శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

21న షిర్డీ సాయినాథుని పాదుకలు నెల్లూరుకు రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, సెప్టెంబర్ 19: శ్రీ షిర్డీ సాయినాథుని దివ్య పాదుకలను భక్తుల సందర్శనార్ధం ఈనెల 22,23 తేదీలలో కనుపర్తిపాడులోని విపిఆర్ కనె్వన్షన్ సెంటర్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు విపిఆర్ ఫౌండేషన్ గౌరవ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. బుధవారం స్థానిక మాగుంట లే అవుట్‌లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీసాయినాథ్ మహరాజ్ ఉపయోగించిన ఇతర వస్తువులతో పాటు షిర్డీ సంస్థాన్ వారి పర్యవేక్షణలో భద్రపరచిన బాబా నిజచరణ దివ్య పాదుకలు భక్తుల సందర్శనార్ధం ఈనెల 21న నెల్లూరు నగరానికి తీసుకువస్తున్నట్లు చెప్పారు. 21వ తేది సాయంత్రం స్థానిక అన్నమయ్య సర్కిల్ వద్ద ఈ పాదుకలకు స్వాగత ఏర్పాట్లు చేస్తున్నామని, భక్తిపూర్వకంగా ఆహ్వానించి, శోభాయమానంగా, అంగరంగ వైభవంగా పుష్పరథంలో అక్కడ్నుంచి చిల్డ్రన్స్ పార్కు వద్ద గల సాయిబాబా మందిరం వరకు ఊరేగింపుగా తీసుకెళ్తున్నట్లు చెప్పారు. అనంతరం 22, 23 తేదీల్లో విపిఆర్ కనె్వన్షన్ సెంటర్‌లో భక్తులకు సాయినాథుని చరణ పాదుక దర్శక మహోత్సవం ప్రారంభమవుతుందన్నారు. పాదుకా దర్శనం సందర్భంగా బాబా భజనలు, ఓం సాయి శ్రీసాయి జయ జయ సాయినామ సంకీర్తనలు జరుగుతాయని, అపూర్వమైన ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకొని బాబా కృపాకటాక్షాలకు పాత్రులు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 22వ తేదీ ఉదయం 8 గంటలకు పాదుకల దర్శనం ప్రారంభమవుతుందన్నారు. అలాగే 23వ తేది రాత్రి 9 గంటలకు పాదుక దర్శన మహోత్సవాన్ని పూర్తిచేస్తామన్నారు. నగరంలోని ఆర్టీసీ, ఆత్మకూరు బస్టాండ్‌లతోపాటు వేదాయపాలెం నుండి విపిఆర్ కనె్వన్షన్ సెంటర్ వరకు ఉచిత బస్సు రవాణా సౌకర్యం కల్పిస్తున్నట్లు వేమిరెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల నుండి వినతులు వెల్లువెత్తినప్పటికీ, షిర్డీ సంస్థాన్ వారు రాష్ట్రంలో కేవలం నెల్లూరు నగరాన్ని ఎంపిక చేయడం, నెల్లూరు వాసులపై బాబా కురిపించిన అనుగ్రహంగా భావిస్తున్నామని, సంస్థాన్‌కు భక్తులందరి తరపున కృతజ్ఞతలు వేమిరెడ్డి తెలియచేశారు. అనంతరం చిల్డ్రన్స్‌పార్కు సాయిసదన్ మందిరం వ్యవస్థాపకులు కొండ్రెడ్డి శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, విపిఆర్ ఫౌండేషన్ కో చైర్‌పర్సన్ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతుల ఆధ్వర్యంలో ‘సాయిపాదుకాగమం’ కార్యక్రమం విజయవంతంగా నెల్లూరులో నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా షిర్డీ సాయి చరణ పాదుక దర్శన మహోత్సవ ఆహ్వానపత్రికను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో విపిఆర్ ఫౌండేషన్ సిఇఓ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నగరంలో ఆంధ్రా ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభం
నెల్లూరు, సెప్టెంబర్ 19: రాష్ట్ర పర్యాటక శాఖ, మినర్వా గ్రాండ్ హోటల్ గ్రూపుల సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక దర్గామిట్టలోని మినర్వా గ్రాండ్ హోటల్‌లో బుధవారం ‘ఆంధ్రా రుచులు’ పేరుతో ఏర్పాటైన ఫుడ్ ఫెస్టివల్‌ను టూరిజం శాఖ రీజనల్ డైరెక్టర్ జయప్రకాష్, మినర్వా గ్రూపు డైరెక్టర్ ఓజిలి వరుణ్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా జయప్రకాష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ వంటకాలకు ప్రపంచవ్యాప్త ప్రాచుర్యం తీసుకొచ్చేందుకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇలా ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ఒక్కో ప్రాంతంలో ఒక్కో వంటకానికి ఫేమస్ అని, ఆయా ప్రాంతాలకు ఇతర ప్రాంతాల వంటకాలను కూడా ఫెస్టివల్ ద్వారా పరిచయం చేయవచ్చన్నారు. గృహిణులకు వంటల పోటీలు కూడా నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇప్పటికే తిరుపతిలో ఈ పోటీలు నిర్వహించామని, అక్టోబర్ 20న నెల్లూరులో నిర్వహించేందుకు ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. టూరిజం ఏడి నిస్సార్ అహ్మద్ మాట్లాడుతూ స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటుచేసే ఆలోచన ఉందన్నారు. ఇటీవల భారీ పూతరేకు తయారుచేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్సులో నమోదు చేశామని తెలిపారు. మినర్వా గ్రాండ్ సీనియర్ జిఎం మాథ్యూస్ వర్గీస్ మాట్లాడుతూ నెల్లూరులో ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్ బుధవారం నుండి ఈనెల 25వ తేదీ వరకూ కొనసాగుతుందన్నారు. రూ.500కు 40 వంటకాలకు పైగా కలిగిన బఫెట్ అందిస్తున్నట్లు చెప్పారు. ఈ బఫెట్‌లో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రసిద్ధ వంటకాలు నగరవాసులకు నోరూరించడం ఖాయమన్నారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి ఆహుతులు ఫెస్టివల్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మినర్వా జిఎం కొమ్మిశెట్టి రాజేష్, ఎగ్జిక్యూటివ్ చెఫ్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.