శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

తడ బ్యాంకు చోరీ కేసును ఛేదించిన పోలీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, సెప్టెంబర్ 19: జిల్లాలో సంచలనం రేపిన తడ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు చోరీని పోలీసులు సంఘటన జరిగి 48 గంటలు కూడా కాకమునుపే ఛేదించగలిగారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను బుధవారం స్థానిక ఉమేష్‌చంద్ర సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో గుంటూరు రేంజ్ ఐజి వి.వేణుగోపాలరావు వెల్లడించారు. ఆయన తెలిపిన సమాచారం మేరకు.. కావలికి చెందిన కొత్తపల్లి పవన్‌కుమార్ ఎంబిఏ పూర్తిచేసి తడలోని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకులో డిప్యూటీ మేనేజర్‌గా పని చేస్తున్నారు. అంతక్రితం కావలిలో పనిచేస్తూ అక్కడి బ్యాంక్ మేనేజర్‌తో గొడవపడి మానేశారు. అనంతరం గూడూరులోని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకులో డిప్యూటీ మేనేజర్ హోదాలో పనిచేస్తూ సంబంధిత శాఖ మేనేజర్‌తో గొడవ పడడంతో అతడ్ని తడకు బదిలీ చేశారు. అక్కడ కూడా సిబ్బందితో తరచూ గొడవపడుతూ ఉద్యోగానికి రాజీనామా చేశారు. రాజీనామాకు అనుమతి కోసం ఎదురుచూస్తున్న సమయంలో బ్యాంక్ క్యాషియర్ శిక్షణనిమిత్తం వెళ్లాల్సి రావడంతో గత నెల 14 నుండి పవన్‌కుమార్‌కు క్యాషియర్ బాధ్యతలు అప్పచెప్పారు. అయితే మొదట్నుంచి వివాదాస్పదుడైన పవన్‌కుమార్ ఎలాగైనా బ్యాంకులోని నగదు దొంగిలించి దూరంగా పారిపోయి వ్యాపారం చేసుకుందామని పన్నాగం పన్నాడు. ఈక్రమంలో తన వద్ద ఉన్న స్ట్రాంగ్‌రూం తాళాలకు తోడు బ్యాంక్ మేనేజర్ విష్ణుకుమార్ వద్ద ఉన్న మరో సెట్ తాళం చెవులను అతనికి తెలియకుండా తస్కరించాడు. ఈనెల 16న రాత్రి ఏడున్నరకు బ్యాంక్ వద్దకెళ్లి బ్యాంక్ లోపల పనుందంటూ సెక్యూరిటీ గార్డు చేత తాళాలు తీయించాడు. లోపలకెళ్లిన పవన్‌కుమార్ తన వద్ద ఉన్న తాళాలతో స్ట్రాంగ్‌రూం తెరచి అందులో ఉన్న రూ.కోటి నగదును తనతో తెచ్చుకున్న బ్యాగులో సర్దుకొని బైటకు వచ్చి తాను తీసుకొచ్చిన కారులో పారిపోయాడు. ఉదయం బ్యాంక్‌కు వచ్చిన మేనేజర్ విష్ణుకుమార్ స్ట్రాంగ్‌రూంలో నగదు చోరీకి గురైనట్లు గుర్తించాడు. పవన్‌కుమార్‌కు ఫోన్ చేయగా అతని ఫోన్ స్విచ్చ్ఫా చేయబడి ఉంది. వెంటనే తడ పోలీసులకు జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేశారు. వెంటనే ఉన్నతాధికారుల ఆదేశాలతో గూడూరు డిఎస్పీ రాంబాబు నేతృత్వంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి నిందితుడి కోసం గాలింపు చర్యలు తీవ్రతరం చేశారు. ఎట్టకేలకు అక్కడక్కడా తిరుగుతూ పూణేలోని తన స్నేహితుని వద్దకు వెళ్లేందుకు పవన్‌కుమార్ ప్రయత్నిస్తుండగా కావలి సమీపంలోని రుద్రకోట వద్ద అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి 99 లక్షల 91 వేల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూ.9 వేలను నిందితుడు ఖర్చు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. కేసును స్వల్పకాలంలో ఛేదించి నిందితుడిని అదుపులోకి తీసుకోవడంతో పాటు చోరీకి గురైన సొత్తు మొత్తాన్ని స్వాధీనం చేసుకోవడంలో ప్రతిభ కనబర్చిన తడ ఎస్సై డి.వెంకటేశ్వరరావు, సిబ్బంది శరత్‌కుమార్, గిరీష్, భాస్కర్, పోలయ్య, మురళి, నవాజ్‌ఖాన్‌లకు ఐజి వేణుగోపాల్‌రెడ్డి రివార్డులు అందచేసి అభినందించారు. ఈ సమావేశంలో ఎఎస్పీ పరమేశ్వరరెడ్డి, ఓఎస్‌డి (క్రైం) బాలాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

చెంగాళమ్మ ఆలయంలో పవిత్రోత్సవాలకు ఏర్పాట్లు
సూళ్లూరుపేట, సెప్టెంబర్ 19: తెలుగు, తమిళ ఆరాధ్య దైవమైన చెంగాళమ్మ ఆలయంలో శుక్రవారం నుంచి మూడు రోజులపాటు పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పాలకమండలి అధ్యక్షుడు ముప్పాళ్ల వెంకటేశ్వర్లురెడ్డి, ఈవో ఆళ్ల శ్రీనివాసరెడ్డి దగ్గరుండి చేస్తున్నారు. మూడు రోజులపాటు వేదపండితులచే గర్భగుడితో పాటు రాజగోపుర కలశాలకు శుద్ధిపూజలు చేయనున్నారు. తొలిసారిగా చెంగాళమ్మ ఆలయంలో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక హోమగుండాలు, చలువ పందిళ్లు, హోమపూజలకు సర్వం సిద్ధం చేస్తున్నట్లు చైర్మన్ తెలిపారు. ఏర్పాట్లను పాలకమండలి సభ్యులు ఎ రమేష్, పులుగు శ్రీనివాసులరెడ్డి, పిట్ల సుహాసిని పరిశీలించారు.