శ్రీవిరించీయం

పత్రికలో ఉద్యోగం - ప్రత్యేక అవ్యక్త జీవితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అలవాటు లేని నడక. అల్లంత దూరంలో చెరువు. ఆడదాని చెరువు. దానికాపేరు ఎందుకు వచ్చిందో తెలియదు. పాతికేళ్ల కిందట ఎట్లా తుమ్మలు పెరిగి, నీళ్లు ఎండి, విశాలంగా, కొంగల్తో, కాకుల్తో కళకళలాడేదో ఇప్పుడూ అట్లాగే. ఎంతోకాలం నుంచి తనకోసం ఎదురుచూస్తున్నట్లు ‘ఉత్తతోత’ అంటూ ఒక పిట్ట ఎగిరిపోయింది. కట్టకు దిగువ దూరంగా తుళ్లూరు కనబడుతుంది. ఒకప్పుడు ఈ చెరువులోనే ముత్యాలు, హనుమంతుతో కలిసి స్కూల్ ఎగ్గొట్టి దిసెమొలతో ఈడేశాడు’-
మనసులో గూడుకట్టుకుపోయిన రుూ వాతావరణం మళ్లీ ముందు ప్రత్యక్షం అవడంతో ‘రామకృష్ణ’ అనే పత్రిక ఉద్యోగి రుూ చెరువులో మళ్లీ రుూత వేశాడు. అతన్ని ప్రకృతీ, చెరువూ ఏకంగా పిలుస్తున్నాయి. ఈ బతుకు, చదువు, సంస్కారం- యివన్నీ ‘అబద్ధం’. ఉద్యోగం కూడా మిథ్యే. ప్రకృతి ఒక్కటే ‘నిజం’, ‘యదార్థం’ అనిపిస్తుంది ఆ క్షణంలో.
రామకృష్ణ చక్కగా చదువుకుని పత్రికలో తగుమాత్రం ఉద్యోగం చేసుకుంటున్న మనిషి. అయితే ఆ ఉద్యోగం అతని మనసుకు ఊరట కలిగించదు. మనసును వికసింపజేసే వాతావరణాన్ని సృష్టించదు. ఎంతసేపూ న్యూనత, అసహనం, అసమాధానం. మరోపక్క సాంసారిక జీవితం అయినా సజావుగా వున్నదా అంటే అదీ అంతంతమాత్రమే. శ్రీమంతుల పిల్ల భార్యగా వచ్చింది. ఇక్కడి తక్కువతనంతో సమాధానపడలేకపోతోందని అతనికి అనుమానం. ఏమీ చేయలేని చెప్పలేని మానస వికారం. సవతి తల్లి, తమ్ముడు- అతని కుటుంబం పల్లెటూరులో వుంటారు. సంబంధాలు తెగిపోయినా, మళ్లీ కలుసుకోగల అవకాశం సిద్ధిస్తుంది. భార్యకు యిష్టం లేకపోయినా, కూతురు చెప్పిందని ఆ పల్లెటూరుకు వెడతాడు. సవతి తల్లి, తమ్ముడు పడుతున్న కష్టం చూస్తాడు. అతనికి వైద్యం సహాయం కలిగించటానికి తను వుంటున్న హైదరాబాద్‌కు రమ్మని సాదర ఆహ్వానం ఇస్తాడు. స్నేహితుడితో పాటు పెళ్లికి వెళ్లవలసిన మనిషి- రోడ్డుమీద నడుచుకుంటూ వెళ్లి కారులో షికారు తప్పించుకుని- చెరువుకు ఆకర్షితుడవుతాడు.
అతని వ్యక్తిత్వం వేరయినది. ఊహలతో ఉరుకులు తీసేది. హృదయంలో ఎవరో తలుపు సగమే తెరిచి వుంచారు అని అతని భావం. తతిమ్మా సగం కూడా తెరిచి అవతల వున్న చీకటినో వెలుతురునో చూడాలని అతని ఆకాంక్ష.
కథలకు తగిన వాతావరణాన్ని సమకూర్చడం సమర్థంగా చేయగల పాపినేని శివశంకర్ కథానిక ‘సగం తెరిచిన తలుపు’లో చదువరికి ఎదురయ్యే వ్యక్తులు, సందర్భాలు యిటువంటివి.
పల్లెటూరు స్నేహితుల మొరటు మాటలు నచ్చినంతగా అతనికి బస్తీ మనుషుల ఇచ్చకాల కబుర్లు రుచించవు. ఉద్యోగం చేయడం ఇష్టం లేకపోయినా, మరోమార్గం లేదు. తోటి ఉద్యోగస్థుల అసహనాన్ని, అసహకారాన్ని సరిదిద్దుకుంటూ పోవలసిందే. అప్పుడప్పుడూ అవ్యక్తంగా కుటుంబ పరిస్థితులు, బాల్య క్రీడలలో పొందిన సరదాలు మనసుకు తలపు వచ్చి ‘కల’ను పూర్తిచేస్తూ వుంటాయి. బస్తీ జీవితాన్ని, పల్లెటూరు జీవన ప్రమాణాలను ఎదురెదురుగా చూచుకుని ఒక వైపు దీనాతి దీనమయిన పరిస్థితి అయితే మరోపక్క అవసరమైన ఆర్థిక సహాయం ఆనందంగానే కనిపిస్తూంది. పల్లె వాతావరణం అతన్ని మళ్లీ మరిపించి కళ్లకు ఆనందంతో నీళ్లు తెప్పిస్తాయి. ఇక్కడ మానవ స్పర్శ లభిస్తుంది. ‘ఇక్కడ మనుషులున్నారు. రాగద్వేషాలున్నా ప్రేమించగల మనుషులున్నారు. ఇక్కడ తనకు జీవనభీతి లేదు’ అనుకుంటాడు. బస్తీ జీవనంలో ‘కనబడని భయం’ అనుక్షణం ఎదురవుతూ వుండడం భీతి కలిగిస్తుంది.
చెరువులో చల్లనీళ్ళలో ఈతకొట్టడం ప్రారంభించగానే అతనికి ప్రకృతి స్పర్శ అవయవాలు అన్నింటినీ తడిమినట్లు అయిపోతుంది. అతని మనస్సు నిర్వికారంగా, ప్రశాంతంగా, కలత లేకుండా, కళంకం లేకుండా, ఆహ్లాదంగా, ఆనందంగా వుంది. నగ్నంగా సహజంగా వుంది. రెండు చేతులూ, రెండు కాళ్లూ స్వేచ్ఛగా కదిలిస్తూ తన నుంచి తనే విముక్తమవుతూ ఎంతోసేపు అట్లాగే చెరువులో అటు యిటు అలల్లో అలగా కదుల్తూ.. అలా.. అలా..’ కథను ప్రస్తుతానికి సమాప్తం చేసుకుంటాడు రామకృష్ణ.
మనిషికి కావలసినది ‘స్వేచ్ఛ అయిన మనసు, అందుకూ అననుకూలం కాని వాతావరణమూ..’ అని స్పష్టంగా చెప్పే కథానిక యిది. జీవితంలో తారసపడే ఒడిదుడుకులను ఎలా సరిచేసుకోవచ్చునో సూచించే కథ కూడా. మనసుకు సంబంధించిన కధలను కావాలనుకునేవారికి ఆహ్లాదం, నిరతిశయం ఆనందం కలిగించే కథ.

-శ్రీవిరించి