క్రైమ్/లీగల్

చెల్లెలిని వేధించిన కేసులో అన్న అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనుబోలు, జూలై 9 : సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న వ్యక్తి వరసకు చెల్లెలిని వేధిస్తున్నట్లు ఫిర్యాదు అందడంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని కుడితిపల్లి గ్రామానికి చెందిన చెలమల సుబ్రహ్మణ్యం కుమారై చెలమల సుమలత, కుమారుడు సతీష్ బీటెక్ చేసి నాలుగేళ్ల క్రితం నుంచి హైదరాబాద్‌లోని సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. దీంతో ఆమె పెద్దమ్మ గరిగ మస్తానమ్మ, పెదనాన్న గరిగ వెంకటసుబ్బయ్య ఇంటిలో ఉంటూ ఆఫీసుకు వెళ్లి వస్తుంది. అయితే వీరి చిన్న కుమారుడు గరిగ హరినాథ్ వరసకు చెల్లెలు అయిన సుమలతను వేధిస్తుండటంతో మూడేళ్ల క్రితం నుంచి హాస్టల్‌లో ఉంటూ ఉద్యోగం చేస్తుండేది. అటు తర్వాత హరినాధ్ బెంగళూరులో ఉద్యోగ నిమిత్తం వెళ్లి సుమలతకు ఫోన్ చేసి నన్ను పెళ్లి చేసుకోవాలని వేధిస్తుండగా ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలపడంతో మందలించారు. అటు తర్వాత ఫోన్ నంబరు మార్చేశారు. అప్పటి నుంచి ఆఫీసుకు చెందిన మెయిల్ అడ్రసుకు అసభ్యంగా, బెదిరింపులతో మెయిల్స్ పోస్టు చేస్తున్నాడు. ఈ విషయాన్ని హరినాథ్ తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. అప్పటినుంచి హరినాధ్ ఆమె తల్లిదండ్రులను చంపివేస్తానంటూ మెయిల్స్ పంపిస్తుండటంతో భయపడి తన స్వగ్రామమైన కుడితిపల్లికి మూడు వారాల క్రితం వచ్చి ఇంటి నుంచి ఆఫీసు పనులు చేస్తుకుంటోంది. అయినప్పటికీ తనకు అసభ్యంగా మెయిల్స్ పంపిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఫిర్యాదు మేరకు మనుబోలు ఎస్‌ఐ శ్రీనివాసులురెడ్డి కేసు నమోదు చేసి హరినాథ్‌ను సోమవారం అరెస్టు చేశారు.