తెలంగాణ

ఘనంగా పోలేరమ్మకు బోనాల వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడెం, ఫిబ్రవరి 15: కడెం మండలంలోని నవాబ్‌పేట్ గ్రామంలో గురువారం గ్రామ దేవత అయిన పోలేరమ్మకు బోనాల వేడుకలను గ్రామస్థులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన మహిళలు తమ బోనాలను నెత్తిపై పెట్టుకుని గ్రామ వీధులగుండా ఊరేగింపుగా డప్పువాయిద్యాలతో బోనాలతో వెళ్లి పోలేరమ్మ దేవతకు బోనాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్కులను తీర్చుకున్నారు. ఈ బోనాల సందడి కార్యక్రమంలో గ్రామస్థులు, మహిళా భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.
నేటి నుంచి గోదావరి తీరం వద్ద వైదిక సమ్మేళనం
బాసర, ఫిబ్రవరి 15: బాసర సరస్వతిదేవి సన్నిధిలో, గోదావరి నదితీరాన మూడు రోజులపాటు వైదిక సమ్మేళన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వేద భారతి పీఠం వ్యవస్థాపకులు వేదవిద్యానంద స్వామీజి తెలిపారు. గురువారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ గోదారమ్మకు వేదపాఠశాల విద్యార్థులచే కార్తీక పౌర్ణమి రోజున తలపెట్టిన దక్షిణగంగ వేదనిత్య హారతి కార్యక్రమాన్ని నిరాటంకంగా కొనసాగిస్తున్నామని అన్నారు. నిత్య హారతి కార్యక్రమం ప్రారంభించి ఈనెల 16కు 108 రోజులు పూర్తికానున్న సందర్భంగా వైదిక సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 16, 17, 18న దేశవ్యాప్తంగా 108 మంది విశిష్ట వేదపండితులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. ఈవైదిక సమ్మేళన కార్యక్రమాన్ని ప్రజలు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
గొడిసిర్యాల శివాలయం వద్ద కారు అపహరణ
కడెం, ఫిబ్రవరి 15: దస్తురాబాద్ మండలంలోని గొడిసిర్యాల గ్రామంలోగల శ్రీ రాజరాజేశ్వర ఆలయం వద్ద ఈనెల 13వ తేదిన మహాశివరాత్రి రోజు టీ ఎస్ 01 ఈడి 12345 నెంబరుగల కారును దొంగలించి పారిపోతుండగా ఉట్నూర్ వద్ద కారు ప్రమాదానికి గురైంది. కారువిలువ సుమారు రూ.7 లక్షల వరకు దస్తురాబాద్ ఎస్సై అశోక్ తెలిపారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రానికి చెందిన మదుసుదన్‌రావుకు చెందినదని, కేసు నమోదుచేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఆయన తెలిపారు.
మరుగుదొడ్లు త్వరగా పూర్తి చేయాలి
దిలావర్‌పూర్, పిబ్రవరి 15: ప్రతి ఓక్కరు త్వరితాగతిన గ్రామల్లో మరుగుదోడ్లు పూర్తి చేయాలని మండల ప్రత్యేకాదికారి నర్సయ్య అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో గురువారం మండల ఎన్ ఆర్‌జియస్ సిబ్బందితో సమావేశం లో ఆయన మాట్లాడుతూ ఓడియప్ గ్రామాల్లోవ్యక్తిగత మరుగుదోడ్లు జిల్లా కలెక్టర్ గారి ఆదేశం మేరకు వంద శాతం పూర్తిచేసేలా చూడాలన్నారు.నిర్మాణం పనుల్లో ఆలసత్వం వహిస్తే చర్యలు తప్పవని సాక్ష్యత్తు జిల్లా కలెక్టర్ గారు పర్యటిస్తా మని చెప్పారని కావున కొన్ని గ్రామాల్లో ఓడి ఎప్ పనులు అసంపూర్తిగా వున్నాయని ఏప్రిల్ కల్లా పూర్తిచేలన్నారు. ఈ కార్యాక్రమంలో ఎంపిడివో గంగాదర్, మండల వ్యవశాయాదికారి స్రవంతి, ఎపివో జగన్నాత్, ఎపియం విజయ లక్ష్మి, ఉపాది సిబ్బంది కలరు.
బైక్ పైనుండి పడి ఒకరి మృతి
కుంటాల,్ఫబ్రవరి 15: మండలంలోని అంధకూర్ గ్రామ శివారులోని మూలమలుపు వద్ద బైక్ పైనుండి పడి ఒకరు మృతిచెందినట్లు కుంటాల ఎస్సై యూనుస్ గురువారం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతుడు భైంసా మండలంలోని ఒడ్‌గాం గ్రామానికి చెందిన దయానంద్(29) బుధవారం సూర్యాపూర్ గ్రామంలోని రాజరాజేశ్వర ఆలయ దర్శనానికి అని చెప్పి ఇంటి నుండి బయలుదేరాడన్నారు. దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో ఏపీ 1 జె 8528 అనే బైక్‌పై వస్తుండగా అదుపుతప్పి అందకూర్ గ్రామ శివారులో పడి బుధవారం రాత్రి మృతిచెందినట్లు పోలీసులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు.

మృతుడికి కుమారుడు, కూతురు భార్య ఉన్నారు. బాబాయ్ ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నామన్నారు.

