శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

రొట్టెల పండగకు భారీ బందోబస్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, సెప్టెంబర్ 19: నెల్లూరులో ఈనెల 21 నుండి 25వ తేదీ వరకు జరగబోయే రొట్టెల పండుగలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూసేందుకు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు గుంటూరు రేంజ్ ఐజి వి.వేణుగోపాల్‌రావు తెలిపారు. బుధవారం ఆయన దర్గా పరిసరాలను, పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 2వేల మంది పోలీసులు బందోబస్తు విధుల్లో పాల్గొంటున్నట్లు చెప్పారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతాపరంగా తగు జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. దర్గాకు వచ్చే భక్తులు పోలీసులకు సహకరించి అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మన రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి, విదేశాల నుండి అనేక మంది భక్తులు పండగకు వచ్చే అవకాశం ఉన్నందున ఎంతమంది సిబ్బంది ఉన్నప్పటికీ చిన్న చిన్న దొంగతనాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని భక్తులు కూడా వస్తువులను అవసరమైన మేరకు వెంట తెచ్చుకోవాలని, తీసుకొచ్చిన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా వచ్చే భక్తులకు తగు సూచనలు ఇస్తూ వారిని మానిటరింగ్ చేస్తూ ఉండాలన్నారు. జేబు దొంగతనాలు జరగకుండా క్రైం బ్రాంచ్ సిబ్బంది మఫ్టీలో 24 గంటలు తిరుగుతూ ఉండాలని ఆదేశించారు. ప్రజలకు సేవ చేసే ప్రక్రియలో భాగంగా పోలీస్ సేవాదళ్ బృందం ఏర్పాటు చేశామని, అందులో ఒక ఇన్స్‌పెక్టర్ సహా 30 మంది సిబ్బంది 24 గంటలు పనిచేస్తూ ఉంటారన్నారు. నిత్యం తీసుకుంటున్న చర్యలను ఎప్పటికప్పుడు కంట్రోల్ రూంకు చేరవేస్తూ ఉండాలన్నారు. అధికారుల మధ్య సమన్వయం కలిగి ఉండి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని పోలీస్ సిబ్బందికి సూచించారు. అనంతరం దర్గాను సందర్శించిన ఆయన ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఎఎస్పీ పరమేశ్వరరెడ్డి, ఎఎస్పీ (ఎఆర్) వీరభద్రుడు, క్రైం ఓయస్డీ ఆంజనేయులు, ఎస్బీ డిఎస్పీ కోటారెడ్డి, నగర డిఎస్పీ మురళీకృష్ణ తదితరులు ఉన్నారు.

వైసీపీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి
దొరవారిసత్రం, సెప్టెంబర్ 19: వచ్చే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వైసీపీ కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేయాలని సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు. బుధవారం మైలాంగం గ్రామంలో ఏర్పాటుచేసిన బూత్‌కమిటీల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం అధికార పార్టీ ప్రజల కోసం కాకుండా నాయకుల స్వలాభం కోసం నీరు-చెట్టు తదితర పథకాలతో ప్రజాధనాన్ని దోపిడీ చేస్తోందన్నారు. పేదవారికి పక్కాగృహాలను కేటాయించకుండా పచ్చ చొక్కాలకే మంజూరు చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి కార్యకర్త, బూత్‌స్థాయి కన్వీనర్లు, సభ్యులు గ్రామాలలోని సమస్యల పరిష్కారానికి సైనికుల్లా పనిచేయాలని కోరారు. ఓటర్ల నమోదు బాధ్యత కూడా కార్యకర్తల మీదే ఆధారపడి ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడం తథ్యమని, జగన్ ముఖ్యమంత్రి అవటం ఖాయమన్నారు. కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర నాయకులు దువ్వూరు బాలచంద్రారెడ్డి, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

‘హామీలతో మభ్యపెడుతున్న కాంగ్రెస్’
నెల్లూరుటౌన్, సెప్టెంబర్ 19 : గతంలో కేంద్రంలో తిరుగులేని పార్టీగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఏమీచేయలేదని, అలాంటిది రాహుల్‌గాంధీ తాము అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ చేస్తాననడంలో ఎంతమాత్రం నిజం లేదని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొమారి కోటేశ్వరరావు అన్నారు. బుధవారం నెల్లూరులో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కర్నూలు బహిరంగ సభలో రాహుల్‌గాంధీ తాను అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ చేస్తానని ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రస్తుతం అధికారం చేజిక్కించుకున్న పంజాబ్, కర్నాటకలో ఎంతమాత్రం రుణమాఫీ చేశారో చెప్పాలని ఆయన నిలదీశారు. ప్రజలు రాహుల్‌గాంధీ మాట్లాడుతున్న తీరును గమనిస్తున్నారని, త్వరలోనే ఆయనకు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. రాష్ట్ర విభజన చేసిందే కాంగ్రెస్ పార్టీ అని, ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ప్రత్యేకహోదా అంశాన్ని పొందుపరచకుండా తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామనడం ఎంతవరకు నిజమో ప్రజలకు భవిష్యత్‌లో అర్ధమవుతుందన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని చంద్రబాబు మోసపూరిత మాటలతో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో గ్రూప్-1, 2 ఉద్యోగాల్లో భర్తీ చేస్తామని చెప్పారని గుర్తుచేశారు. రాష్ట్రంలో వేలాదిగా వున్న ఖాళీలను ఎపిపిఎస్‌సి ద్వారా భర్త చేస్తామని చెప్పి వందల సంఖ్యలో మాత్రమే భర్తీ చేశారన్నారు. అనంతరం నోటిఫికేషన్ విడుదల చేసి చంద్రబాబునాయుడు ఆయన వ్యక్తుల ద్వారా స్టేలు తీసుకునేలా చేసి అంతటితో ఆ ఉద్యోగాలను భర్తీ చేయకుండా అడ్డుకున్న మోసకారి చంద్రబాబు అన్నారు. ఇప్పటికే స్టే తీసుకుని మూడున్నరేళ్లు పూర్తయ్యిందని గుర్తుచేశారు. ప్రస్తుతం రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఉద్యోగాలను నిరుద్యోగులకు కల్పిస్తామని చెబుతూ గతంలో ఎలాగైతే చేశారో ప్రస్తుతం కూడా అలాగే చేస్తారన్నారు. రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో ఒక శే్వతపత్రాన్ని విడుదల చేసి అందరికి తెలియజేయాలని, అప్పుడే ఆయన మాటల్లో నిజాయితీ తెలుస్తుందన్నారు. నిన్నటిదాకా తమ పార్టీతో పొత్తు పెట్టుకుని నేడు రానున్న ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకునేందుకు తమ పార్టీపై చంద్రబాబు బురద చల్లుతున్నారన్నారు. అందులో భాగంగానే తెలంగాణలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారని, ఇక్కడ కూడా 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునేందుకు సంసిద్ధుడయ్యారని మండిపడ్డారు. ఇవన్నీ తెలుగు ప్రజలు గమనిస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీకి డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమన్నారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు మిడతల రమేష్, వరదయ్య తదితరులు పాల్గొన్నారు.