శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ముక్కోటి ఏకాదశికి ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేదాయపాళెం, డిసెంబర్ 19: శ్రీ తల్పగిరి రంగనాథస్వామి దేవస్థానంలో 21వ తేదీన జరిగే ముక్కోటి ఏకాదశి పండుగ సందర్భంగా భక్తులకు వైకుంఠ ద్వార దర్శనానికి అన్ని ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నట్లు ఆలయ ఇఓ పి శ్రీనివాసులురెడ్డి తెలిపారు. ముక్కోటి ఏకాదశినాడు వేకువజామున 4.30 గంటల నుండి వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకోవచ్చని తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. విఐపిలకు ఉదయం 9 నుండి 10 గంటల వరకు దర్శనం కల్పించనున్నట్లు వెల్లడించారు. వీరికి టిక్కెట్టు రూ. 116లుగా నిర్ణయించామని తెలిపారు. ప్రత్యేక దర్శనం 20 రూపాయలు, ఉచిత దర్శనం ఉంటుందని తెలిపారు. ఎవరికీ ఎటువంటి పాస్‌లు ఇవ్వడం జరగదని తెలిపారు. దేవస్థానం వద్ద ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు భక్తులందరు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

శ్రీరంగనాథుని ఆలయంలో వైభవంగా అధ్యయనోత్సవాలు
వేదాయపాళెం, డిసెంబర్ 19: శ్రీ తల్పగిరి రంగనాథస్వామి దేవస్థానంలో అధ్యయనోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా శనివారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ రంగనాథస్వామికి, శ్రీకాళీయమర్ధన అలంకారాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆళ్వార్లు గోష్టిగా శ్రీ స్వామివారికి నాలాయర్ దివ్యప్రభంజనం గానం చేశారు. ఈ కార్యక్రమానికి ఉభయకర్తలుగా దొంతంశెట్టి బలరామయ్య, వెంకటనరసింహులు గుప్తా వ్యవహరించారు. దేవస్థానంలో పగల్‌పత్ ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలను ఆలయ ప్రధాన అర్చకులు కిడాంబి జగన్నాధాచార్యుల పర్యవేక్షణలో వేదపండితులు శాస్త్రోకంగా నిర్వహిస్తున్నారు.