జింకను వేటాడిన ఊరకుక్కలు
మంచిర్యాల, ఫిబ్రవరి 15: మంచిర్యాల జిల్లా చెన్నూర్ ప్రాంతంలోని గెర్రె కాలనీలో జింకను గురువారం ఊరకుక్కలు వేటాడాయి. ఆ జింకను వేటాడుతుండటం చూసిన స్థానికులు ఊర కుక్కల నుండి జింకను కాపాడి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఈ ఊర కుక్కల దాడిలో జింకకు గాయాలు కావడంతో అటవీ శాఖ సిబ్బంది ప్రథమ చికిత్స చేయించి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.
బేగంపేట పబ్లిక్ స్కూల్‌కు విద్యార్థి ఎంపిక
ఆసిఫాబాద్, ఫిబ్రవరి 15: హైదరాబాద్ బేగంపేట పబ్లిక్ స్కూల్‌లో ప్రభుత్వం తరపున దళిత విద్యార్థికి ఉచితంగా ప్రవేశం కల్పించడం కోసం లక్కీ పద్దతిని నిర్వహించారు. దళిత అభివృధ్ది శాఖ అధ్వర్యంలో గురువారం జెసి కార్యాలయంలో లక్కీడీప్ ద్వారా విద్యార్థిని ఎంపిక చేశారు. ఈకార్యక్రమంలో జెసి అశోక్ కుమార్, ఎస్సీ వెల్ఫేర్ అధికారిణి సునీత, బిసి వెల్ఫేర్ అధికారి సాయిబాబ, ఎస్సీకార్పొరేషన్ అధికారి హనుమాండ్లు, జిల్లా రెసిడెన్షియల్ స్కూల్ కో ఆర్డినేటర్ గంగన్న, జిల్లా అధికారులు, విద్యార్థుల తల్లి తండృలు పాల్గొన్నారు. జెసి అశోక్ కుమార్ సమక్షంలో తీసిన ఈడ్రాలో బేగంపేట పబ్లిక్ పాఠశాలలో 1వ తరగతి ప్రవేశం పొందేందుకు మిట్టపల్లి సిద్దార్ధ ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థి ఈఅవకాశాన్ని వినియోగించుకునేలా తల్లి తండృలు చూడాలని ఆయన కోరారు.
18న విశ్వబ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక
ఆసిఫాబాద్, ఫిబ్రవరి 15: మంచిర్యాల విశ్వనాథ ఆలయంలో ఈనెల 18న విశ్వబ్రాహ్మణ కులస్థుల వివాహ పరిచయ వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం ప్రచార కార్యదర్శి చిలుకూరి సురేందరాచారి, సభ్యులు కట్ల మహేందర్, శ్రీరాం వెంకటేశ్వర్లు, చిలుకూరి సత్యనారాయణ తెలిపారు. కావున విశ్వబ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన యువతీ, యువకులు తప్పని సరిగా ఈవివాహ పరిచయ వేదిక కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు.
రోగులకు అల్పాహారం పంపిణీ
ఆసిఫాబాద్, ఫిబ్రవరి 15: పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు సంఘసేవ యువజన సంఘం అధ్వర్యంలో అల్పాహారం పంపిణీ చేశారు. దాత రాపర్తి చిట్టిబాబు సహకారంతో సంఘం ప్రధాన కార్యదర్శి రాపర్తి చిట్టిబాబు, సభ్యులు హరిబాబు, సాయికుమార్, శివ, టి.రాకేష్, జీ.వినిత్ తదితరులు పాల్గొని చికిత్స పొందుతున్న రోగులకు అల్పాహారం అందచేశారు.
రక్తదాతల మొదటి వార్షికోత్సవ వేడుకలు
దివ్యనగర్,్ఫబ్రవరి 15: మానవ సేవయే మాదవసేవగా భావించి ఆపద సమయాల్లో ప్రమాదాలు జరిగితే రక్తాన్ని అందించేందుకు ఏర్పాటుచేసిన రక్తదాతల గ్రూప్ మొదటి సంవత్సరం పూర్తిచేసుకుంది. దీంతో జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మెన్ అప్పాల గణేష్ చక్రవర్తి మాట్లాడుతూ యువత సామాజిక బాధ్యత తీసుకుని రక్తదానం చేయాలన్నారు. సామాజిక కార్యకర్తల నిగులపు సంజీవ్ ఈ గ్రూపును ఏర్పాటుచేయడం సంతోషకరమన్నారు. అనంతరం సంజీవ్‌ను పూలమాల, శాలువలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ సురేష్, డాక్టర్లు ప్రమోద్‌చంద్రాకుమార్‌రెడ్డి, దేవెంధర్‌రెడ్డి, విజయ్‌కుమార్‌రెడ్డి, డాక్టర్ కృష్ణంరాజు, వాట్సప్ గ్రూపు రక్తదాత యువకులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబానికి పరామర్శ
కుంటాల, ఫిబ్రవరి 15: మండలంలోని సూర్యాపూర్ గ్రామానికి చెందిన వల్ల నారాయణమ్మ అనారోగ్యంతో బాధపడుతూ మృతిచెందడంతో గురువారం ఆమె కుటుంబాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ రమాదేవి పరామర్శించారు. మృతిచెందడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. తనవంతు ప్రగాఢ సంతాపాన్ని వెలిబుచ్చారు.