శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

జాతీయ స్వచ్ఛ విద్యాలయ పురస్కారం అందుకున్న కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు కలెక్టరేట్, సెప్టెంబర్ 18: జాతీయ స్థాయిలో స్వచ్ఛవిద్యాలయ పురస్కారాలలో నెల్లూరు జిల్లా మూడవ స్థానాన్ని దక్కించుకుంది. ఈ మేరకు మంగళవారం న్యూఢిల్లీలోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో జరిగిన జాతీయ స్వచ్ఛ విద్యాలయ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి ప్రకాష్ జవాదేకర్ చేతుల మీదుగా కలెక్టర్ ఆర్ ముత్యాలరాజు, సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు అధికారి విశ్వనాథ్ పురస్కారం అందుకున్నారు. నాయుడుపేట మండల పరిధిలోని విన్నమాల ప్రాథమికోన్నత పాఠశాల, ఆత్మకూరు మండల పరిధిలోని చెర్లోయడవల్లి పాఠశాలలకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ఈ అవార్డు కింద రూ.50వేల నగదు, ప్రశంసా పత్రాలు అందుకున్నారు. జాతీయ స్థాయిలో జిల్లాకు మూడవస్థానం లభించినందుకు కలెక్టర్‌కు, ఎస్‌ఎస్‌ఏ పీఓకు పలువురు జిల్లా అధికారులు అభినందనలు తెలిపారు.

22నుంచి పెంచలకోనలో పవిత్రోత్సవాలు
రాపూరు, సెప్టెంబర్ 18: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోన దేవస్థానంలో పవిత్రోత్సవాలు ఈ నెల 22నుంచి 25వ తేదీవరకు నాలుగురోజులపాటు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నట్లు ఆలయ సహాయ కమిషనర్ శెనగవరపు శ్రీరామమూర్తి తెలిపారు. లోకకల్యాణం, దేశసౌభాగ్యం, సకలజనులు సుఖశాంతులతో ఉండాలనే లక్ష్యంతో నిర్వహించే ఈ పవిత్రోత్సవాలు ఒక యజ్ఞంలాంటిదని చెప్పారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి శ్రీవారి కరుణకటాక్షాలు పొందాలని కోరారు. 22న శ్రీవారి పవిత్రాల ప్రతిష్ఠ, అభివాసహోమం, శాత్‌మలై కార్యక్రమాలు జరుగుతాయని, ఉభయకర్తలుగా పెంచలకోన ట్రస్టుబోర్డు మాజీ చైర్మన్ అమర శ్రీరాములు శ్రేష్ఠి, వసుందరమ్మ దంపతులు వ్యవహరిస్తారన్నారు. 23న మహాకుంభ మండల అగ్నిప్రతిష్ట హోమం, దివ్యప్రభంద పారాయణ కార్యక్రమాలు జరుగుతాయని, ఈ కార్యక్రమాలకు ఉభయకర్తలుగా నెల్లూరుకు చెందిన జొన్నలగడ్డ పెంచల చిట్టిబాబు, చినబాబు వ్యవహరిస్తారని అన్నారు. అదేరోజు సాయంత్రం శ్రీవారికి తిరుచ్చివాహన కార్యక్రమాలు వైభవంగా జరుగుతాయన్నారు. 24న దివ్యప్రభంద పారాయణం, హోమం జరుగుతాయని, అందులో భాగంగా సాయంత్రం శ్రీవారికి తిరుచ్చి ఉత్సవం వైభవంగా నిర్వహిస్తామన్నారు. ఈ ఉత్సవ కార్యక్రమానికి ఉభయకర్తలుగా నెల్లూరు చెందిన లోకనాథం, ఝాన్సీ దంపతులు వ్యవరహరిస్తారన్నారు. 25న సాయంత్రం శ్రీవారికి శేషవాహన సేవ, శాంతిహోమం కార్యక్రమాలు వైభవంగా జరుగుతాయని, ఈ కార్యక్రమాలుకు ఉభయకర్తలుగా కడప జిల్లా కమలాపురం మండలం మాచిరెడ్డిపల్లికి చెందిన పుట్టా నరసింహారెడ్డి, సరోజనమ్మ దంపతులు వ్యవహరిస్తారన్నారు.

మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిసిన చేవూరు
సంగం, సెప్టెంబర్ 18: ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డిని ఆత్మకూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ చేవూరు శ్రీ్ధర్‌రెడ్డి మంగళవారం కర్నూలులో మర్యాదపూర్వకంగా కలిశారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ బహిరంగ సభకు వెళ్లిన ఆయన సభాప్రాంగణంలో కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిశారు. కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత తొలిసారిగా కలిసిన చేవూరు శ్రీ్ధర్‌రెడ్డి ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. జిల్లాలో 2019 ఎన్నికల పరిణామాలపై ఆయనతో చర్చించారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అందరూ గట్టిగా కృషి చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా చేవూరు శ్రీ్ధర్‌రెడ్డి మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో రాహుల్‌గాంధీ ప్రధాని కావడం తథ్యమన్నారు. దేశం మొత్తం రైతులకు రుణమాఫీ చేస్తానన్న ఘనత రాహుల్‌గాంధీకే దక్కుతుందని పేర్కొన్నారు. దేశ ప్రజలు రాహుల్‌గాంధీ గెలుపునకు ఎదురు చూస్తున్నారని తెలిపారు. దేశంలో పేద ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాలంటే రాహుల్‌గాంధీ ప్రధాని కావాలని అన్నారు.