన్వాడీ వర్కర్లు వినియోగించుకున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. పట్టణ ప్రధాన కేంద్రాల్లో, బస్‌స్టాండ్‌లలో కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. వీటిని 0-5 సంవత్సరాలలోపు వయస్సుగల పిల్లలకు తప్పక వేయించాలని ప్రజలకు జిల్లా యంత్రాంగం పేర్కొంటోంది. శనివారం సాయంత్రం నగరంలోని సంతోషిమాత గుడి వద్ద పల్స్‌పోలియో ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సనపల తిరుపతిరావు, డి ఐవో బగాది జగన్నాధరావులు పరిశీలించారు.

కడుపునొప్పి తాళలేక మహిళ ఆత్మహత్య
పాతపట్నం, జనవరి 28 : కడుపునొప్పి తాళలేక మహిళ ఆత్మహత్యకు పాల్పడినట్లు పాతపట్నం పోలీసులు తెలిపారు. సిబ్బంది ఇచ్చిన వివరాల మేరకు స్థానిక కోటగుడ్డి కాలనీకి చెందిన గుర్ర సుజాత (25) ఇటీవల అనారోగ్యకారణాలతో తీవ్రమైన కడుపు నొప్పి వచ్చిందని ఆ నొప్పిని తాళలేకి గనే్నరు పప్పు తిని పాల్పడిందని తెలిపారు. మృతిరాలి భర్త రెండేళ్ళ క్రితమే మృతి చెందాడు. పిల్లలు లేకపోవడంతో స్థానిక కోటిగుడ్డి కాలనీలో ఉన్న తన తల్లిదండ్రుల వద్ద జీవిస్తుంది. పాతపట్నం నవజీవన ఆశ్రమంలో పని చేసుకుంటూ జీవనం సాగించేంది. ఈమె మృతదేహాన్ని స్థానిక పిహెచ్‌సిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. పాతపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మెడికల్ ఆఫీసర్లకు వాకిన్ ఇంటర్వ్యూలు
బలగ, జనవరి 28: జిల్లాలోని తొమ్మిది మంది మెడికల్ ఆఫీసర్లకు గాను వాకిన్ ఇంటర్వూలు నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ సనపల తిరుపతిరావు తెలిపారు. ఈ ఇంటర్వూలు ఈ నెల 31వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ పోస్టులకు విద్యార్హత ఎంబిబి ఎస్ చేసిన వారు అర్హులని, కాంట్రాక్టు బేసిక్‌లో పనిచేసేవారు పూర్తి బయోడేటాతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయానికి హాజరు కావాలని డి ఎం అండ్ హెచ్‌వో కోరారు.
‘రాష్ట్రంలో అవినీతి పాలన’
శ్రీకాకుళం(రూరల్), జనవరి 28: రాష్ట్రంలో అవినీతి పాలన సాగుతోందని మాజీ మంత్రి, వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. గడపగడపకు వైకాపా కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం నగరంలోని గుడివీధిలో నిర్వహించారు. ఈసందర్భంగా ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై ప్రచురించిన కరపత్రాలను ఇంటింటికీ పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తయినప్పటికీ అభివృద్ధి మాత్రం శూన్యమని పేర్కొన్నారు. ప్రజలను మోసగిస్తూనే కాలయాపన సాగిస్తున్నారని తెలియజేశారు. ప్రత్యేక హోదా వస్తే నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వస్తాయని అయితే ముఖ్యమంత్రి దానిపై కనీస శ్రద్ధ కూడా పెట్టడం లేదన్నారు. సామాన్య పౌరుడు కూడా తమ హక్కులను కాలరాసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. గత రెండు రోజులుగా రాష్ట్రంలో పరిణామాలు పరిశీలిస్తే నిరంకుశ పాలన కొనసాగుతుందన్నారు. ప్రభుత్వం చేపట్టిన ప్రజావ్యతిరేక కార్యక్రమాలను ప్రజలు గమనిస్తున్నారని సరైన సమయంలో బుద్ధి చెబుతారన్నారు. ఈకార్యక్రమంలోమాజీ మున్సిపల్ చైర్‌పర్సన్‌లు ఎం.వి పద్మావతి, అందవరపు వరహానృసింహం, ఎన్ని ధనుంజయ, అందవరపు సూరిబాబు, నీలాద్రి, పి.కామేశ్వరి, సుగుణ, బిడ్డిక లక్ష్మీ, గుమ్మా నగేష్, కోరాడ రమేష్, సుంకర కృష్ణ, బైరి మురళీ తదితరులు పాల్గొన్నారు.
మిగులు బడ్జెట్ అంచనాలతో ఏకగ్రీవంగా కౌన్సిల్ ఆమోదం
ఆమదాలవలస, జనవరి 28: 2016-17 ఆర్థిక సంవత్సరం సవరించిన బడ్జెట్ అంచనాలు, ముగింపు నిల్వలు రూ.6.84కోట్లు కాగా ఈ సొమ్మును 2017-18 ఆర్థిక సంవత్సరానికి ప్రారంభం నిల్వగా చూపించి కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానించింది. చైర్‌పర్సన్ తమ్మినేని గీత అధ్యక్షతన శనివారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో మాట్లాడుతూ 2017-18 సంవత్సరానికి ఆర్థిక సంవత్సరానికి రాబడి, మూలధనం నిధులు మొత్తం రూ.12.38కోట్లు పైబడి ఉందని ఇందులో రూ.6.65కోట్లు ముగింపు నిల్వలుగా అంచనాలు చూపించి ఈ ఏడాది బడ్జెట్ తయారు చేసి ఆమోదించడం జరిగిందని ఆమె పేర్కొన్నారు. మున్సిపాలిటికీ ప్రధాన ఆదాయవనరులైన ఆస్థిపన్ను 95శాతం వసూలు కాగలవని ఆమె పేర్కొన్నారు. అసైన్డ్, రెవెన్యూ రూ.95లక్షల వసూళ్లతోపాటు షాప్‌అద్దెలు, చెట్లు, చెరువులు ఫలసాయం వంటి నుండి రూ.95శాతం వసూలు కాగలవని ఆమె పేర్కొన్నారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో 14వ ఆర్థిక సంఘం గ్రాంట్ సిపిడి ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ వంటి ప్రభుత్వ గ్రాంట్‌లు అంచనాలు బట్టి మంజూరు కాగలవని ఆమె పేర్కొన్నారు.
అభివృద్ధికి పెద్దపీట
ఎచ్చెర్ల, జనవరి 28: రాష్ట్రంలో అభివృద్ధికి పెద్దపీట వేసేలా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలన సాగిస్తున్నారని ప్రజలందరూ టిడిపి పాలనలో సంతోషంగా ఉన్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, స్థానిక ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు అన్నారు. మండలంలో చిలకపాలెంలో బస్‌సెల్టర్‌ను ప్రారంభించారు. అలాగే బడివానిపేట గ్రామంలో హుదూద్ తుఫాన్ ఇళ్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్థాయిలో టిడిపి అందిస్తున్న