శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

రూ. 1600 కోట్లతో ఎల్‌ఈడి బల్బుల ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముత్తుకూరు, నవంబర్ 21: జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఎప్పుడూలేని విధంగా రూ. 1600 కోట్ల వ్యయంతో ఎల్‌ఈడి బల్బులు ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. బుధవారం మండలంలోని దమ్మాయిపాలెం, పోతునాయుడు దిబ్బ గ్రామాల్లో మంత్రి పర్యటించారు. ఈసందర్భంగా మహిళలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. పోతునాయుడుదిబ్బ గ్రామంలో రూ. 10 లక్షల వ్యయంతో సిసి రోడ్ల నిర్మాణానికి మంత్రి సోమిరెడ్డి శంకుస్థాపన చేశారు. దమ్మాయిపాలెంలో రూ. 25లక్షల వ్యయంతో నిర్మించనున్న వాటర్ ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇంటింటికీ కొళాయి ఏర్పాటుకు కూడా మంత్రి శంకుస్థాపన చేశారు. 117 పక్కా గృహాలను మంత్రి సోమిరెడ్డి మంజూరు చేశారు. ఈసందర్భంగా గ్రామాల్లో ఆయన పర్యటించి స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో మంత్రి సోమిరెడ్డి ప్రసంగించారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో రూ. 1600 కోట్ల వ్యయంతో ఎల్‌ఇడి బల్బులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామానికి సిమెంటు రోడ్లు ఏర్పాటు చేస్తున్నామని, అహర్నిశలు సర్వేపల్లి నియోజకవర్గం అభివృద్ధికి పాటుపడుతున్నామన్నారు. కోట్లాది రూపాయల నిధులతో అనేక అభివృద్ధి పనులు చేస్తుంటే చూసి ఓర్వలేని కొందరు వైకాపా నాయకులు కోర్టుకెళ్లి స్టేలు తెచ్చి పనులను అడ్డుకుంటున్నారని, దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవలసిన పరిస్థితి వస్తోందని మంత్రి తెలిపారు. నకిలీ డాక్యుమెంట్లు, మద్యం కేసులో ఉన్న ఎమ్మెల్యే కాకాణి గోవర్దనరెడ్డి తనపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి ఎద్దేవా చేశారు. తనపై విమర్శలు చేసే స్థాయి ఎమ్మెల్యే కాకాణికి లేదని సోమిరెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని అత్యధిక మెజార్టీతో గెలిపించి వైకాపాకు తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు మంత్రి సోమిరెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు దువ్వూరు కృష్ణమోహన్‌రెడ్డి, నాయకులు ఈదూరు రాంమోహన్‌రెడ్డి, పబ్బారెడ్డి బలరామకృష్ణారెడ్డి, వై కోదండరామయ్య, నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.

అపోహలతోనే ఉద్రిక్త వాతావరణం
* మిలాద్ ఉన్ నబీ వేడుకల్లో మేయర్
నెల్లూరుసిటీ, నవంబర్ 21: మిలాద్ ఉన్ నబి పర్వదినాన ప్రతియేటా నిర్వహించే జెండా ఉత్సవంపై అపోహలు కల్పించి ఉద్రిక్త వాతావరణం సృష్టించేందుకు కొంతమంది యత్నించారని నగర మేయర్ అబ్దుల్ అజీజ్ ఆరోపించారు. నగరంలో మత సామరస్యం కాపాడేందుకు ఎల్లవేళలా సంసిద్ధంగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు. బుధవారం మహమ్మద్ ప్రవక్త జయంతిని పురస్కరించుకుని నగరంలోని ముస్లింల ఆధ్వర్యంలో స్థానిక బారాషాహిద్ దర్గా ఘాట్ ప్రాంగణంలో వేడుకలను నిర్వహించారు. ఈసందర్భంగా పెద్దఎత్తున ముస్లిం యువత దర్గా ప్రాంగణానికి చేరుకుని మహమ్మద్ ప్రవక్తను కీర్తించే నినాదాలు చేస్తూ జెండా ఉత్సవం ప్రారంభించారు. కార్యక్రమ నిర్వహణ గురించి అపోహలతో కూడిన సమాచారం అందుకున్న పోలీసుశాఖ వారు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దర్గాలో బలగాలను మోహరించారు. జెండా ఉత్సవానికి అనుమతులు లేవంటూ పోలీసులు ఓ దశలో బృందాలను అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న మేయర్ అబ్దుల్ అజీజ్ హుటాహుటిన దర్గా ప్రాంగణానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. పోలీసుశాఖ వారికి నచ్చజెప్పి శాంతియుతంగా జెండా ఉత్సవం జరిగేలా స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో జరిగే అన్ని పండుగలకు సమాన ప్రాధాన్యం కల్పిస్తూ ప్రతిఒక్కరి మనోభావాలను కాపాడుతున్నామని స్పష్టం చేశారు. ప్రజలందరు పరమత సహనాన్ని పాటిస్తూ సాటివారి పండుగలలో మమేకం అవుతూ ఆదర్శ నెల్లూరు నగర నిర్మాణానికి తోడ్పడాలని మేయర్ పిలుపునిచ్చారు.