శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

కప్పరాళ్లతిప్ప వాసుల్లో మార్పు రావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిట్రగుంట, డిసెంబర్ 19: బోగోలు పంచాయతీ మజరా గ్రామం కప్పరాళ్లతిప్ప వాసుల్లో మార్పు రావాలని కోరుకుంటున్నట్లు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు. శనివారం కప్పరాళ్లతిప్ప బోడెన్‌పేట చర్చి సమీపంలో నాటుసారా తయారీ వ్యతిరేక అవగహన సదస్సు ఏర్పాటు చేశారు. మండలాధ్యక్షురాలు పర్రి సులోచనమ్మ అధ్యక్షతన జరిగిన సభలో డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ గత 20 సంవత్సరాల ముందు నాటుసారా తయారీలో కప్పరాళ్లతిప్ప ప్రథమ స్థానంలో ఉండేదన్నారు. అనేక సంస్కరణలు తీసుకొచ్చిన తరువాత గ్రామంలో కొంత మార్పు వచ్చిందన్నారు. ఇంకా 10 శాతం మంది నాటుసారా కాస్తున్నరని వారు కూడా జనజీవన స్రవంతిలో కలసిపోవాలని ఆకాంక్షిస్తున్నమన్నారు. నాటుసారా కాచేవారు పేదలేనని, అది మానివేసిన వారికి ప్రభుత్వం తరపున అర్థికసాయం గాని, ఉపాధి కల్పనకు కోసం కానీ కృషి చేస్తామని చెప్పారు. నాటుసారా వల్ల ఎంతోమంది మృత్యువాత పడుతున్నారని అన్నారు. సారాకు అలవాటుపడిన వారి ప్రాణం కాపాడేందుకు సహకరించి నాటుసారా తయారీ వృత్తినుంచి బయటకురావాలని పలుమార్లు విజ్ఞప్తి చేశామన్నారు. రాష్ట ప్రభుత్వం నాటు సారా తయారీపై కఠిన చర్యలు తీసుకుంటోందన్నారు. సారాకాపు వృత్తిలో కొనసాగుతున్నవారు ఇకమీద పట్టుబడితే పిడి యాక్టు కింద కేసు నమోదు చేస్తామని తెలిపారు. బెయిల్ కూడా రాదని, సంవత్సరంపాటు జైలు జీవితం గడపాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. స్థానిక గ్రామపెద్ద డేవిడ్‌పాల్ మాట్లాడుతు తమ గ్రామంలో చాలావరకు మార్పు వచ్చిందని, కొంతమంది వల్ల గ్రామానికి చెడ్డ పేరు వస్తున్నమాట వాస్తవమన్నారు. నాటుసారా తయారీచేసేవారే బానిసై గ్రామంలో 20 సంవత్సరాల నుంచి 40 ఏళ్లలోపు ఎంతోమంది మృత్యువాత పడ్డారని, వారి కుటుంబాల్లో పేదరికం తాండవిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ కమిషనర్ జి.చెన్నాకేశవరావు, ఇఎస్‌ఎస్ బాలరామకృష్ణ, ఎఇఇఎస్ మధుసూదన్, ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ సిఐ రామారావు, కావలి ఎక్సైజ్ సిఐ బాబూరావు, జడ్పీటిసి బాపట్ల కామేశ్వరి, ఈఒ పిఆర్ మోహనరావు, బిట్రగుంట ఎఎస్సై పోలయ్య తదితరులు ప్రసంగించారు.