శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

నాన్‌మేజర్ పోర్టుకు ఆమోదం దురదృష్టకరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కావలి, సెప్టెంబర్ 18: ప్రకాశం జిల్లా రామాయపట్నంలో నాన్‌మేజర్ పోర్టుకు ఆమోదం తెలిపి ప్రణాళికలు సిద్ధం చేయడం పట్ల పోర్టు సాధన సమితి చైర్మన్ వంటేరు వేణుగోపాల్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. పట్టణంలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 16 రోజుల క్రితం రామాయపట్నం పోర్టుకు ఆమోదం తెలపడంతో అందరం సంబరాలు జరుపుకుని కావలి కనకపట్నం అవుతుందని కలలు కన్నామని వేణుగోపాల్‌రెడ్డి అన్నారు. అయితే ఆ సంతోషం నుంచి తేరుకునే లోపే జీవో నెంబర్ 28 రూపంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాన్‌మేజర్ పోర్టు అని బాంబు పేల్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారన్నారు. ఈ పోర్టు వలన పక్కనే ఉన్న తెట్టు గ్రామం కూడా అభివృద్ధి చెందదన్నారు. ఐదేళ్ల నుంచి రామాయపట్నం పోర్టు కోసం అనేక ఉద్యమాలు చేశామని, అందులో భాగంగా కావలి నుంచి రామాయపట్నం వరకు పాదయాత్ర నిర్వహించగా ప్రతి ఒక్కరు బ్రహ్మరథం పట్టారన్నారు. అయితే కొంతమంది నాయకులు వంటేరు రాజకీయంగా వెనుకబడ్డాడు కాబట్టే ఉద్యమాలు చేస్తున్నారని హేళన చేస్తూ మట్లాడారని, వాటిని పట్టించుకోకుండా మెట్ట ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగామన్నారు. 2011లో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ ఆంధ్రప్రదేశ్‌కు మెగా పోర్టు మంజూరు చేశారని తెలిపారు. రాష్ట్రంలోని నక్కపల్లి, రామాయపట్నం, దుగ్గరాజపట్నంలలో పర్యటించిన కేంద్రకమిటీ రామాయపట్నం పోర్టుకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుందని తేల్చిందన్నారు. ఒక ఎంపీ రాజకీయ స్వార్ధం కోసం దుగ్గరాజపట్నంలో పోర్టు ఏర్పాటు కోసం 60 మంది ఎంపీలతో సంతకాలు చేయించి అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ వద్దకు తీసుకెళ్లారన్నారు. అక్కడి రాకెట్ ప్రయోగశాల, నేలపట్టు పక్షుల కేంద్రం వారు అభ్యంతరం వ్యక్తం చేయగా, అప్పటి రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వారిని బెదిరించి కొన్ని నిబంధనలతో దుగ్గరాజపట్నంలో పోర్టుకు అనుమతి తీసుకున్నారన్నారు. కమిటీ సభ్యులు దుగ్గరాజపట్నం పోర్టుకు సరైనది కాదని వెంటనే ఆ స్థానంలో మరొకటి కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారని తెలిపారు. ఇంత కాలానికి స్పందించిన బాబు ఒంగోలు బహిరంగ సభలో రామాయపట్నంలో పోర్టు నిర్మిస్తామని చెప్పి వెంటనే కేంద్రానికి లేఖ పంపుతామన్నాని గుర్తుచేశారు. మేజర్ పోర్టు నిర్మాణానికి ఆమోదం తెలుపుతూ కేంద్రానికి లేఖ రాయడానికి మీకు ఉన్న అభ్యంతరం ఏమిటని బాబును వంటేరు ప్రశ్నించారు. రామాయపట్నంలో మెగా పోర్టు నిర్మిస్తేనే యువకులకు ఉద్యోగాలు వచ్చి అభివృద్ధి చెందుతారన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు సురే మదన్‌మోహన్‌రెడ్డి, పీడీఎస్‌యు భాస్కర్, పలువురు ప్రజాసంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

