రాష్ట్రీయం

నిండుకుండలా శ్రీశైలం, సాగర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఎగువన కురుస్తున్న వర్షాలతో నాగార్జున సాగర్, శ్రీశైలం జలశయాలు నిండుకుండల్లా ఉన్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు పది గేట్లును ఎత్తివేసి నీటిని దిగువకు వదిలివేస్తున్నారు. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 2.12 లక్షల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 3.48 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 884.8 అడుగులు. జలాశయం పూర్తి నీటి నిల్వ 215.80 టీఎంసీలు, ప్రస్తుత నీటి నిల్వ 213.8 టీఎంసీలు. నాగార్జున సాగర్‌కు దిగువన మూసీ వరద కలుస్తుండటంతో కృష్ణాలో ప్రవాహ ఉధృతి మరింత అధికమైంది. పులిచింతల ప్రాజెక్టులోకి 2.52 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 2.80 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు.