శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ధర్మపోరాట దీక్షకు కన్నబాబు గైర్హాజరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు, నవంబర్ 20: నెల్లూరులో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన ధర్మపోరాట దీక్షకు ఆత్మకూరు నియోజకవర్గ మాజీ ఇన్‌చార్జ్, టీడీపీ సీనియర్ నాయకుడు గూటూరు కన్నబాబు గైర్హాజరయ్యారు. దీక్షకు కన్నబాబుకు ఆహ్వానం అదలేదని అందుకే వెళ్లలేదని ఆయన వర్గాలు అంటుండగా దీక్షకు రావాల్సిందిగా మంత్రి సోమిరెడ్డి ఫోను చేసి పిలిచినట్లు మరోవర్గం వెల్లడిస్తోంది. ఆత్మకూరులో నెలకొంటున్న రాజకీయ గందరగోళ పరిస్థితులపై విసుగు చెందిన కన్నబాబు చాలాకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు కొత్త పేర్లు తెరపైకి రావడం, వచ్చిన వారు ఆయన్ను విస్మరించడం పరిపాటిగా మారింది. ఇటీవల వచ్చిన మాజీ శాసనసభ్యులు బొల్లినేని కృష్ణయ్య ఓవైపు అందరినీ కలుపుకుపోతానని చెబుతూనే కన్నబాబును పరిగనలోకి తీసుకోలేదు. పార్టీ కార్యకలాపాల్లో తనను పక్కనపెడుతున్నారని గూటూరు తన సన్నిహితుల వద్ద వాపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. సహనం నశించిపోవడంతో ఏకంగా జిల్లా పార్టీ కార్యాలయంలోనే దీక్షకు దిగిన విషయం తెలిసిందే. అవగాహనలోపం కారణంగా కన్నబాబుకు సమ ప్రాధాన్యత ఇవ్వలేక పోయినట్లు మంత్రితో పాటు జిల్లా అధ్యక్షులు పొరపాటును అంగీకరించారు. ఇకపై అలా జరుగదని హామీ ఇవ్వడంతో కన్నబాబు నిరసన విరమించారు. అనంతరం ఆత్మకూరులో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో కన్నబాబుతో కార్యక్రమాన్ని నడిపించినట్లు కాస్త కలరింగ్ ఇచ్చారు. కానీ మళ్లీ కథ మొదటికొచ్చింది. ఈనేపథ్యంలోనే ఆమధ్య చేజర్లలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పరస్పరం ఎదుటపడిన బొల్లినేని, కన్నబాబుల మధ్య కొద్దిపాటి సంవాదం చోటుచేసుకుంది. తాను అందరి మద్దతు కోసమే పాకులాడుతున్నానని చెప్పిన బొల్లినేని ఆ తర్వాత జరిగిన ఏ కార్యక్రమంలోనూ కన్నబాబు కనపడలేదు. రెండు రోజుల క్రితం పట్టణంలోని ఓ కల్యాణ మండపంలో జరిగిన సమీక్షా సమావేశంలో కూడా కన్నబాబు కనిపించలేదు. మంగళవారం నెల్లూరులో జరిగే ధర్మపోరాట దీక్షలోనైనా ముఖ్యమంత్రి చర్చించి అందరి మధ్యా సయోధ్య కుదురుస్తారని అనుకున్నారు. కానీ పిలుపుల విషయంలో కూడా పక్షపాతం చూపడంతో కన్నబాబు ముఖ్యమైన సమావేశానికి డుమ్మాకొట్టినట్లు తెలుస్తోంది. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో నిలబెట్టిన నేత కన్నబాబేనని అందరూ ఒప్పుకునే విషయమే. అయినప్పటికీ గుర్తింపు విషయంలో ఆయన్ను ఆఖర్న కూడా నిలబెట్టలేకపోయారని కన్నబాబు వర్గం ఆవేదన వ్యక్తం చేస్తోంది.

సీఎం నిర్ణయం దేశ రాజకీయాలపై ప్రభావం
* మంత్రి సోమిరెడ్డి స్పష్టం
నెల్లూరు, నవంబర్ 20: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జాతీయ స్థాయిలో ఏ నిర్ణయం తీసుకున్నా, దాని ప్రభావం దేశ రాజకీయాలపై ఉంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం ధర్మపోరాట దీక్షా ప్రాంగణంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ సీబీఐ విశ్వసనీయత రోడ్లపై పడిందని, నిజాయితీపరుడైన అధికారి డిఐజి మనీష్‌కుమార్ సిన్హా సీబీఐ బండారాన్ని బైటపెట్టారని గుర్తుచేశారు. సీబీఐ అంటే సెంట్రల్ బోగస్ ఇనె్వస్టిగేషన్ అని, ఇడి అంటే ఎక్ట్స్రాక్షన్ డైరెక్టరేట్ అని మనీష్‌కుమార్ పేర్కొన్న విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. సీబిఐ కేసుల్లో కేంద్ర మంత్రి పార్దీవ్‌బాయ్ చౌదురి లంచాలు తీసుకుంటున్నారని సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలయ్యే పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే చౌదురిని కేంద్ర మంత్రి పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. సీబిఐ భ్రష్టుపట్టి పరువు పోగొట్టుకుందన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సీబీఐకి తాము సమ్మతి ఉపసంహరించినట్లు స్పష్టం చేశారు. మరోవైపు ఆర్‌బిఐ గవర్నర్ కూడా కేంద్రంపై ధ్వజమెత్తే పరిస్థితి ఏర్పడిందన్నారు. న్యాయమూర్తులు ఐదుగురు బైటకొచ్చి సుప్రీంకోర్టు వ్యవస్థపై తిరుగుబాటు చేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. మోడీ, అమిత్‌షాలు రాజ్యాంగ వ్యవస్థల్ని భ్రష్టుపట్టిస్తున్నారని, వారి స్వార్థ హత్యా కుట్ర రాజకీయాల కోసం దేశాన్ని తాకట్టు పెట్టారని అన్నారు. 70 ఏళ్ల స్వాతంత్య్ర భారతదేశ చరిత్రలో ఇలాంటి ఘోరమైన తప్పిదాలు లేవన్నారు. కేసులు స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రంలోని ప్రతిపక్షాలు ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టి బీజేపీతో లాలూచీ పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ సమగ్రతను, భవిష్యత్తును కాపాడాల్సిన పరిస్థితి ఆసన్నమైందన్నారు. దేశంలోని శక్తులన్ని ఏకతాటిపైకి వచ్చి మోదీ అవినీతి, నియంతృత్వ పాలనపై పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఇటువంటి పరిస్థితుల్లో ఏపీ సీఎం చంద్రబాబు దేశంలోని జాతీయ నేతలందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని సోమిరెడ్డి పేర్కొన్నారు.