3, 4 తేదీలలో వెంకటగిరి పోలేరమ్మ జాతర
* నేడు జాతరకు తొలి చాటింపు
వెంకటగిరి, సెప్టెంబర్ 18: వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ జాతర అక్టోబర్ 3, 4వ తేదీల్లో జరగనున్న నేపథ్యంలో మంగళవారం అర్ధరాత్రి ఆచారం ప్రకారం తొలి చాటింపు వేయనున్నారు. అమ్మవారి జాతరను వినాయకచవితి వెళ్లిన తొలి బుధవారం అర్ధరాత్రి మొదటి చాటింపు, రెండవ బుధవారం రెండవ చాటింపు వేస్తారు. మూడవ బుధవారం అమ్మవారి జాతర ప్రారంభమై గురువారం నిమజ్జనంతో ముగుస్తుంది. మంగళవారం సాంప్రదాయబద్ధంగా కాంపాళెంలో నుంచి గాలిగంగలకు పూజలు చేసి అక్కడ నుంచి అమ్మవారి జాతర చేసే కుమ్మరి, చాకలి తదితరులు రాజాల నివాసానికి చేరుకుని అక్కడ జాతర నిర్వహించేందుకు రాజుల సాంగ్య ( తాంబుళం) ఇవ్వడంతో జాతర పనులు మొదలవుతాయి. అప్పటి నుంచి అమ్మవారి జాతర పనులలో వారు నిమగ్నమవుతారు. అర్ధరాత్రి కాంపాళెంలో గాలిగంగలకు పూజలు నిర్వహించి అక్కడ నుంచి తప్పెట్లతో, బాణాసంచాపేలుళ్ల మద్య తొలిచాటింపును వేస్తారు. అప్పటి నుంచి వెంకటగిరి జాతర ముగిసే వరకు ఆచారం ప్రకారం ఈ ప్రాంతంలో శుభకార్యాలు జరగవు.
చెట్ల కొమ్మలు తొలగింపు
గ్రామశక్తి పోలేరమ్మ జాతర జరిగే ప్రధానవీధి రాజవీధిలో పెరిగిపోయిన చెట్లకొమ్మలను మున్సిపాలిటీ అధికారులు దగ్గరుండి తొలగించారు. జాతర సమయంలో అమ్మవారి రథానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండేందుకు ముందుస్తు చర్యగా కొమ్మల తొలగింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కమిషనర్ గంగాప్రసాద్ తెలిపారు.

పోలీస్ స్టేషన్ ముట్టడి
వాకాడు, సెప్టెంబర్18: మండల కేంద్రంలోని పోలీస్టేషన్‌ను మండల పరిధిలోని రాజలక్ష్మీపురం గ్రామానికి చెందిన కొందరు దళితులు ముట్టడించి ఆందోళన చేపట్టారు. మల్లాం గ్రామానికి చెందిన కొందరు అగ్రకులస్తులు రాజలక్ష్మీపురం గ్రామానికి చెందిన నాగమ్మ అనే మహిళపై దాడిచేసి కులంపేరుతో దూషించటంతోపాటు ఆ మహిళతోపాటు మరికొందరిపై చిట్టమూరు, వాకాడు పోలీస్‌స్టేషన్‌లలో ఫిర్యాదు చేసారని తెలుసుకున్న ఆ గ్రామస్తులు, దళిత సంఘాల నాయకులు తమకు న్యాయం చేయాలంటూ పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించి ఆందోళన చేపట్టారు. దీనిపై సీఐ ఉప్పల సత్యనారాయణ స్పందిస్తూ ఆందోళన విరమించాలని, కులంపేరుతో దూషించిన వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేస్తామని తెలిపారు. సంఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి నిందితులను కఠినంగా శిక్షిస్తామన్నారు. దళిత మహిళపై అకారణంగా దాడిచేసి కులంపేరుతో దూషించిన అగ్రకులస్తులపై కఠినచర్యలు తీసుకోవాలని ఎస్సీ సెల్ నాయకుడు పంట్రంగం వసంత్‌కుమార్ డిమాండ్ చేశారు.