క్రైమ్/లీగల్

మైనర్ బాలిక కిడ్నాప్, అత్యాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గూడూరు, సెప్టెంబర్18: మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి వెంట తీసుకువెళ్లి అత్యాచారం చేసి, ఆ తర్వాత బాలికను ఇంటివద్ద వదిలి వెళ్లిన యువకుడిపై, అతనికి సహకరించిన నలుగురిపై కోట పోలీసులు మంగళవారం కేసు నమోదు చేసారు. కోట ఎస్సై నారాయణరెడ్డి తెలిపిన సమాచారం మేరకు. కోట మండలం తినె్నలపూడి గ్రామానికి చెందిన మైనర్ బాలికను అదే గ్రామానికి చెందిన బైనా హేమంత్ అనే యువకుడు గత సంవత్సరం నుంచి ప్రేమిస్తున్నట్లు, పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించాడు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ తొమ్మిదిన ఆ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం జరిపి, పెళ్లి చేసుకోకుండా మోసంచేసి బాలికను ఇంటి వద్ద వదిలేసాడు. ఈ విషయంలో తగిన న్యాయం చేస్తామని బాధితురాలి కుటుంబానికి గ్రామస్తులు హామీ ఇచ్చారు. అత్యాచారం జరిపిన యువకుడి కుటుంబంతో రాయబారాలు జరిపినా బాధితురాలికి న్యాయం జరగకపోవడంతో బాలిక బంధువులు పోలీసులను ఆశ్రయించారు. నిందితుడు హేమంత్, అతనికి సహకరించిన నలుగురు యువకులపై కిడ్నాప్, అత్యాచారం కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

లారీ డ్రైవర్‌పై దాడి:నగదు అపహరణ
సూళ్లూరుపేట, సెప్టెంబర్ 18: జాతీయ రహదారిపై దారి దోపిడీలు ఆగడం లేదు. ఇటీవల కాలంలో పార్శిల్ లారీలు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే లారీల్లో దారి దోపీడీ నిత్యకృత్యమైంది. దీనిపై పోలీసులు దృష్టిసారించడం లేదు. 24 గంటలు భారీ బందోబస్తు ఉండే సూళ్లూరుపేట టోల్‌ప్లాజా వద్ద మంగళవారం తెల్లవారుజామున దారి దోపిడీ జరిగింది. ఈ సంఘటన ఈ ప్రాంతంలో కలకలం రేపింది. సూళ్లూరుపేట టోల్‌ప్లాజా వద్ద తెల్లవారుజామున చెన్నై నుంచి అస్సోం వెళ్లే అగ్గిపెట్టెల లోడు లారీని డ్రైవర్ ఆర్.సురేష్, క్లీనర్ సి.ఉదయకుమార్ నిలిపి నిద్రిస్తున్నారు. ఈక్రమంలో గుర్తుతెలియని ముగ్గరు యువకులు పల్సర్ మోటారుసైకిల్‌పై వచ్చి డ్రైవర్, క్లీనర్‌ను బెదిరించి కత్తితో దాడిచేసి వారి వద్దనున్న 8 వేల రూపాయలను అపహరించుకుపోయారు. దుండగలు పక్కా పథకం ప్రకారం కత్తులతో వచ్చి దాడిచేసి దోపీడికి పాల్పడ్డారు. డ్రైవర్, క్లీనర్ తేరుకొని కేకలు వేయడంతో పక్కనే టోల్‌ప్లాజా వద్దనున్న హైవే మొబైల్ పోలీసులు పల్సర్ బైక్‌పై పారిపోతున్న వారిని తడ మండలం అక్కంపేట వరకు వెంబడించారు. అక్కడ నుంచి దుండగలు జాతీయ రహదారి నుంచి పక్కనే సర్వీసు రోడ్డుపైకెళ్లి అండగుండాల రోడ్డువైపు వెళ్లారు. దీంతో హైవే మొబైల్ పోలీసులు ఏమీచేయలేక వెనుదిరిగారు. విషయాన్ని తెలుసుకున్న గూడూరు డీఎస్పీ రాంబాబు, ఇన్‌చార్జ్ వాకాడు సీఐ సత్యనారాయణ, సూళ్లూరుపేట, నాయుడుపేట ఎస్సైలు ఇంద్రసేనారెడ్డి, వేణు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. లారీ డ్రైవర్, క్లీనర్‌కు దుండగల దాడిలో తీవ్రగాయాలయ్యాయి. బాధితులను పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసులు సేకరించారు. దారి దోపిడీ కావడంతో నెల్లూరు నుంచి వేలిముద్ర నిపుణులను రప్పించి వేలిముద్రలు సైతం సేకరించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసుల అదుపులో హెచ్‌డీఎఫ్‌సీ నిందితులు ?
తడ, సెప్టెంబర్ 18: మండల కేంద్రం తడలోని శ్రీకాళహస్తి రోడ్డు సమీపంలో ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో కోటిరూపాయల మేరకు దోపిడీ చేసిన సంఘటనలో డిప్యూటీ మెనేజర్, మరో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సోమవారం బ్యాంకు మెనేజర్ వరుణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు గూడూరు డీఎస్పీ రాంబాబు ఆధ్వర్యంలో సాంకేతిక పరిజ్ఞానంతో విచారణ వేగవంతం చేశారు. నిందితులు వాడిన వాహనాన్ని పోలీసులు గుర్తించి గుంటూరు, గన్నవరం ప్రాంతాల్లో నిందితులను అదుపులోకి తీసుకుని నెల్లూరుకు తరలించినట్లు సమాచారం. నిందితుల్లో ఒకరైన హెచ్‌డీఎఫ్‌సీ మెనేజర్ తన సోదరికి కొంత నగదు అందచేసి వెళ్లడంతో ఆమె స్పందించి పోలీసులకు నిందితులు వాడిన వాహన సమాచారాన్ని ఇచ్చిన ఫలితంగా పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకోవటంతోపాటు నగదు కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. పోలీసులు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సమీపంలో పోలీసులు ఏర్పాటుచేసిన సీసీ కెమెరాల ద్వారా చాలావరకు సమాచారాన్ని అందుకున్నారు. సంచలం సృష్టించిన తడ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు దోపిడిని త్వరలోనే చేధించేందుకు పోలీసులకు మార్గం సుగమం అయినట్లు తెలుస్తోంది.