శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

వరద బాధితులకు అండగా ఉంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, నవంబర్ 21: భారీవర్షాలు, వరదలకు నష్టపోయిన జిల్లాను కేంద్రం అన్నివిధాలా ఆదుకుంటుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు తెలిపారు. నెల్లూరులోని పోలీసు పరేడ్ మైదానం గెస్టుహౌస్ వద్ద శనివారం ఆయన సిఎం చంద్రబాబునాయుడుతో భేటీ అయిన అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని మూడు వేల కోట్ల రూపాయలు సహాయం అడిగారని, ఈ విషయాన్ని తాను కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు. దానికి కేంద్రం సానుకూలంగా స్పందించినట్లు ఆయన పేర్కొన్నారు. తాను ముఖ్యమంత్రి, కేంద్రస్థాయి అధికారులు, జిల్లా కలెక్టర్‌తో కూడా వరద సహాయక చర్యల గురించి చర్చించినట్లు ఆయన తెలిపారు. జాతీయ విపత్తు పథకం కింద 350 కోట్లు ఉన్నాయని, వాటిని తొలుత ఖర్చు చేస్తే తరువాత రెండో దశ నిధులు ఇవ్వాలని ప్రధానమంత్రి కార్యదర్శికి తాను సూచించానని అన్నారు. ఆ నిధులు కూడా త్వరలో విడుదలవుతాయన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తనను జిల్లాలోని మనుబోలు వద్ద జాతీయ రహదారికి గండిపడిన ప్రాంతాన్ని సందర్శించి రమ్మని చెప్పడంతో తాను వచ్చినట్లు వెంకయ్యనాయుడు తెలిపారు. వరద సహాయక చర్యల కోసం బిజెపి కోటి రూపాయల విరాళం ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ఈ విరాళాన్ని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అందజేస్తారని ఆయన పేర్కొన్నారు. వరద సహాయక చర్యల్లో ప్రతిఒక్కరు పాల్గొనాలని పిలుపునిచ్చారు. పార్టీలకు అతీతంగా అందరూ ఐక్యంగా సేవ చేయాలన్నారు. అనంతరం వెంకయ్యనాయుడు హెలికాప్టర్‌లో గూడూరు వెళ్లారు. అక్కడ నుండి కారులో రోడ్డు మార్గాన మనుబోలు వద్ద జాతీయ రహదారిపై గండ్లుపడిన ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన యుద్ధప్రాతిపదికన గండ్లు పూడ్చాలని, రాకపోకలకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను కోరారు.