శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

రాష్ట్ర ప్రత్యేకహోదాను మోదీకి తాకట్టు పెట్టింది చంద్రబాబే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గూడూరు, సెప్టెంబర్ 23 : రాష్ట్రానికి ప్రత్యేక హోదా సంజీవిని కాదంటూ మోదీకి తాకట్టుపెట్టిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి విరుచుకపడ్డారు. ఆదివారం గూడూరు పట్టణంలోని ఓ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత నాలుగేళ్లు మోదీతో కాపురం చేసిన చంద్రబాబు నేడు మోదీని దుయ్యబట్టడం ఎన్నికల స్టంట్‌గా అభివర్ణించారు. గతంలో మోదీ ఏది చెపితే అది చేసిన చంద్రబాబు ప్రస్తుతం కేంద్రప్రభుత్వంలోని నాయకులను విమర్శించడం అర్ధరహితమన్నారు. చంద్రబాబు నాయుడు పాలన అప్రజాస్వామ్యకం, అన్యాయం, దుర్మార్గమన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అనేక అభివృద్ధి కార్యక్రమాలను రెండుసార్లు ముఖ్యమంత్రిగా ప్రతి కుటుంబానికి ఉపయోగపడ్డారన్నారు. నేడు చంద్రబాబు అక్రమార్జనే ధ్యేయంగా పరిపాలిస్తున్నారన్నారు. చంద్రబాబు పాలనలో రైతులు ఆత్మహత్యలతోపాటు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ప్రతి నిత్యం పోరాటం చేస్తూ విద్యార్థులకు, పారిశ్రామిక వేత్తలకు, ప్రజలకు అండదండగా నిలబడింది జగన్‌మోహన్‌రెడ్డేనన్నారు. మరో మాజీ ఎంపీ వెలగపల్లి వరప్రసాద్‌రావు మాట్లాడుతూ కృష్ణపట్నం పోర్టు రాకుండా అడ్డుకున్న వ్యక్తి చంద్రబాబు అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రానికి తీరని అన్యాయం చేసింది కూడా ఆయనేనని అలాంటి వ్యక్తి ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మోదీపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో ప్రధానమైన మూడువర్గాలైన నేదురుమల్లి, మేకపాటి, నల్లపరెడ్డిలు ఒకే వేదికపైకి రావడం ఆనందంగా ఉందన్నారు. ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలను ప్రజల వద్దకు తీసుకెళ్లి ఆయన గెలుపుకోసం నిరంతరం కృషి చేయాలన్నారు. వైసీపీ సీనియర్ నేత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో పలువురు పలు రకాలుగా నేదురుమల్లి నల్లపరెడ్డి కుటుంబాల మధ్య గొడవలు ఉన్నాయని దుష్ప్రచారం చేయడం నిజం కాదన్నారు. నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో నల్లపరెడ్డి, మేకపాటి ఆధ్వర్యంలో జిల్లాలో వైసీపీని అధికారంలోకి తీసుకురావడానికి తమ వర్గం ద్వారా శక్తివంచన లేకుండా కృషి చేస్తామని అన్నారు. వైసీపీ సీనియర్ నాయకులు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, నేదురుమల్లి పద్మనాభరెడ్డి మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో బలమైన వర్గాలు ఏకమై వైసీపీకి అధికారం కట్టబెట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ బహిరంగ సభకు ముందు స్థానిక ఆర్‌అండ్‌బి అతిథి గృహం నుంచి వైసీపీ కార్యకర్తలు, నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. దీంతో వైసీపీ శ్రేణులు కదం తొక్కి ఆనందోత్సాహాలతో నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో గూడూరు సమన్వయకర్త మేరిగ మురళి, బత్తిన విజయ్‌కుమార్, మల్లు విజయ్‌కుమార్‌రెడ్డి, కోడూరు మీరారెడ్డి, నాశిన నాగులు, బొమ్మిడి శ్రీనివాసులు, చోళవరం గిరిబాబు, కామిశెట్టి సత్యనారాయణ, కొడవలూరు ధనుంజయరెడ్డి, నల్లపరెడ్డి వినోద్‌రెడ్డి, రాజారెడ్డి, రాధాకృష్ణారెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు.

వెంకటాచలంలో పవన్ కల్యాణ్‌కు ఘనస్వాగతం
* అభిమానులకు అభివాదం చేసిన పవన్ కళ్యాణ్
వెంకటాచలం, సెప్టెంబర్ 23: వెంకటాచలం స్వర్ణటోల్ ప్లాజా వద్ద అదివారం ఉదయం జనసేన అధినేత, సీనీనటుడు పవన్ కల్యాణ్‌కు అభిమానులు, జనసేన కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. నెల్లూరు నగరంలోని బారాషాహిద్ దర్గా వద్ద జరుగుతున్న రొట్టెల పండుగకు హాజరయ్యేందుకు రేణిగుంట విమానాశ్రయం నుంచి నెల్లూరుకు రోడ్డు మార్గన కారులో వచ్చారు. పవన్ కల్యాణ్ రాకకోసం వెంకటాచలం మండలంలోని పలు ప్రాంతాల్లో ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తలు ఉదయం నుంచి ఎదురుచూపులు చూసారు. రామదాసు కండ్రిగ, చవటపాళెం పంచాయతీ ఎర్రగుంట, స్వర్ణ టోల్‌ప్లాజా, గొలగమూడి క్రాస్‌రోడ్డు, కాకుటూరు, చెముడుగుంట తదితర ప్రాంతాల్లో పవన్ అభిమానులు జాతీయ రహదారిపై పవన్ రాకకోసం ఎదురుచూడగా పవన్ కల్యాణ్ కారు నుంచే వారికి అభివాదం చేసుకుంటూ వెళ్లిపోయాడు. వెంకటాచలంలోని స్వర్ణ టోల్‌ప్లాజా వద్దకు పలు గ్రామాలకు చెందిన పవన్ కల్యాణ్ అభిమానులు, కళాశాల విద్యార్థులు, జనసేన కార్యకర్తలు పవన్ కల్యాణ్ రాకకోసం ఉదయం నుంచే భారీగా చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ టోల్‌ప్లాజా వద్దకు చేరుకోగానే అభిమానులు, జనసేన కార్యకర్తలు గజమాలతో సత్కరించారు. ఆయన వారికి ఆత్మీయ అభివాదం చేసి అక్కడ నుంచి కదిలి ముందుకు సాగారు. ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ అభిమానులు షేక్ నిజాం, మందల పెంచల్‌రావు, షేక్ సిరాజ్, ఫకృద్ధీన్, టైల్స్ మధు, పఠాన్ ఇమ్రాన్ ఖాన్ తదితరులు ఉన్నారు.